గిడుతూరి సూర్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1920 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:1995 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 21: పంక్తి 21:
[[వర్గం:సినీ గీత రచయితలు]]
[[వర్గం:సినీ గీత రచయితలు]]
[[వర్గం:1920 జననాలు]]
[[వర్గం:1920 జననాలు]]
[[వర్గం:1995 మరణాలు]]

01:09, 16 డిసెంబరు 2015 నాటి కూర్పు

గిడుతూరి సూర్యం(1920-1995) రచయితగా, కవిగా, సినిమా దర్శకునిగా, సినిమా నిర్మాతగా ప్రసిద్ధుడు. రణభేరి, ఆస్తికోసం,కథానాయకురాలు,విక్రమార్క విజయం,పేదరాశి పెద్దమ్మ కథ,అమృతకలశం,నేను నా దేశం,పంచ కళ్యాణి దొంగల రాణి, పంజరంలో పసిపాప,సంగీత లక్ష్మి,స్వామిద్రోహులు మొదలైన చిత్రాలకు దర్శకునిగా పనిచేశాడు.రాజేశ్వరి చిత్రానికి అనిసెట్టి సుబ్బారావుతో కలిసి పాటలను వ్రాశాడు. పంజరంలో పసిపాప, పంచ కళ్యాణి దొంగల రాణి సినిమాలకు కథ, చిత్రానువాదం సమకూర్చాడు. పంచ కళ్యాణి దొంగల రాణి చిత్రాన్ని నిర్మించాడు. మనదేశంలో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభం కానున్న తొలిరోజులలో టి.వి. కోసం భారతీయనటులతో, రష్యన్ సాంకేతిక నిపుణులతో నలుపు తెలుపుల్లో మొట్టమొదటిసారిగా ‘రామాయణం’ లఘుచిత్రాన్ని నిర్మించాడు. ఇతడు మంచి చిత్రకారుడు కూడా. 1949లో ఇతడు హైదరాబాద్ కుద్బీగూడలో పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్‌ను స్థాపించాడు. ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకునిగా కూడా కొంతకాలం పనిచేశాడు. ఇతని రచనలు సుజాత, తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఉదయిని, ఆనందవాణి తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి.

రచనలు

  1. చక్రఘోష (కావ్యం)
  2. నా విశ్వవిద్యాలయాలు (అనువాదం - మూలం:మాక్సిం గోర్కీ)
  3. అమ్మా (కథ)
  4. కుమారుడి మరణం (కథ)
  5. త్యాగమూర్తి (కథ)
  6. పతిత (కథ)
  7. రజ్జు సర్ప భ్రాంతి (కథ)
  8. లోకం పోకడ (కథ)
  9. మానవుడు చిరంజీవి (మూకాభినయ నాటకము)