అకీరా కురొసావా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అకిరా కురసోవా
黒澤 明
Akirakurosawa-onthesetof7samurai-1953-page88.jpg
1953లో సెవెన్ సమురాయ్స్ చలనచిత్రం సెట్స్ లో అకిరా కురసోవా
జననం (1910-03-23)మార్చి 23, 1910
షినాగ్వా, టోక్యో, జపాన్
మరణం 1998(1998-09-06) (వయసు 88)
సెటాగయా, జపాన్
వృత్తి దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత, ఎడిటర్
క్రియాశీలక సంవత్సరాలు 1936–1993
భార్య / భర్త యోకొ యాగుచి (1945–1985)
పిల్లలు కజుకొ కురసోవా
హిసావో కురసోవా
తల్లిదండ్రులు ఇసాము కురసోవా
షిమా కురసోవా

అకిరా కురసోవా(మార్చి 23, 1910 - సెప్టెంబరు 6, 1998) జపనీస్ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్. 57 సంవత్సరాల కెరీర్ లో 30 చలన చిత్రాలకు దర్శకత్వం వహించిన కురసోవా[note 1] సినిమా చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన, ముఖ్యమైన సినీ దర్శకుల్లో ఒకరుగా పేరొందారు. 1936లో కురసోవా జపనీస్ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. కొద్దికాలం పెయింటర్ గా పనిచేశారు. సంవత్సరాల పాటు ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, స్క్రిప్ట్ రచయితగా పనిచేశాకా రెండో ప్రపంచ యుద్ధసమయంలో 1943లో పాపులర్ యాక్షన్ సినిమా సాన్షిరో సుగతా (అనే జూడో సాగా) ఆయన దర్శకునిగా తొలి సినిమా చేశారు. యుద్ధానంతరం విమర్శకుల ప్రశంసలు పొందిన డ్రంకెన్ ఏంజిల్ (1948). ఈ సినిమాతో కురసోవా జపాన్ లోని యువకులైన సినిమా దర్శకుల్లో అత్యంత ముఖ్యునిగా పేరొందారు. సినిమాలో అప్పటికి వర్ధమాన నటుడైన తొషిరో మిఫునె ప్రధాన పాత్ర ధరించారు. వీరిద్దరూ తర్వాత మరో 15 సినిమాలకు కలిసి పనిచేశారు. ఆయన భార్య యోకో యగుచి కూడా కురసోవా తీసిన ఒకానొక సినిమాలో నటిగా పనిచేశారు.

కురసోవా దర్శకత్వం వహించిన రషోమాన్ సినిమా 1950 ఆగస్టులో టోక్యోలో మొదట ప్రదర్శితమైంది. సెప్టెంబర్ 10, 1951న వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అనూహ్యంగా గోల్డెన్ లయన్ పురస్కారాన్ని పొందింది, ఆ వెనువెంటనే ఐరోపా, ఉత్తర అమెరికాల్లో విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు, వ్యాపారాత్మక విజయం పొందడంతో మొట్టమొదటి సారి జపనీస్ సినిమా పరిశ్రమలో తయారైన సినిమాలకు పాశ్చాత్య సినీ మార్కెట్లు తెరచుకున్నాయి, తద్వారా జపనీస్ సినీ రూపకర్తలకు అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందింది. 1950 దశకమంతా, 1960ల మొదట్లోనూ, కురసోవా దాదాపుగా సంవత్సరానికి ఒక సినిమా చొప్పున దర్శకత్వం వహించారు. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇకిరు (1952), సెవెన్ సమురాయ్ (1954), యోజింబొ (1961) వంటి సినిమాలు కూడా ఉన్నాయి.

ఇతరాలు[మార్చు]

1910,మార్చి 23 వ తేదీన, జపాన్ లోని టోక్యో లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు అకిరా కురొసావా . ఏడుగురు సంతానం కలిగిన కుటుంబంలో ఆఖరి వాడు అకిరా కురోసావా. ఈయన పుట్టే నాటికి ఒక సోదరి పెళ్ళయ్యి, మరో సోదరుడు ఉద్యోగరీత్యా ఇళ్ళు వదిలి వెళ్ళిపోగా, మరో సోదరుడు ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయాడు. దాంతో ముగ్గురు అక్కలు ఒక అన్నలతో తన చిన్నతనం గడిపిన అకిరా కురొసావా, తన నాలుగో తరగతిలో వుండగా మరో సోదరిని కోల్పోయాడు. అందుకే కాబోలు death అనే concept ని తన సినిమాల్లో అధ్యయనం చేశారనిపిస్తుంది. జపాన్ ‘సమురాయ్’(సైనిక) కుటుంబంలో జన్మించిన అకిరా సినిమాలు మాత్రమే తన ఉనికిగా బతికాడు. యుద్ధ సన్నివేశాలను చిత్రించడంలో, రిస్కు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి! నటీనటులకు అలవాటు కావడానికి, తద్వారా సహజత్వం కోసం సినిమా కాస్ట్యూమ్స్‌తో వాళ్లను కొంతకాలం గడపమనేవాడు. ఏరోజు రషెస్ ఆరోజు స్వయంగా ఎడిట్ చేసుకునేవాడు. ‘‘ఆలోచనలు సహజంగా వస్తాయి, కథ ఆ క్యారెక్టర్ వెంట సాగిపోతుంది’’ అని తను సినిమా తీసే విధానం గురించి చెప్పేవాడు కురసోవా. స్టోరీబోర్డ్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు. సినిమాకు ఫండింగ్ దొరకని విరామ సమయాల్లో తన సీన్లన్నింటినీ బొమ్మలుగా గీసుకునేవాడు. ఆయన స్వయంగా పెయింటర్ కూడా! సినిమాల్లోకి రాకముందు కమర్షియల్ ఆర్టిస్టుగా పనిచేశాడు. ‘‘నిజంగా డెరైక్టర్ కావాలనుకుంటే ముందు స్క్రీన్‌ప్లేలు రాయండి. రాయడం ద్వారానే సినిమా స్ట్రక్చర్ అర్థమవుతుంది, అసలు సినిమా ఏంటో కూడా అర్థమవుతుంది’’ అని ఔత్సాహిక దర్శకులకు సలహా ఇచ్చేవాడు. ‘‘నీలోపల ఎంతో రిజర్వు ఉంటేతప్ప, నువ్వు ఏదీ సృష్టించలేవు. జ్ఞాపకమే సృష్టికి మూలం. శూన్యం నుంచి దేన్నీ సృష్టించలేం’’. అందుకని చదవడం చాలా ముఖ్యమనేవాడు. ‘‘అయితే, చదవడం వల్లగానీ, నీ జీవితానుభవం వల్లగానీ వచ్చినదానికి జోడించగలిగేదేదో నీలోపల లేకపోతే నువ్వు ఏదీ సృజించలేవు’’ అనేవాడు.

ఆయన సినిమాలన్నీ ‘లార్జర్ దన్ లైఫ్’గా కనబడినా, ఆయన మాట్లాడిందంతా జీవితం గురించే! మనిషి ఎప్పుడూ తప్పకూడని నీతినీ, ఎప్పుడూ పాటించవలసిన మానవీయ విలువనీ ఆయన చిత్రాలు ప్రతిబింబించాయి. మనిషి బతకడం కోసం చేసే పోరాటాన్నీ, మనిషిగా నిలబడటం కోసం పడే ఆరాటాన్నీ, సమూహంతో కలిసిసాగే సంతోషపు వెతుకులాటనూ ఆయన చిత్రించాడు. అయితే, జీవితం ఎంత సంక్లిష్టమైందో ఆయన సినిమాలు కూడా అంతే సంక్లిష్టమైనవి. అందుకే కురసోవా తన సినిమాల్లో ‘ఫలానాది వెల్లడించాడు’ అనడం తప్పుడు విశ్లేషణే అవుతుంది.

‘‘నా సినిమా ఏం చెబుతుందో నేనేగనక వివరించగలిగితే అందరికీ వెళ్లి అదే చెప్తానుగానీ, అంత కష్టపడి సినిమా ఎందుకు తీస్తాను?’’ అన్నాడాయన. సినిమాను అర్థం చేసుకోవడంలో మెదడుకంటే హృదయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వమనేవాడు. ఆయన చిత్రరాజాలు మాత్రం మెదడునూ, హృదయాన్నీ రెంటినీ సంతృప్తిపరుస్తాయి.

మనిషి బతకడం కోసం చేసే పోరాటాన్నీ, మనిషిగా నిలబడటం కోసం పడే ఆరాటాన్నీ, సమూహంతో కలిసిసాగే సంతోషపు వెతుకులాటనూ ఆయన చిత్రించాడు.

బాల్యం[మార్చు]

చిన్నతనంలో ఎక్కువగా తన అన్న హీగో కురొసావా తో తిరుగుతూ గడిపిన జీవితం అకిరా కురోసావా జీవితంలోని కళాకారునికి పునాదులు ఏర్పరిచాయి. ఆ రోజుల్లో మూకీ సినిమాలకు వ్యాఖ్యాత (బెంషీ)గా వ్యవహరించే హీగో తోకలిసి చిన్ననాడే ఎన్నో సినిమాలను చూసే అవకాశం కలిగింది అకిరా కురొసావాకు. అంతేకాకుండా అకిరా కురొసావా తండ్రి పాశ్చ్యాత్య సినిమాలనూ చూడాలని తన కుటుంబ సభ్యులను ప్రోత్సాహించడంతో తన 19వ యేటికే దాదాపు వందకు పైగా సినిమాలను చూసి సినిమాలంటే ఒక ప్రత్యేక అభిమానం పెంచుకున్నాడు అకిరా కురొసావా.


ప్రభావం[మార్చు]

ప్రపంచ సినిమా తో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు పాఠ్యపుస్తకాల వంటివి. యాభై సంవత్సరాలపాటు సినిమా కెరీర్ లో దాదాపు ముఫైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రచయితగా, ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహించి ఎన్నో కళాఖండాలకు ప్రాణం పోసారు అకిరా కురొసావా.

1929 లో ఇల్లు వదిలి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన అకిరా కురొసావా సాహిత్యం, చిత్రకళలను అభ్యసించాడు. సాహిత్యంలో ముఖ్యంగా Dostoevsky, గోర్కీ లంటే ఇష్టపడేవాడు అకిరా కురొసావా. ఇదే సమయంలో “Proletarian Artists’ League” చేరి కొన్నాళ్ళూ అక్కడా ఇక్కడా తిరుగుతూ లక్ష్యం లేని జీవితం గడిపిన తర్వాత కొన్నాళ్ళకు తన సోదరుడు హీగో ఆత్మహత్య చేసుకోవడంతో తన జీవితంకూడా అలా కాకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. తన సోదరునే అనుసరిస్తూ చిన్ననాటి నుండి జీవితం గడుపుకుంటూ వచ్చిన అకిరా కురొసావా, వారిద్దరి మధ్య సారూప్యం గురించి చెప్తూ “I saw him as a negative strip of film that led to my own development as a positive image” అనే వారు.

సినిమా మాస్టర్లు అనిపించుకున్న దర్శకులు ఇన్‌మార్ బెర్గ్‌మన్, ఫ్రెడరికో ఫెల్లిని, సత్యజిత్ రే, రోమన్ పోలన్‌స్కీ, జార్జ్ లుకాస్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, మార్టిన్ సోర్సెసె, స్టీవెన్ స్పీల్‌బర్గ్‌లాంటివాళ్లు కూడా కురసోవా వల్ల ప్రభావితమయ్యారు. అందుకే ఆయన్ని విమర్శకులు గౌరవంగా ‘ఎంపరర్ ఆఫ్ ద సెల్యులాయిడ్’ అంటారు.


సినిమాలు[మార్చు]

ఒకసారి దర్శకుడు అకిరా కురసోవాకు ఈ ప్రశ్న ఎదురైంది: ‘‘మీరు ‘రాన్’లోని ఆ ఫ్రేమ్‌లో కెమెరా అలా ఎందుకు పెట్టారు?’’ దానికి కురసోవా ఇచ్చిన జవాబు: ‘‘నేను ఒక్క అంగుళం ఎడమకు ప్యాన్ చేసినా సోనీ ఫ్యాక్టరీ కనబడుతుంది, అదే ఒక్క అంగుళం కుడికి జరిపితే ఎయిర్‌పోర్టు కనబడుతుంది. పీరియడ్ సినిమాకు ఆ రెండూ అనవసరం’’. కురసోవా అంత పర్ఫెక్షనిస్టు! సినిమా కోసం ప్రాణం పెట్టేవాడు. 1948తో మొదలై నాలుగు దశాబ్దాలపాటు సాగిన ఆయన కెరీర్లో... రషోమన్, ఇకిరు, సెవెన్ సమురాయ్, యొజింబో, థ్రోన్ ఆఫ్ బ్లడ్, దెర్సు ఉజాలా, ద లోయర్ డెప్త్స్, హై అండ్ లో, డ్రీమ్స్, రప్సోడీ ఇన్ ఆగస్ట్... ఒక్కో సినిమా ఒక్కో చరిత్ర!

కజిరా యమమొటో అనే దర్శకుని పరిచయంతో అకిరా కురసొవా ఉత్సాహాన్ని పుంజుకున్నారు. యమమొటో లో ఒక ఉత్తమ స్థాయి గురువును చూసిన అకిరా ఆయన వద్ద దర్శకత్వంలో తొలి పాఠాలు నేర్చుకున్నారు. అప్పటికే స్క్రీన్‍ప్లే రచనలు సాగిస్తూ ఇతర సినిమాలకు పనిచేస్తున్న అకిరా కురొసావా వార్తాపత్రికలోచదివిన ఒక కొత్త నవల (Sanshiro Sugata) కథాంశం చదివి బాగా ప్రభావితం చెంది ఆ నవలను సినిమాగా మలచాలన్న నిర్ణయానికి వచ్చాడు.అనుకున్నట్టుగానే 1943 లో తన మొదటి సినిమా, Sanshiro Sugata ను రూపొందించారు అకిరా కురొసావా.

జూడో అనే యుద్ధకళ ఆధారంగా రూపొందించిన Sanshiro Sugata సినిమా అకిరా కురొసావా మున్ముందు రూపొందించిన సినిమాలతో పోల్చలేనప్పటికీ ఈ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక శైలి ని ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత 1944 లో Ichiban utsukushiku,Tora no o wo fumu otokotachi, Sanshiro Sugata-2 లాంటి సినిమాలు రూపొందించినప్పటికీ Yoidore tenshi (Drunken Angel,1948), Shizukanaru ketto (A Silent Duel, 1949), Nora inu(Stray Dog, 1949) సినిమాలు అకిరా కురొసావాను అప్పటి జపాన్ లోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా గుర్తింపును తెచ్చిపెట్టాయి.

1950 వరకూ అకిరా కురొసావా రూపొందించిన సినిమాలు ఒక ఎత్తైతే 1950 లో ఆయన రూపొందించిన ’రషొమన్’ సినిమా మరో ఎత్తు. ఈ సినిమాతో అకిరా కురొసావా జపనీస్ సినిమాను ప్రపంచానికి దగ్గర చేశారు. అప్పటివరకూ జపాన్ వరకే పరిమితమైన జపనీస్ సినిమా ప్రపంచ సినీ ప్రేమికులకు దగ్గరయింది. అదే సమయానికి జపాన్ లో కెంజి మిజొగుచి, యసుజిరో ఓజు లు కూడా తమ సినిమాలను ప్రఖ్యాత ప్రపంచ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించి అవార్డులు గెలుచుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా జపనీస్ సినిమా అంటే ఒక క్రేజ్ ఏర్పడింది.

’రషోమన్’ సినిమా తర్వాత అకిరా కురొసావా అంటే ప్రపంచ సినీ ప్రేమికులకు అత్యంత ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే అకిరా కురొసావా ఒక దాని తర్వాత ఒకటిగా అత్యధ్బుత సినిమాలను మలచసాగారు. ’రషోమన్’తర్వాత అకిరా కురొసావా రూపొందించిన చిత్రం ’హకుచి’. యువకుడిగా రష్యన్ రచయిత దోస్తోవిస్కీ రచనలను ఆసక్తిగా చదివిన అకిరా కురొసావా ’హకుచి’ చిత్రానికి గాను దోస్తోవిస్కీ రచన ’The Idiot’ ను కథాంశంగా ఎన్నుకున్నారు. కమర్షియల్ గా ఈ సినిమా విజయం సాధించనప్పటికీ తనకు బాగా నచ్చిన సినిమాల్లో ఇది ఒకటి అని కురొసావా భావించేవారట.

’హకుచి’ తర్వాత అకిరా కురొసావా ’ఇకిరు’ మరియు ’సెవెన్ సమురాయ్’ చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాలతో ఆయనకు ప్రపంచమంతా అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత వచ్చిన ’The Hidden Fortress’, ‘Throne of Blood’ ,’యొజింబొ’ మరియు ‘సంజురో’ సినిమాలు అకిరా కురొసావాను ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా చేర్చాయి.

దాదాపు పదిహేనేళ్ళ పాటు జపాన్ చలనచిత్ర సీమను ఏలిన అకిరా కురొసావా కెరీర్ కు 1965లో వచ్చిన ‘Red Beard’ సినిమాతో పెద్ద బ్రేక్ పడింది. ఈ సినిమా వచ్చే సమయానికి కలర్ సినిమాలు రావడం, అప్పటి వరకూ తన సినిమాల్లో నటించిన Toshirō_Mifune తో గొడవలు రావడం, తను ఏర్పరచిన సినీ నిర్మాణ కంపెనీ నష్టాల్లో కూరుకుపోవడం లాంటి ఎన్నో అంశాలు కురొసావా కెరీర్ కు పెద్ద అడ్డుగోడగా నిలిచాయి. అప్పటివరకూ దాదాపుగా సంవత్సరానికి ఒక సినిమా రూపొందిస్తూ వచ్చిన అకిరా కురొసొవా 1965 నుంచి ఐదేళ్ళకొక సినిమా తీయడానికే ఎన్నో కష్టాలు పడాల్సివచ్చింది.

తన ఆఖరి శ్వాస విడిచే వరకూ సినిమాకే తన జీవితం అంకితం చేయాలనుకున్న అకిరా కురొసావా సినిమాలు రూపొందించే అవకాశాలు లేక ఒకానొక సమయంలోఆత్మహత్యకు కూడా పూనుకున్నారు.సినిమాలే జీవితంగా భావించిన అకిరా కురొసావా కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా తన సినిమాలన్నింటికీ స్క్రిప్టు సమకూర్చుకోవడంలోనూ, అలాగే కొన్ని సినిమాలకు ఎడిటర్ గానూ బాధ్యతలు నిర్వహించారు.

1985 లో అకిరా కురొసావా రూపొందించిన ‘Ran’ సినిమాతో తన పూర్వవైభవాన్నిసంపాదించుకున్నారు. షేక్స్పియర్ నాటకం ’కింగ్ లీయర్’ అధారంగా రూపొందించిన ఈ సినిమాను అకిరా కురొసావా తన సినిమాల్లోకెల్లా గొప్ప సినిమా అని పేర్కొన్నారు. ఈ సినిమా తర్వాత అకిరా కురొసావా మరో మూడు సినిమాలు రూపొందించారు. ’డ్రీమ్స్’ సినిమా ద్వారా తన జీవితంలోని కలలను తెరకెక్కించారు అకిరా కురొసావా. ఎనిమిది లఘు చిత్రమాలిక అయిన ఈ సినిమా అకిరా కురొసావా చిత్రాల్లో ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు.


అవార్డులు[మార్చు]

తన సినిమాలకు ప్రపంచంలోని వివిధ చలన చిత్రోత్సవాల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న అకిరా కురొసావాకు 1989 లో ’లైఫ్ టైమ్ అచివ్మెంట్’ కి గాను అస్కార్ అవార్డు అందుకున్నారు.


మరణం[మార్చు]

“I like unformed characters. This may be because, no matter how old I get, I am still unformed myself.” అని నమ్మిన అకిరా కురొసావా ప్రపంచ సినిమాకు విశిష్ట సంపదను మిగిల్చి 1998 లో తుది శ్వాస విడిచారు. ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళినాఆయన సినిమాల ద్వారా చిరకాలం మన మధ్య బ్రతికే వుంటారు అకిరా కురొసావా!

మూలాలు[మార్చు]

నోట్స్[మార్చు]

Notes[మార్చు]

 1. 1946లో, కురసోవా హిడియో సెకిగవా, కజిరో యామమొటోలతో కలిసి దోజ్ హూ మేక్ టుమారో (అసు ఓ సుకురు హిటొబిటొ) సినిమాకు సహ దర్శకత్వం వహించారు; బహుశా అప్పటికి ఆయన కాంట్రాక్టులో ఉన్న టొహొ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మించమని నిర్దేశించివుండొచ్చు. (సినిమా కేవలం ఒక్క వారంలో నిర్మించినట్టు కురసోవా పేర్కొన్నారు.) ఇది ఆయనకు దర్శకునిగా పూర్తి క్రెడిట్ దక్కని ఒకేఒక సినిమా, అందులోనూ జపాన్లో వీడియోగా ఎన్నడూ విడుదలైవుండలేదు. కురసోవా తర్వాతికాలంలో పొందిన ఖ్యాతివల్ల వెలుగులోకి వచ్చింది, సాధారణంగా ఈ సినిమాను చాలామంది ఆయన ఇతర 30 సినిమాల్లో చేర్చరు, అయితే ఇది ఆ దర్శకుని సినిమాల జాబితాలో చేరుతూంటుంది. గాల్ బ్రైత్, పిపి. 65-67, మరియు కురసోవా ఐడిఎంబి పేజీ చూడండి.

సైటేషన్లు[మార్చు]

 1. "Kurosawa's Early Influences". Retrieved 2012-08-30. ,
 2. 2.0 2.1 2.2 Kurosawa: The Last Emperor(1999)
 3. 3.0 3.1 3.2 3.3 3.4 Kurosawa's Way(2011)
 4. "George Lucas". Retrieved March 14, 201.  Check date values in: |accessdate= (help)
 5. The Passion of Ingmar Bergman - Frank Gado. Retrieved March 14, 2013. 
 6. "Robert Altman talks to Michael Billington". guardian.co.uk. Retrieved March 14, 2013. 
 7. "TSPDT - Sam Peckinph". theyshootpictures.com. Retrieved March 14, 2013. 
 8. "Internet Archive Wayback Machine". Web.archive.org. 2008-02-17. Retrieved 2013-03-11. 
 9. Turan, Kenneth (2010). "Man of Vision". DGA. Retrieved 2013-03-11. 
 10. Carnevale, Rob (2006). "Getting Direct With Directors: Ridley Scott". BBC. Retrieved 2013-03-11. 

బయటి లింకులు[మార్చు]