బుద్ధదేవ్ దాస్‌గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుద్ధదేవ్ దాస్‌గుప్తా
Master Class by the Art of story writing in Cinema-Buddhadeb Das Gupta, Film Maker, at the 45th International Film Festival of India (IFFI-2014), in Panaji, Goa on November 27, 2014.jpg
బుద్ధదేవ్ దాస్‌గుప్తా (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, 45వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2014)
జననం(1944-02-11)1944 ఫిబ్రవరి 11
మరణం2021 జూన్ 10(2021-06-10) (వయసు 77)
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతదేశం
వృత్తిబెంగాలీ సినిమా నిర్మాత, దర్శకుడు, కవి

బుద్ధదేవ్ దాస్ గుప్తా (11 ఫిబ్రవరి, 1944 – 10 జూన్, 2021) బెంగాలీ సినిమా నిర్మాత, దర్శకుడు, కవి. బాగ్ బహదూర్, తహదర్ కథ, చరాచర్, ఉత్తర మొదలైన సినిమాలను రూపొందించాడు. బాగ్ బహదూర్ (1989), చరాచర్ (1993), లాల్ దర్జా (1997), మోండో మేయర్ ఉపఖ్యాన్ (2002), కాల్‌పురుష్ (2008) మొదలైన ఐదు సినిమాలు జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులు గెలుపొందాయి. దూరత్వ (1978), తహదర్ కథ (1993) బెంగాలీ ఉత్తమ చలన చిత్రాలుగా జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నాయి. ఉత్తర (2000), స్వాప్నర్ దిన్ (2005) చిత్రాలకు రెండుసార్లు ఉత్తమ దర్శకుడుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. గొవిర్ అరలే, కాఫిన్ కింబ సూట్కేస్, హింజాగ్, చ్చాట కహానీ, రోబోట్స్ గాన్, శ్రేష్ఠ కవిత, భోంబొలెర్ అశ్చర్య కహానీ ఓ కవిత వంటి కవితా సంపుటాలను ప్రచురించాడు.[1]

జననం, విద్యాభ్యాసం[మార్చు]

బుద్ధదేవ్ 1944లో వైద్య కుటుంబంలో దక్షిణ వెస్ట్ బెంగాల్ లోని అనార సమీపంలోని పురూలియాలో జన్మించాడు. తొమ్మిది తోబుట్టువుల మూడోవాడు. అతని తండ్రి తార్కాంత దాస్‌గుప్తా ఇండియన్ రైల్వేలో డాక్టర్, అందువల్ల బుద్ధదేవ్ అనేక ప్రాంతాలు తిరిగాడు. 12 ఏళ్ళ వయసులో హౌరాలోని దీనబందు స్కూల్ లో చదువుకొనుటకు కలకత్తా పంపబడ్డాడు.[2] స్వాతంత్య్రానంతరం అతని తండ్రి మొదట పశ్చిమ మేదినిపూర్ జిల్లాలోని ఖరగ్‌పూర్‌కు, మనేంద్రఘర్ (ఛత్తీస్‌గఢ్) కు బదిలీ చేయబడ్డాడు.[3]

ప్రతిష్టాత్మక స్కాటిష్ చర్చి కళాశాలలో, కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం అభ్యసించాడు.[4][5]

సినిమారంగం[మార్చు]

బుర్ద్వాన్ విశ్వవిద్యాలయంకు చెందిన శ్యామ్‌సుందర్ కళాశాలలో బుద్ధదేబ్ ఎకనామిక్స్ లెక్చరర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. ఆ తరువాత కలకత్తాలోని సిటీ కాలేజీకి మారాడు. 1976లో తను బోధించిన ఆర్థిక సిద్ధాంతానికి, సామాజిక-రాజకీయ వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని చూసి నిరాశకు గురై, చలన చిత్ర నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నాడు.[6] కలకత్తా ఫిల్మ్ సొసైటీలో సభ్యత్వం తీసుకొని, అక్కడ అతను మామతో కలిసి చార్లీ చాప్లిన్, ఇంగ్మార్ బెర్గ్మాన్, అకీరా కురొసావా, విట్టొరియో డి సికా, రాబర్టో రోస్సెల్లిని, మైఖేలాంజెలో ఆంటోనియోని వంటి దర్శకుల సినిమాలు చూశాడు. అవన్నీ తనకు ప్రేరణనిచ్చాయి.[7] 1968లో ది కాంటినెంట్ ఆఫ్ లవ్ పేరుతో 10 నిమిషాల డాక్యుమెంటరీతో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. 1978లో తన మొట్టమొదటి పూర్తి-నిడివి సినిమా దూరత్వ తీశాడు.[8]

తన సినీ జీవితం ప్రారంభ దశలో, దాస్‌గుప్తా సత్యజిత్ రే తీసిన వాస్తవిక సినిమాల నుండి ప్రేరణ పొంది సినిమాలు రూపొందించాడు. బాగ్ బహదూర్, తహదర్ కథ, చరాచర్, ఉత్తర మొదలైన సినిమాలు మంచి గుర్తింపును పొందాయి.[9]

సినిమాలు[మార్చు]

సినిమాలు[మార్చు]

డాక్యుమెంటరీలు, టీవీ కార్యక్రమాలు[మార్చు]

  • ది కాంటినెంట్ ఆఫ్ లవ్ (1968)
  • ధోలర్ రాజా ఖిరోడ్ నట్టా (1973)
  • ఫిషర్ మ్యాన్ ఆఫ్ సుందర్బన్ (1974)
  • శరత్‌చంద్ర (1975)
  • రిథమ్ ఆఫ్ స్టీల్ (1981)
  • ఇండియన్ సైన్స్ మార్చ్స్ అహెడ్ (1984)
  • విజ్ఞన్ ఓ తార్ అవిష్కర్ (1980)
  • స్టోరీ ఆఫ్ గ్లాస్ (1985)
  • ఇండియా ఆన్ ది మూవ్ (1985)
  • సెరామిక్స్ (1986)
  • ఆరణ్యక్ (1996)
  • కాంటెంపరరీ ఇండియన్ స్కల్ప్చర్ (1987)
  • హిస్టరీ ఆఫ్ ఇండియన్ జ్యూట్ (1990)

అవార్డులు[మార్చు]

2004, ఫిబ్రవరి 23న ముంబైలోని పిఎల్ దేశ్‌పాండే ఆడిటోరియంలో 8వ ముంబై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని ప్రారంభించిన దాస్‌గుప్తా
  • 2008, మే 27న మాడ్రిడ్‌లో జరిగిన స్పెయిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బుద్ధదేవ్ దాస్‌గుప్తాను జీవితకాల సాధన అవార్డుతో సత్కరించారు.[1]
  • 2007లో ఏథెన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో గోల్డెన్ ఎథీనా అవార్డు
  • జాతీయ చిత్ర పురస్కారం
  • వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్
    • 1982: ఎఫ్ఐపిఆర్ఈఎస్సిఐ అవార్డు: గ్రిహజుద్ధ
    • 2000: ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ లయన్ : ఉత్తర
    • 1982: గోల్డెన్ లయన్ నామినేషన్: గ్రిహజుద్ధ
    • 2000: గోల్డెన్ లయన్ నామినేషన్: ఉత్తర
  • బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
    • 1988 : గోల్డెన్ బేర్ నామినేషన్: ఫెరా [13]
    • 1994 : గోల్డెన్ బేర్ నామినేషన్: చరాచర్ [14]
  • లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్
    • విమర్శకుల అవార్డు: దూరత్వా
    • ప్రత్యేక జ్యూరీ అవార్డు: నీమ్ అన్నపూర్ణ
  • ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్
    • ఉత్తమ చిత్రం: జనల
  • కార్లోవీ వేరి ఫిల్మ్ ఫెస్టివల్
    • ప్రత్యేక జ్యూరీ అవార్డు: నీమ్ అన్నపూర్ణ
  • డమాస్కస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
    • బంగారు బహుమతి: నీమ్ అన్నపూర్ణ
  • బ్యాంకాక్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

మరణం[మార్చు]

బుద్ధదేవ్ 2021, జూన్ 10న కోలకతాలో మరణించాడు.[15][16]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Merchant of Dreams: Buddhadeb Dasgupta gets lifetime achievement award at the Spain International Film Festival The Tribune, 31 May 2008.
  2. Buddhadeb Dasgupta#Ho, Hood, p. 2
  3. Buddhadeb Dasgupta#Ho, Hood, p. 3
  4. Some Alumni of Scottish Church College in 175th Year Commemoration Volume. Scottish Church College, April 2008, p. 588.
  5. Aami, Tumi, O Scottish (translated from Bengali:"Me, You, and Scottish") in 175th Year Commemoration Volume. Scottish Church College, April 2008, p. 430-1.
  6. Merchant of Dreams: Buddhadeb Dasgupta gets lifetime achievement award at the Spain International Film Festival The Tribune, 31 May 2008.
  7. Buddhadeb Dasgupta#Ho, Hood, p. 14
  8. Syed, M.H. (2005). Encyclopaedia of Modern Journalism and Mass Media. Anmol Publications. p. 210. ISBN 81-261-2420-2.[permanent dead link]
  9. Buddhadeb Dasgupta Archived 1 డిసెంబరు 2010 at the Wayback Machine Upperstall.com.
  10. Filmography The New York Times.
  11. "Sniffer (Anwar Ka Ajab Kissa)". The Guardian. Retrieved 10 June 2021.
  12. "46th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 2016-03-10. Retrieved 2021-06-10.
  13. "Berlinale: 1988 Programme". berlinale.de. Retrieved 10 June 2021.
  14. "Berlinale: 1994 Programme". berlinale.de. Archived from the original on 1 అక్టోబరు 2017. Retrieved 10 June 2021.
  15. Buddhadeb Dasgupta Profile Archived 7 డిసెంబరు 2007 at the Wayback Machine at Calcuttaweb.com.
  16. "Buddhadeb's 'Bag Bahadur' Pavan Malhotra pays a tribute to 5-time National Film Award winning auteur". connectedtoindia.com. Archived from the original on 10 జూన్ 2021. Retrieved 10 June 2021.

బయటి లింకులు[మార్చు]