Jump to content

2022 భారత రాష్ట్రపతి ఎన్నికలు

వికీపీడియా నుండి
(భారత రాష్ట్రపతి ఎన్నికలు 2022 నుండి దారిమార్పు చెందింది)
2022 భారత రాష్ట్రపతి ఎన్నికలు
← 2017 18 జూలై 2022 (2022-07-18) 2027 →
Turnout99.12% (1.83%Increase)
 
Droupadi Murmu official portrait (4x5).jpg
Yashwant Sinha IMF.jpg
Party భారతీయ జనతా పార్టీ AITC
Alliance జాతీయ ప్రజాస్వామ్య కూటమి UO
Percentage 64.03% 35.97%
Swing 1.62% Decrease 1.62% Increase


రాష్ట్రపతి before election

రామ్‌నాథ్ కోవింద్
బిజెపి

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత

ద్రౌపది ముర్ము
బిజెపి

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. ఈ క్రమంలో భారతదేశ 16వ అధ్యక్షని ఎన్నుకోవటానికి 2022 భారత రాష్ట్రపతి ఎన్నికలు 2022 జూలై 18న జరిగాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మళ్లీ ఈ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా జరిగిన ఈ ఎన్నికలలో 99.12% పోలింగ్ నమోదైంది.

భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ద్రౌపది ముర్ము సంయుక్త ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై 296,626 ఓట్ల తేడాతో గెలుపొందింది.[1][2][3][4] ముర్ము షెడ్యూల్డ్ తెగకు చెందిన మొదటి సభ్యురాలు, రెండో మహిళా అధ్యక్షురాలు, అలాగే స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన మొదటి రాష్ట్రపతి.[5][6][7][8]

ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

[మార్చు]

నూతన రాష్ట్రపతిగా ఎన్నికైవ ద్రౌపది ముర్ము 2022 జూలై 25న భారతదేశ 15వ రాష్ట్రపతిగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.[9][10]

రాష్ట్రపతి పదవికి అర్హత

[మార్చు]

రాజ్యాంగంలోని ఆర్టికల్-58 ప్రకారం పోటీ చేసే అభ్యర్థులకు ఈ కింద అర్హతలుండాలి.

  • 35 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులై ఉండాలి.
  • లోక్‌సభకు ఎన్నికయ్యే అర్హతలుండాలి.
  • కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదా వాటి ఆధ్వర్యంలో పనిచేసే సంస్థల్లో లాభదాయక పదవుల్లో ఉండకూడదు.[11][12]

నామినేషన్ విధానం

[మార్చు]

రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థిని 50మంది ఎలక్టోరల్ సభ్యులు ప్రతిపాదించాలి. ఆ తర్వాత 50మంది ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ జాబితాను ఎన్నికల అధికారులకు సమర్పించి, డిపాజిట్ కింద రూ.15వేలు చెల్లించాలి.

2022 ఎన్నికల షెడ్యూలు

[మార్చు]

రాష్ట్రపతి ఎన్నికకు 2022 జూన్ 9న కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ ‎కుమార్ షెడ్యూల్ ప్రకటించాడు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు చీఫ్ ఎన్నికల కమిషనర్ తెలిపాడు.[13]

సంఖ్య ఎన్నికల ప్రకియ తేదీ వారం
1. ఎన్నికకు నోటిఫికేషన్ 2022 జూన్ 15 బుధవారం
2. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 2022 జూన్ 29 బుధవారం
3. నామినేషన్ల పరిశీలన 2022 జూన్ 30 గురువారం
4. నామినేషన్ల ఉపసంహ‍రణకు చివరి తేదీ 2022 జూలై 2 శనివారం
5. ఎన్నిక 2022 జూలై 18 సోమవారం
6. కౌంటింగ్ 2022 జూలై 21 గురువారం

ఎన్నిక విధానం

[మార్చు]

రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు ఉభయసభల ఎంపీలు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు ఎలక్ట్రోల్ కాలేజీ సభ్యులుగా ఉంటారు. లోక్‌సభ, రాజ్యసభలోని నామినేటెడ్ సభ్యులకు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేదని, శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్‌ కాలేజీలో ఉండరని ఈసీ తెలిపింది. ఓటింగ్‌ బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికకు జరిగే పోలింగ్‌లో ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎంపీలు కనీసం 10 రోజులు ముందుగా సమాచారం ఇచ్చి దేశంలో మరెక్కడైనా (ఏ అసెంబ్లీలోనైనా) ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.[14]

ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల బలం

[మార్చు]
హౌస్ మొత్రం
NDA UPA ఇతరులు
లోక్‌సభ
293 / 543 (54%)
247 / 543 (45%)
103 / 543 (19%)
543
రాజ్యసభ
120 / 233 (52%)
49 / 233 (21%)
74 / 233 (32%)
228
(ఖాళీ సీట్లు 5 మినహా)
శాసనసభలు
2,136 / 4,036 (53%)
1,224 / 4,036 (30%)
1,253 / 4,036 (31%)
4,025
( ఖాళీ సీట్లు 7 మినహా)
మొత్తం
2,234 / 4,796 (47%)
1,200 / 4,796 (25%)
1,430 / 4,796 (30%)
4,796

ఎలక్టోరల్ కాలేజీ ఓటు విలువ కూర్పు

[మార్చు]
హౌస్ మొత్తం
NDA UPA ఇతరులు
లోక్‌సభ వోట్లు
2,44,300 / 3,80,100 (64%)
63,700 / 3,80,100 (17%)
72,100 / 3,80,100 (19%)
380,100
రాజ్యసభ వోట్లు
72,800 / 1,59,600 (46%)
35,000 / 1,59,600 (22%)
51,800 / 1,59,600 (32%)
159,600
(ఖాళీ సీట్లు 5 మినహా)
శాసనసభల వోట్లు
2,19,347 / 5,42,291 (40%)
1,45,384 / 5,42,291 (27%)
1,77,528 / 5,42,291 (33%)
542,291
( ఖాళీ సీట్లు 7 మినహా)
మొత్తం
5,36,447 / 10,81,991 (50%)
2,46,184 / 10,81,991 (23%)
2,99,328 / 10,81,991 (28%)
1,081,991
  • జమ్మూ కాశ్మీర్‌లోని మొత్తం 4 రాజ్యసభ స్థానాలు, 90 రాష్ట్ర శాసనసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దానికి కారణం జమ్మూ కాశ్మీర్ శాసనసభ రద్దు చేయబడింది.
  • త్రిపురలోని ఏకైక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది.
  • వివిధ రాష్ట్రాలలో (గుజరాత్‌లో 4, మహారాష్ట్ర, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి) రాష్ట్ర శాసనసభలలో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

ఎన్నిక ఫలితాలు

[మార్చు]
2022 భారత అధ్యక్ష ఎన్నికల ఫలితాలు[15][16]
అభ్యర్థి సంకీర్ణ వ్యక్తిగత

ఓట్లు

ఎలక్టోరల్

కాలేజీ ఓట్లు

%
ద్రౌపది ముర్ము ఎన్‌డీఏ 2,824 676,803 64.03
యశ్వంత్ సిన్హా ఉమ్మడి ప్రతిపక్షం 1,877 380,177 35.97
ఎన్నికల సరళి
చెల్లుబాటు ఓట్లు 4,701 1,056,980 98.89
ఖాళీ, చెల్లని ఓట్లు 53 15,397 1.11
మొత్తం 4,754 1,072,377 100
నమోదైన ఓటర్లు / పోలింగ్ శాతం 4,809 1,086,431 98.86

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "2022 Indian Presidential Elections: Press note". Election Commission of India.
  2. ANI [@ani] (July 21, 2022). "While President-elect #DroupadiMurmu got a vote in all states, Opposition's Presidential candidate Yashwant Sinha drew a blank in Andhra Pradesh, Nagaland, & Sikkim" (Tweet) (in ఇంగ్లీష్). Retrieved 2022-07-23 – via Twitter.
  3. "Polling for Presidential Elections 2022 held peacefully today". Election Commission of India. 18 July 2022.
  4. Mehrotra, Vani (2022-07-21). "President Election 2022 Result LIVE Updates: Droupadi Murmu wins, Yashwant loses, celebrations begins". Indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-22.
  5. "Presidential Election 2022-Declaration of Result". Election Commission of India. 28 July 2022.
  6. "Draupadi Murmu is India's first tribal and youngest President ever - Oneindia News". Oneindia.com (in ఇంగ్లీష్). 2022-07-21. Retrieved 2022-07-23.
  7. Cariappa, Anuj (2022-07-18). "Presidential Election Results 2022 updates: Murmu declared winner, secures 64% of votes against Sinha's 36%". Oneindia (in ఇంగ్లీష్). Retrieved 2022-07-22.
  8. Mathur, Swati (July 22, 2022). "President of India 2022: Draupadi Murmu elected first tribal President of India, second woman to assume nation's top office". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-23.
  9. https://www.presidentofindia.gov.in/Profile
  10. "Droupadi Murmu takes oath as 15th President of India". The Economic Times. 2022-07-25. ISSN 0013-0389. Retrieved 2024-08-01.
  11. NTV (9 June 2022). "రాష్ట్రపతిగా ఎన్నికవ్వాలంటే ఎంత మంది మద్దతు అవసరం?". Archived from the original on 10 జూన్ 2022. Retrieved 10 June 2022.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  12. Namasthe Telangana (9 June 2022). "రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎవ‌రైనా పోటీ చేయొచ్చా? ఎన్నిక‌ ప్రక్రియ ఎలా జరుగుతుంది ?". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  13. Sakshi (9 June 2022). "రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  14. "రాష్ట్రపతి ఎన్నికలో విశేషాలెన్నో". 10 June 2022. Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  15. "While President-elect #DroupadiMurmu got a vote in all states, Opposition's Presidential candidate Yashwant Sinha drew a blank in Andhra Pradesh, Nagaland, & Sikkim". Twitter.com. Retrieved 26 July 2022.
  16. "Number Theory: Comparing Droupadi Murmu's win with her predecessors". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-07-21. Retrieved 2022-07-25.