కూచిపూడి నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: kn:ಕೂಚಿಪೂಡಿ
పంక్తి 42: పంక్తి 42:


[[en:Kuchipudi]]
[[en:Kuchipudi]]
[[kn:ಕೂಚಿಪೂಡಿ (Kuchipudi)]]
[[kn:ಕೂಚಿಪೂಡಿ]]
[[ta:குச்சிப்புடி]]
[[ta:குச்சிப்புடி]]
[[ml:കുച്ചിപ്പുടി]]
[[ml:കുച്ചിപ്പുടി]]

10:53, 19 మార్చి 2012 నాటి కూర్పు

కూచిపూడి నృత్యరీతికి ఆద్యుడు--సిద్దేంద్ర యోగి

కూచిపూడి నృత్యము, భారతీయ నృత్యరీతులలో ప్రధానమైనది.ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించినది.

చరిత్ర

కూచిపూడి నృత్యం చేస్తున్న నర్తకి.

కూచిపూడి గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. ఇది ప్రాచీన ఆంధ్ర చరిత్రాత్మక నగరమైన (క్రీ పూ 2వ శతాబ్దం )శ్రీకాకుళంకు ఆరు మైళ్ళ దూరంలో ఉన్నది. శాతవాహనులు ఈ కళకు గొప్ప ఆరాధకులుగా ప్రసిద్ధి గాంచారు. అప్పట్లో అత్యంత పవిత్ర దేవాలయమైన ఆంధ్ర విష్ణు దేవాలయం ఆవరణలో లభ్యమైన శాసనాల ప్రకారం దాదాపుగా మూడు వందల మంది దేవదాసీలు రాజమర్యాదలు అందుకునేవారు. ఇక్కడ లభ్యమైన శిల్పాలు కూడా ఆ నృత్య కళాకారిణుల దైవపూజగా భావించే అపురూప భంగిమలను దాచిపెట్టినట్లు కనిపిస్తాయి. చాలాకాలం వరకు ,కూచిపూడి నృత్యం [1] [2]దేవాలయాల్లో ప్రదర్శింపబడేది. సాంప్రదాయం ప్రకారం, పూర్వం బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే కూచిపూడి నృత్యాన్నిచేసేవారు. అందుకే వీరిని కూచిపూడి భాగవతులు అంటారు. 15 వ శతాబ్దంలో సిద్దేంద్ర యోగి, కూచిపూడి నాట్యంలో ఆడవారు నాట్యం చేయడానికి అనుగుణంగా, కొన్ని మార్పులు చేసి దానిని పరిపుష్టం గావించాడు. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, తాడేపల్లి పేరయ్య వంటి కూచిపూడి నృత్య కళాకారులు దీనిని విస్తరించి, సంస్కరించారు. కూచిపూడి నృత్యప్రదర్శన గణేష స్తుతి, సరస్వతీ స్తుతి, లక్ష్మీస్తుతి, పరాశక్తి స్తోత్రాలతో మొదలవుతుంది. ఇది భరతుని 'నాట్య శాస్త్రాన్ని' ఉల్లంఘించదు. చురుగ్గా లయబద్ధంగా కదిలే పాదాలు, శిల్పసదృశమైన దేహభంగిమలు, హస్తాలు, కళ్ళతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలు, మూకాభినయంతో కూచిపూడి నృత్య కళాకారులు సాత్వికాభినయం, భావాభినయం చేయడంలో ఉద్ధండులు. కృష్ణుని భార్య, సత్యభామ ను అనుకరిస్తూ చేసే నాట్యం భామాకలాపం. ఒక ఇత్తడి పళ్ళెంపై పాదాల నుంచి, నాట్యం చేయడాన్నితరంగం అంటారు. ప్రక్కన ఒక గాయకుడు, కర్ణాటక సంగీతశైలిలో కీర్తనలను పాడతాడు. దీనినే నట్టువాంగం అంటారు. ఇందులో మృదంగం, వయొలిన్, వేణువు వంటి వాద్యపరికరాలను ఉపయోగిస్తారు.

కొందరు ప్రముఖ కూచిపూడి నర్తకులు

కూచిపూడి నృత్య ప్రదర్శన: ఆలోకయే శ్రీ బాలకృష్ణం

మూలాలు

బయటి లింకులు

చిత్ర మాలిక