ఖవ్వాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖవ్వాలి, ఆబిదా పర్వీన్




వ్యాసాల క్రమం
ఇస్లామీయ సంస్కృతి

నిర్మాణాలు

అరబ్ · అజేరి
ఇండో-ఇస్లామిక్ · ఇవాన్
మూరిష్ · మొరాక్కన్ · మొఘల్
ఉస్మానియా · పర్షియన్
సూడానో-సహేలియన్ · తాతార్

కళలు

ఇస్లామీయ లిపీ కళాకృతులు · మీనియేచర్లు · రగ్గులు

నాట్యము

సెమా · విర్లింగ్

దుస్తులు

అబాయ · అగల్ · బౌబౌ
బురఖా · చాదర్ · జెల్లాబియా
నిఖాబ్ · సల్వార్ కమీజ్ · తఖియా
తాబ్ · జిల్‌బాబ్ · హిజాబ్

శెలవు దినాలు

ఆషూరా · అర్బయీన్ · అల్ గదీర్
చాంద్ రాత్ · ఈదుల్ ఫిత్ర్ · బక్రీద్
ఇమామత్ దినం · అల్ కాదిమ్
సంవత్సరాది · ఇస్రా, మేరాజ్
లైలతుల్ ఖద్ర్ · మీలాదె నబి · రంజాన్
ముగామ్ · షాబాన్

సాహిత్యము

అరబ్బీ · అజేరి · బెంగాలి
ఇండోనేషియన్ · జావనీస్ · కాశ్మీరీ
కుర్దిష్ · పర్షియన్ · సింధి · సోమాలి
దక్షిణాసియా · టర్కిష్ · ఉర్దూ

సంగీతము
దస్త్‌గాహ్ · గజల్ · మదీహ్ నబవి

మఖామ్ · ముగామ్ · నషీద్
ఖవ్వాలి

థియేటర్

కారాగోజ్, హాకివత్ · తాజియా

ఇస్లాం పోర్టల్

ఖవ్వాలి : (ఆంగ్లం :Qawwali (ఉర్దూ/పర్షియన్/పష్తో/సింధీ/సెరాయికి: قوٌالی; పంజాబీ/ముల్తాని: ਕ਼ੱਵਾਲੀ, قوٌالی; బ్రజ్‌భాష/హిందీ: क़व्वाली ) సూఫీ తత్వనికి చెందిన ఓ ఆధ్యాత్మిక సంగీత విధానము. ఇది దక్షిణాసియాలో చాలా ప్రాచుర్యం పొందినది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో అమితంగా ప్రాచుర్యం పొందినది. ఈ కళారీతిలో ఖవ్వాలీ సాహిత్యానికి, సంగీతానికి సూఫీ తరీకా అవలంబీకులు తన్మయమై ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు. ఈ ఆధ్యాత్మికానందంలో అల్లాహ్ కు దగ్గరౌతారని, అల్లాహ్ కు పొందుతారనే విశ్వాసం.

వ్యుత్పత్తి

[మార్చు]

అరబ్బీ భాషలో ఖౌల్ (قَوْل) అనగా ముహమ్మద్ ప్రవక్త యొక్క ప్రవచనము, ఖవ్వాల్ అనగా ఈ ఖౌల్ ను కవితా రూపంలో గానంచేసేవాడు. ఖవ్వాలీ ఆవిర్భావం 8వ శతాబ్దంలో పర్షియా (నేటి ఇరాన్-ఆప్ఘనిస్తాన్ ప్రాంతం) లో జరిగింది. 11వ శతాబ్దంలో సాంప్రదాయిక సంగీతమైన సమా లేదా సమాఖ్వాని భారత ఉపఖండం, టర్కీ, ఉజ్బెకిస్తాన్ లలో ప్రవేశించింది. అమీర్ ఖుస్రో చిష్తియా తరీకాకు చెందినవాడు, ఇతను ఢిల్లీలో వుండేవాడు, పర్షియన్ సంగీతాన్ని మలచి, భారతీయ సంగీతంగా రూపొందించాడు. ఇతడి సూఫీ కవితలు, ఖవ్వాలీలు జగత్-ప్రసిద్ధి. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి ఆద్యుడుగానూ ఇతనికి భావిస్తారు. సాధారణంగా ఖవ్వాలీ పాట కచ్చేరీని గాని సభను గాని మెహఫిల్-ఎ-సమాగా వ్యవహరిస్తారు.

కవితా వస్తువు

[మార్చు]

ఈ ఖవ్వాలి ప్రధానంగా ఉర్దూ, పంజాబీ భాష లలో కానవస్తుంది. కొన్ని పాటలు పారశీకంలోనూ వుంటాయి. భారత్ లో ఐతే, బ్రజ్‌భాష,, ప్రాంతీయ భాషల యాసలు, ప్రాంతీయ భాషల ఉపయోగాలూ కానవస్తాయి.[1][2] ప్రాంతీయ భాషలలోనూ ఖవ్వాలీలు కానవస్తాయి. ఖవ్వాలీలకు భాషల అంక్షలు లేవు. ఆంధ్రప్రదేశ్ లోనూ అక్కడక్కడా తెలుగు భాషోపయోగం జరిగడం కానవస్తుంది. కాని కవితావస్తువు మాత్రం ఆధ్యాత్మిక, ధార్మిక రంగును కలిగివుంటుంది. ఈ ఖవ్వాలీల ప్రధానోద్దేశ్యం ఈశ్వరప్రేమ, మానవప్రేమ, భక్తి, ముక్తి, సర్వమానవ సోదరభావాలు.

ఖవ్వాలీలు కవితావస్తువుల ఆధారంగా అనేక విభాగాలు కలిగి ఉంది.

  • హమ్ద్ : అరబ్బీలో హమ్ద్ అనగా ఈశ్వరస్తోత్రం. ఖవ్వాలీ ప్రోగ్రాం ఈ హమ్ద్ తోనే ప్రారంభమవుతుంది.
  • నాతే షరీఫ్ : అరబ్బీ భాషలో నాత్ అనగా విశదం చేయుట, అనగా ప్రవక్తగారి గూర్చి విశదం చేయుట. ఖవ్వాలీ ప్రారంభంలో హమ్ద్ తరువాత నాత్ వుండడం సాంప్రదాయం.
  • మన్‌ఖబత్ : ఆదర్శపురుషుల గూర్చి ప్రశంశా కవితను మన్‌ఖబత్ అని వ్యవహరిస్తారు.
  • మర్సియా : అరబ్బీ భాషలో మర్సియా అనగా మరణించినవారి గూర్చి కీర్తించడం. ప్రత్యేకంగా కర్బలా వీరులగూర్చి స్తుతించడం. ఈ సాంప్రదాయం షియా ముస్లింలలో ఎక్కువగా కానవస్తుంది.
  • గజల్ : అరబ్బీ భాషలో ప్రేమ సంభాషణ అని వ్యవహరిస్తారు. ఈ కవితా గానం సెక్యులర్ గాను, జీవన తత్వం తోనూ నిండి వుండడం చూస్తాము.
  • కఫి : ఇది పంజాబీ, సరాయికి లేదా సింధీ భాషలలో కానవచ్చే కవితా రూపం. ఈ రీతి కవులు షా హుసేన్, బుల్లేహ్ షా, సచాల్ సర్‌మస్త్. ప్రఖ్యాత కఫీలకు ఉదాహరణ, నీ మైన్ జానా జోగీ దే నాల్,, మెరా పియా ఘర్ ఆయా.
  • మునాజాత్ : అరబ్బీ భాషలో మునాజాత్ అనగా రాత్రి ఏకాంతవేళ ఈశ్వరునితో సంభాషణ లేదా ప్రార్థన. ఇంకనూ అల్లాహ్ కు ధన్యవాదాలు తెలిపే కవితా రూపం. ఈ మునాజాత్ ఎక్కువగా పర్షియన్ భాషలో పాడడం కానవస్తుంది. దీనిని కనిపెట్టి ప్రారంభించినవాడు మౌలానా జలాలుద్దీన్ రూమి.

ఖవ్వాలీ పార్టీ కూర్పు

[మార్చు]

ఖవ్వాలి కచేరి ఇచ్చే కళాకారుల గ్రూపుకు "పార్టీ" (ఉర్దూలో హమ్‌నవా) అని సాధారణంగా సంబోధిస్తారు. సాధారణంగా ఎనిమిది లేక తొమ్మిది మంది గల గ్రూపు. ఇందులో ప్రధాన గాయకుడు (ఖవ్వాల్), తోడు గాయకులు ఇద్దరు (ప్రధాన గాయకుడికి ఇరువైపులా), ఒకటి లేదా రెండు హార్మోనియంలు (ఒక హార్మోనియాన్ని ప్రధాన గాయకుడు స్వయంగా వాయిస్తాడు), తబలా, ఢోలక్, బుల్‌బుల్ తార వాయిద్యకారులు,, మిగతావారు కోరస్ గా వుంటారు.

ఖవ్వాలీ పార్టీ ఉపయోగించే వాద్య పరికరాలు

[మార్చు]

సాంప్రదాయిక చిష్తియా సూఫీ ఖవ్వాలీ తరీకా

[మార్చు]
  • వాయిద్య సంగీతం : ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి గారి ఆగనమనాన్ని సూచించే ఒక తరీకా. సూఫీల విశ్వాసం ప్రకారం నబీ, సిద్దీక్, షహీద్, 'సాలెహ్' లకు మరణం అంటూ వుండదు. వీరు ఒక స్థితి నుండి ఇంకో స్థితికి మార్పు చెందుతూ వుంటారు. (అల్లాహ్ చే) ఆజ్ఞాపించినపుడల్లా తిరిగీ ప్రత్యక్షమవుతూనే వుంటారు. ప్రత్యేకంగా వీరి ఉత్సవలు జరిగినపుడల్లా వీరు ఆగమనం చేస్తూనే వుంటారు.
  • హమ్ద్
  • నాత్
  • మన్‌ఖబత్ -ఎ-అలి
  • మన్‌ఖబత్ ఎ గౌస్ : అబ్దుల్ ఖాదిర్ జీలానిని ప్రశంసిస్తూ పాడే ఖవ్వాలీ
  • మన్‌ఖబత్ ఎ ఖ్వాజా : మొయినుద్దీన్ చిష్తిని ప్రశంసిస్తూ పాడే ఖవ్వాలీ
  • మన్‌ఖబత్ ఎ షేఖ్ : షేఖ్/పీర్ (గురువు) ను ప్రశంసిస్తూ ఉర్సు కార్యక్రమాలలో పాడే ఖవ్వాలీ
  • రంగ్ లేదా బాధ్వా : పీర్ యొక్క ఉర్సు కార్యక్రమంలో పాడే గీతం. ప్రత్యేకంగా దీనిని అమీర్ ఖుస్రో రచించాడు. పీర్ లేదా షేఖ్ పరమదినాన "రంగ్", జన్మదినాన "బాధ్వా" పాడుతారు.

క్రితపు ప్రఖ్యాతమైన ఖవ్వాల్ లు

[మార్చు]

నేటి ప్రఖ్యాత ఖవ్వాల్ లు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Bollywood Reinvents the Qawwali – With a Vengeance". The Day After: An International Illustrated Newsmagazine of India. Archived from the original on 2009-01-26. Retrieved 2007-02-23.
  2. "Delhi's Qawwal Bachchon ka Gharana lights up Ramadan night at T2F". Daily Times: Leading News Resource of Pakistan. Archived from the original on 2013-04-16. Retrieved 2007-02-23.
"https://te.wikipedia.org/w/index.php?title=ఖవ్వాలి&oldid=3438403" నుండి వెలికితీశారు