నర్మదా నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: be:Рака Нармада
చి యంత్రము కలుపుతున్నది: zh-yue:南摩多河
పంక్తి 32: పంక్తి 32:
[[ru:Нармада (река)]]
[[ru:Нармада (река)]]
[[sv:Narmada]]
[[sv:Narmada]]
[[zh-yue:南摩多河]]

19:19, 25 అక్టోబరు 2010 నాటి కూర్పు


నర్మదా లేదా నేర్‌బుడ్డా మధ్య భారత దేశము గుండా ప్రవహించే నది. సాంప్రదాయకముగా ఈ నది ఉత్తర మరియు దక్షిణ భారతానికి సరిహద్దుగా వ్యవహరిస్తున్నది. ఈ నది మొత్తము 1,289 కిలోమీటర్లు పొడవున ప్రవహించుచున్నది. భారత ద్వీపకల్పములో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే మూడే మూడు నదులలో ఇది ఒకటి. మిగిలిన రెండు తపతి నది మరియు మహి నది. నర్మద భారత దేశములో రిఫ్ట్ లోయ వెంటా ప్రవహించే ఏకైక నది. మధ్య ప్రదేశ్ రాష్ట్రములోని అమర్‌కంఠక్ పర్వతాల్లో పుట్టి మొదటి 320 కిలోమీటర్లు సాత్పూరా శ్రేణుల పైభాగమున ఉన్న మాండ్ల కొండలలో మెలికలు తిరుగుతూ ప్రవహించి, జబల్‌పూర్ వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ వింధ్య మరియు సాత్పూరా శ్రేణుల మధ్యనున్న నర్మదా లోయలోకి అడుగు పెడుతుంది. అక్కడి నుండి పశ్చిమంగా ప్రవహించి కాంబే గల్ఫ్ ను చేరుతున్నది. నర్మదా మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్ లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రములో కలుస్తుంది.