బద్దం నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ప్రాచూర్యంలో ఉన్న పేరు జతచేయబడింది
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox_Indian_politician
{{Infobox_Indian_politician
| name = బీ. ఎన్‌. రెడ్డి
| name =బద్దం నరసింహారెడ్డి
|full_name= బద్దం నరసింహారెడ్డి
| image = Baddam Narasimhareddy.jpeg
| image = Baddam Narasimhareddy.jpeg
| caption = బద్దం నరసింహారెడ్డి
| caption = బద్దం నరసింహారెడ్డి

08:01, 6 నవంబరు 2017 నాటి కూర్పు

బీ. ఎన్‌. రెడ్డి
బద్దం నరసింహారెడ్డి

బద్దం నరసింహారెడ్డి


నియోజకవర్గం మిర్యాలగూడ

వ్యక్తిగత వివరాలు

జననం (1931-06-21) 1931 జూన్ 21 (వయసు 92)
నకిరేకల్, నల్లగొండ జిల్లా, తెలంగాణ
మరణం నవంబర్ 6, 2017
హైదరాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి అలివేలు
సంతానం ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు
మతం హిందూ

బద్దం నరసింహారెడ్డి (జూన్ 21, 1931 - నవంబర్ 6, 2017) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు. భారత జాతీయ కాంగ్రెసు తరపున మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1989, 1996, 1998లలో ఎన్నికయ్యారు.

జననం - చదువు

ఈయన నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ గ్రామంలో 1931, జూన్ 21న జన్మించారు. ఈయన తండ్రి పేరు రామచంద్రారెడ్డి.[1] ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఈ మరియు కొలరాడో విశ్వవిద్యాలయం (యు.ఎస్.ఏ) లో ఎం.ఎస్ చేశారు.

వివాహం

1949 డిసెంబరులో అలివేలుతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు.

ప్రవృత్తి

వాస్తుశిల్పి, వాస్తు సలహాదారు, కవి

పదవులు

  • 1989లో 9వ లోకసభ, 1996 లో 11వ లోకసభ, 1998లో 12వ లోకసభ లకు మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం లోక్‌సభ సభ్యులు.
  • 1990-91,1997-98లలో సభ్యులు, సంప్రదింపుల కమిటీ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
  • 1998లో సభ్యులు, కార్యనిర్వాహక కమిటీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (C.P.P.)
  • 1998-99లో సభ్యులు, వాణిజ్య కమిటీ మరియు సలహా కార్యవర్గ సమితి, మంత్రిత్వ శాఖ అధికారము

రచనలు

తెలంగాణ అంశంపై అనేక వ్యాసాలు రాశారు.

  • సామాన్యుని సందేశం, బి.ఎన్. భస్టితలు, బి.ఎన్. భావ తరంగిణి (తెలుగు)
  • ‘Dews of the Dawn’, 'A Glimpse of Practical Vastu' (అంగ్గం),
  • Mangalmaya Vastu Vigyan (Hindi)

అవార్డలు

  • ఉత్తమ రచన (1976) పెళ్ళి కాని పెళ్ళి (సినిమా)
  • రాజీవ్ గాంధీ బంగారు పతకం (1992)
  • రాజీవ్ గాంధీ అవార్డు (1995)
  • ఉద్యోగ్ రత్న అవార్డు (1995)
  • పద్మభూషన్ డా. కె.ఎల్.రావు బంగారు పతకం (1996) యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్.

సందర్శన

ఫ్రాన్స్, హాంకాంగ్, జపాన్, రష్యా, సింగపూర్, యు.కె., యు.ఎస్.ఏ.

ఇతర వివరాలు

  • సభ్యులు Academic Senate, Osmania University, Hyderabad;
  • సభ్యులు Senate, Dr. M.G.R. Medical University, Chennai, Tamil Nadu;
  • వైస్ ఛైర్మన్, చైతన్య భారతి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్

ఓట్ల వివరాలు

మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు

మొత్తం ఓట్లు - 12,26,612
పోలైన ఓట్లు - 8,67,685

మొదటి నలుగురికి పోలైన ఓట్లు

  1. డా. బద్దం నరసింహారెడ్డి (భారత జాతీయ కాంగ్రెసు) 3,34,183
  2. చెరుపల్లి సీతారాములు (భారతీయ కమ్యూనిస్టు పార్టీ) 3,19,685
  3. జుట్టుకొండ సత్యనారాయణ (భారతీయ జనతా పార్టీ) 99,566
  4. రామచందర్ నాయక్ ఇస్లావత్ (స్వతంత్ర అభ్యర్థి) 70,608

మరణం

గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న నరసింహారెడ్డి జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2017, నవంబర్ 6న మరణించారు.[2][3]

వనరులు

  1. లోకసభ జాలగూడు
  2. నమస్తే తెలంగాణ (6 November 2017). "మాజీ ఎంపీ బద్దం నర్సింహారెడ్డి కన్నుమూత". Retrieved 6 November 2017.
  3. ఆంధ్రజ్యోతి (6 November 2017). "మాజీ ఎంపీ కన్నుమూత". Retrieved 6 November 2017.