చిరంజీవి (1969 సినిమా)
చిరంజీవి (1969 సినిమా) (1969 తెలుగు సినిమా) | |
చిరంజీవి సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సావిత్రి |
తారాగణం | సావిత్రి, చలం |
సంగీతం | తాతినేని చలపతిరావు |
నిర్మాణ సంస్థ | అరుణాచలం స్టూడియోస్ |
భాష | తెలుగు |
చిరంజీవి 1969, ఏప్రిల్ 5న విడుదలైన ప్రయోగాత్మక తెలుగు చలనచిత్రం. అరుణాచలం స్టూడియోస్ బ్యానర్‌పై ఎ.కె.వేలన్ నిర్మించిన ఈ సినిమాకు సినీనటి సావిత్రి దర్శకత్వం వహించింది.[1] సినిమా మొత్తం ఒకే సెట్టింగు (ఆసుపత్రి సెట్టింగు)లో చిత్రీకరించడం ఈ సినిమా ప్రత్యేకత. కె.బాలచందర్ తొలిసారిగా దర్శకత్వం వహించిన నీర్‌కుమిళి (నీటిబుడగ) అనే తమిళ సినిమాను తెలుగులో చిరంజీవిగా పునర్మించారు.
నటీనటులు
[మార్చు]- సావిత్రి - ఇందిరాదేవి
- మీనాకుమారి - నర్సు
- విజయభాను
- ప్రభాకర్ రెడ్డి - బాలకృష్ణారావు
- చలం - సత్యం
- జి.రామకృష్ణ - మధు
- భూసార వెంకటేశ్వరరావు (గుంటూరు వెంకటేష్)
- ప్రసాద్
- అల్లు రామలింగయ్య
- సి.హెచ్.కృష్ణమూర్తి
- రావి కొండలరావు
- ఓ.ఎస్.ఆర్.ఆంజనేయులు
- బొడ్డపాటి
- ఉదయలక్ష్మి
సాంకేతికవర్గం
[మార్చు]- మూలకథ: కె.బాలచందర్
- మాటలు: అప్పలాచార్య
- పాటలు: కొసరాజు, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, గోపి
- సంగీతం: తాతినేని చలపతిరావు
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, టి.ఆర్.జయదేవ్, పి.సుశీల, ఎస్.జానకి
- కళ: కె.పి.ముత్తు
- నృత్యం: టి.సి.తంగరాజు
- కూర్పు: ఎ.దండపాణి
- ఛాయాగ్రహణం: ఎన్.ఆర్.మూర్తి, పి.ఎస్.శేఖర్, మూర్తి
- దర్శకత్వం: సావిత్రి గణేశన్
- నిర్మాత: ఎ.కె.వేలన్
కథాసంగ్రహం
[మార్చు]ఊపిరితిత్తులలో కాన్సర్ ఏర్పడిన సత్యం అనే రోగి కొన్నిరోజులలో మృత్యువు కబళించనున్న విషయం ఎరుగనంతవరకూ తాను నవ్వుచూ - ఇతరుల్ని నవ్విస్తూ వుంటాడు. ఆస్పత్రి నుండి విడుదల చేస్తానని డాక్టరు చెప్పిన గడువే తన జీవితకాలంగా తెలుసుకున్న తర్వాత కూడా తాను నవ్వలేక పోయినా-ఇతరుల్ని నవ్వించి లేక సహాయం చేసి జీవితం సార్థకం చేసుకోవాలనుకుంటాడు.
ఆస్పత్రి డాక్టరు కూతురు ఇందిర కూడా డాక్టరే. ఫుట్‌బాల్ ఆటలో కాలు దెబ్బతిని ఆ ఆస్పత్రి చేరిన ఒక యువకునికి మనసు ఇస్తుంది. ఇద్దరూ పరస్పరం ప్రేమించుకుంటారు. ఆయితే కాన్సర్ పరిశోధనకు అమెరికాకు ఇందిర వెళ్ళాల్సివచ్చినా ఇందిర ఆ వ్రయాణాన్ని విరమించుకుంటుంది ఆ యువకుని మోజులో.
కాస్త కాలు నెమ్మదిస్తున్న సమయంలో ఆ యువకుడు పుట్‌బాల్ ఆడపోయి మరల కాలు చెరుపుకుంటాడు. శాశ్వతంగా కాలు తీసేయాల్సి వస్తుంది. ఇందిరతో తన పెళ్ళి ఇష్టంలేని డాక్టర్ తన్ను శాశ్వతంగా అవిటివాణ్నిగా చేశాడని ఆ యువకుని ఆరోపణ. కాని ఇందిర ఆ ఆరోపణను తిరస్కరిస్తుంది. ఆ యువకుణ్ణి హత్యచేసి అతని ఆస్తి కాజేయాలని అతని స్నేహితుడు పన్నిన కుట్రను అదే ఆస్సృతిలోవున్న కాన్సర్ పేషెంటు సత్యం నివారిస్తాడు. తాను నవ్వలేకపోయినా - సుఖపడలేక పోయినా ఇతరుల్ని నవ్విస్తూ - సుఖపెడ్తూ సత్యం కళ్ళుమూసి చిరంజీవి అవుతాడు. ఆస్తులు అంతస్తులు మనసుల్ని వేరుచేయలేవని, మమతలు- మమకారాలు - ఆత్మీయత ముఖ్యమని సత్యం ద్వారా ఎరిగిన డాక్టరు ఆ యువకునితో ఇందిర పెళ్ళికి అంగీకరిస్తాడు. కాని ఇందిర పెండ్లికి అంగీకరించదు. డాక్టర్లు స్వార్థంవలన రోగులను రక్షించడం కొరవడుతూ వుందని తాను అమెరికా వెళ్ళి కాన్సర్ వైద్యం గురించి శిక్షణ పొందాలని నిశ్చయించుకున్నట్లు చెబుతుంది. ఆమె నిర్ణయాన్ని ఆ యువకునితోసహా అందరూ అంగీకస్తారు.[2]
పాటలు
[మార్చు]క్ర.సం. | పాట | రచన | గాయకులు |
---|---|---|---|
1 | జీవితమెంతో తియ్యనిది అందుకనే అతి స్వల్పమది | గోపి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
2 | నడుము ఉందో లేదో తెలవదు నాభి చూస్తే మనసు నిలవదు | ఆరుద్ర | టి.ఆర్.జయదేవ్, ఎస్.జానకి |
3 | చల్లని గాలి అల్లరి అలలు కన్నులలో ఏవేవో బంగారు కలలు | సి.నారాయణరెడ్డి | పి.సుశీల |
4 | అరరెరె బూరి బుగ్గల పిల్లి మొగ్గల చిన్నోడా అరె బుల్లోడా | కొసరాజు | టి.ఆర్.జయదేవ్ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Chiranjeevi (Savithri Ganesan) 1969". ఇండియన్ సినిమా. Retrieved 11 January 2023.
- ↑ విజయ (13 April 1969). "చిత్ర సమీక్ష: చిరంజీవి" (PDF). విశాలాంధ్ర దినపత్రిక. Archived from the original (PDF) on 12 జనవరి 2023. Retrieved 12 January 2023.