కాశ్మీరు సమస్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాశ్మీరు పటం.
ఐక్యరాజ్యసమితి వారి కాశ్మీరు పటం.

కాశ్మీరు వివాదం లేదా కాశ్మీరు సమస్య అన్నది భారతదేశం, పాకిస్తాన్ ల మధ్య, కొంతమేరకు భారత చైనాల మధ్యనా ఉన్న ప్రాదేశిక వివాదం.[1] కాశ్మీరు ప్రధాన అంశంగా భారతదేశం, పాకిస్తాన్ల నడుమ 1947 భారత పాక్ యుద్ధం, 1965 యుద్ధం, కార్గిల్ యుద్ధం జరిగాయి. అంతేగాక భారతదేశం, పాకిస్తాన్ లు సియాచెన్ గ్లేసియర్ పై పట్టుకోసం పలు ఘర్షణలు చేశాయి. జమ్మూ కాశ్మీర్ మొత్తంలో దాదాపు 55 శాతం భూభాగం, 70% జనాభా భారత పాలనలో ఉంది. జమ్ము, కాశ్మీర్ లోయ, లడాఖ్, సియాచిన్ గ్లేసియర్ ప్రాంతాలు భారత నియంత్రణలో ఉన్నాయి. పాకిస్తాన్ దాదాపుగా 30 శాతం భూభాగాన్ని (ఆజాద్ కాశ్మీరు, గిల్గిట్ బల్టిస్తాన్) ఆక్రమించింది. మిగతా 15% భూభాగం చైనా ఆక్రమణలో ఉంది.[2][3][4] ప్రస్తుతం షాక్స్ గమ్ లోయ, అక్సాయ్ చిన్ ప్రాంతాలను ఆక్రమించుకుంది. 1962 నాటి భారత చైనా యుద్ధం నాడు చైనా ఆక్రమించిననాటి నుంచీ భారతదేశం ఈ ప్రాంతంపై చైనా అధికారాన్ని వ్యతిరేకిస్తోంది.[5]

కాశ్మీరీ చొరబాటుదారులు, భారత ప్రభుత్వం మధ్య ఏర్పడ్డ వివాదానికి మూలకారణం స్థానిక స్వయంప్రతిపత్తి అని ఒక వాదన.[6] 1970 దశకం చివరి నుంచి 1988 వరకూ తప్ప ప్రజాస్వామ్య స్థితిగతులు నెలకోలేదు. 1988 నాటికి పలు ప్రజాస్వామ్య సంస్కరణలు మళ్ళీ స్థానిక పరిస్థితుల కారణంగా వెనక్కిపోయాయి. మళ్ళీ తిరిగి కాశ్మీరులో అల్లకల్లోలం ప్రారంభమైంది.[6] 1987లో జరిగిన వివాదాస్పద రాష్ట్ర ఎన్నికల[7] అనంతరం వేర్పాటువాదం పుంజుకుని, కొందరు రాష్ట్ర శాసన సభ్యులు తిరుగుబాటు దళాలను కూడా ఏర్పరుచుకున్నారు.[8][9][10] 1988 జూలైలో వరుసగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలు, ప్రదర్శనలు, దాడులతో కాశ్మీరు కల్లోలం ప్రాంభమైంది.

జమ్ము, కాశ్మీర్లో నెలకొన్న సంక్షోభం కారణంగా వేలాదిమంది మరణించినా, [11] క్రమంగా ఇటీవలి సంవత్సరాల్లో వివాదంలో ప్రాణనష్టం తగ్గుతోంది.[12][13]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Q&A: Kashmir dispute". బిబిసి న్యూస్. Retrieved 10 April 2015.
  2. Joseph J. Hobbs (13 March 2008). World Regional Geography. CengageBrain. p. 314. ISBN 978-0495389507.
  3. Ie Ess Wor Reg Geog W/Cd. Thomson Learning EMEA. 2002. ISBN 9780534168100. India now holds about 55% of the old state of Kashmir, Pakistan 30%, and China 15%.
  4. Margolis, Eric (2004). War at the Top of the World: The Struggle for Afghanistan, Kashmir and Tibet (paperback ed.). Routledge. p. 56. ISBN 9781135955595.
  5. "Controversies surrounding Republic Day celebrations in South Tibet solved". Retrieved 27 January 2016.
  6. 6.0 6.1 Conflict Summary, India: Kashmir, "Roots of Conflict and the emergence of Kashmir Insurgents" Archived 2017-10-01 at the Wayback Machine Uppsala Conflict Data Program Conflict Encyclopedia, Retrieved 2016-04-15
  7. "Elections in Kashmir". Kashmirlibrary.org. Archived from the original on 1 ఫిబ్రవరి 2017. Retrieved 6 January 2013.
  8. "India Pakistan | Timeline". BBC News. Retrieved 2 February 2010.
  9. "Kashmir: A History Littered With Rigged Elections (by Mushtaq A. Jeelani) – Media Monitors Network". Mediamonitors.net. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 2 February 2010.
  10. Hussain, Altaf (14 September 2002). "South Asia | Kashmir's flawed elections". BBC News. Retrieved 2 February 2010.
  11. Constable, Pamela (9 June 2002). "A Good Voice Silenced: Kashmir's Loss Is Also Mine". The Washington Post. Retrieved 14 September 2015.
  12. Emily Wax (28 August 2008). "Peaceful Protests in Kashmir Alter Equation for India". The Washington Post. Retrieved 23 November 2010.
  13. Trofimov, Yaroslav (15 December 2008). "A New Tack in Kashmir". The Wall Street Journal. Retrieved 2 February 2010.

ఇతర లింకులు

[మార్చు]