నితీశ్ కుమార్ రెడ్డి
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కాకి నితీశ్ కుమార్ రెడ్డి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 2003 మే 26||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | నితీష్, ఎన్కేఆర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి మీడియం ఫాస్ట్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటింగ్ ఆల్ రౌండర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020–ప్రస్తుతం | ఆంధ్రప్రదేశ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023–ప్రస్తుతం | సన్‌రైజర్స్ హైదరాబాద్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి FC | జనవరి 27 2020 ఆంధ్రప్రదేశ్ - కేరళ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి LA | ఫిబ్రవరి 20 2021 ఆంధ్రప్రదేశ్ - విదర్భ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 ఏప్రిల్ 19 |
కాకి నితీశ్ కుమార్ రెడ్డి (జననం 2003 మే 26) ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] ఆయన దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రా క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడతాడు. ఆయన 2019-20 రంజీ ట్రోఫీలో ఆంధ్ర తరపున 2020 జనవరి 27న ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసాడు.[2] ఆయన 2020-21 విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్రా క్రికెట్ జట్టు తరపున 2021 ఫిబ్రవరి 20న తన లిస్ట్ ఎ క్రికెట్ అరంగేట్రం చేసాడు.[3] ఆయన 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర తరపున 2021 నవంబరు 4న తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[4] 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.[5]
ఆల్‌రౌండర్ ఎన్కేఆర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో 2024 ఏప్రిల్ 9న మొహాలిలోని ముల్లన్‌పూర్‌లో మహరాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు సాధించి బ్యాటింగ్‌లో సత్తాచాటాడు.[6][7][8]
బాల్యం
[మార్చు]నితీశ్ కుమార్ రెడ్డి 2003 మే 26న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించాడు. ఆయన తండ్రి హిందూస్థాన్ జింక్ (Hindustan Zinc Limited) మాజీ ఉద్యోగి ముత్యాల రెడ్డి.[9] నితీష్ 5 సంవత్సరాల వయస్సులో ప్లాస్టిక్ బ్యాట్‌తో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. సీనియర్లు క్రికెట్ ఆడటం చూడటానికి ఆయన క్రమం తప్పకుండా హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ గ్రౌండ్ కు వెళ్లేవాడు. ఈ క్రమంలో, ఆయన తండ్రికి ఉదయపూర్ బదిలీ అయింది. అయితే, కొడుకు క్రికెట్ కెరీర్‌ను కొనసాగించడం కోసం తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు నితీష్ వయసు కేవలం 12 ఏళ్లే.
అతని తండ్రి సహకారంతో కోచ్‌లు కుమార స్వామి, కృష్ణారావు, వాటేకర్‌ల వద్ద నితీష్ శిక్షణ పొందాడు.[10][11]
కెరీర్
[మార్చు]అండర్-12, అండర్-14 ఏజ్ గ్రూప్ మ్యాచ్‌ల సమయంలో నితీష్‌ని భారత మాజీ క్రికెటర్ అండ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె. ప్రసాద్ గుర్తించాడు. మధుసూధన రెడ్డి, శ్రీనివాసరావుల కోచింగ్‌లో కడపలోని ఎసిఎ అకాడమీలో శిక్షణ పొందాడు.[12]
ఆయన నాగాలాండ్ క్రికెట్ జట్టుపై 441 పరుగులతో వెనుకంజలో ఉన్న సీజన్‌ను అనుసరించాడు, కేవలం 345 బంతుల్లోనే క్వాడ్రపుల్ టన్ను సాధించి, 2017-18 విజయ్ మర్చంట్ ట్రోఫీలో 26 వికెట్లతో పాటు టోర్నమెంట్ రికార్డు 176.41 సగటుతో 1237 పరుగులతో ముగించాడు. ఇది అతనికి 2017-2018 సీజన్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) 'అండర్ -16లో ఉత్తమ క్రికెటర్' జగ్మోహన్ దాల్మియా అవార్డును తెచ్చిపెట్టింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో బీసీసీఐ అవార్డు పొందిన తొలి ఆటగాడుగా నితీశ్ కుమార్ రెడ్డి గుర్తింపు పొందాడు.[13][14]
మూలాలు
[మార్చు]- ↑ "Nitish Kumar Reddy". ESPNcricinfo. Retrieved 27 January 2020.
- ↑ "Elite, Group A, Ranji Trophy at Ongole, Jan 27-30 2020". ESPNcricinfo. Retrieved 27 January 2020.
- ↑ "Elite, Group B, Indore, Feb 20 2021, Vijay Hazare Trophy". ESPNcricinfo. Retrieved 20 February 2021.
- ↑ "Elite, Group C, Vadodara, Nov 4 2021, Syed Mushtaq Ali Trophy". ESPNcricinfo. Retrieved 4 November 2021.
- ↑ "IPL Auction 2023: Full list of sold and Unsold players". Hindustan Times. Retrieved 17 February 2023.
- ↑ "శెభాష్ నితీష్ కుమార్.. తెలుగోడి సత్తా చూపించావు! వీడియో వైరల్ | Nitish Kumar Reddy to stand tall amid chaos for SRH after terrific Ranji Trophy - Sakshi". web.archive.org. 2024-04-09. Archived from the original on 2024-04-09. Retrieved 2024-04-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "SRH | Nitish Kumar: IPL వేలంలో అతని వంక కూడా చూడలేదు.. నేడు విధ్వంసం.. ఎవరూ ఈ NKR..? Nitish Kumar Reddy performed brilliantly for Sunrisers Hyderabad Know who he is vb – News18 తెలుగు". web.archive.org. 2024-04-09. Archived from the original on 2024-04-09. Retrieved 2024-04-09.
{{cite web}}
: no-break space character in|title=
at position 85 (help)CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Eenadu (29 October 2024). "Nitish Kumar Reddy: నం.1 ఆల్‌రౌండర్ కావడమే లక్ష్యం". Retrieved 29 October 2024.
- ↑ "Junior batting phenom turned all-rounder Nitish Kumar Reddy moves beyond Kohli obsession, earns IPL shot with SRH". Sportstar The Hindu. Retrieved 19 April 2023.
- ↑ "Nitish, the run machine@16". The Hindu. Retrieved 19 April 2023.
- ↑ "Junior batting phenom turned all-rounder Nitish Kumar Reddy moves beyond Kohli obsession, earns IPL shot with SRH". Sportstar The Hindu. Retrieved 19 April 2023.
- ↑ "Nitish, the run machine@16". The Hindu. Retrieved 19 April 2023.
- ↑ "Junior batting phenom turned all-rounder Nitish Kumar Reddy moves beyond Kohli obsession, earns IPL shot with SRH". Sportstar The Hindu. Retrieved 19 April 2023.
- ↑ "Nitish, the run machine@16". The Hindu. Retrieved 19 April 2023.