భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం
దస్త్రం:Ekana Cricket Stadium logo.png | |||||||
Lua error in మాడ్యూల్:Mapframe at line 384: attempt to perform arithmetic on local 'lat_d' (a nil value). | |||||||
Former names | ఏకానా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (2017-2018) | ||||||
---|---|---|---|---|---|---|---|
Address | ఏకానా స్పోర్ట్స్ సిటీ, గోమతీ నగర్ ఎక్స్టెన్షన్ లక్నో ఇండియా | ||||||
Coordinates | 26°48′40″N 81°01′01″E | ||||||
Elevation | 104 m | ||||||
Owner | Ekana Sportz City | ||||||
Operator | ఏకానా స్పోర్ట్స్ సిటీ | ||||||
Capacity | 50,000 | ||||||
Field size | 160 x 156 | ||||||
Field shape | వృత్తాకరం | ||||||
Surface | పచ్చిక | ||||||
Construction | |||||||
Opened | 2017 | ||||||
Architect | స్కైలైన్ ఆర్కిటెక్చరల్ కన్సల్టంట్స్ | ||||||
Tenants | |||||||
మైదాన సమాచారం | |||||||
ఎండ్‌ల పేర్లు | |||||||
నార్త్ ఎండ్ సౌత్ ఎండ్ | |||||||
అంతర్జాతీయ సమాచారం | |||||||
ఏకైక టెస్టు | 2019 నవంబరు 27–29: ఆఫ్ఘనిస్తాన్ v వెస్ట్ ఇండీస్ | ||||||
మొదటి ODI | 2019 నవంబరు 6: ఆఫ్ఘనిస్తాన్ v వెస్ట్ ఇండీస్ | ||||||
చివరి ODI | 2022అక్టోబరు 6: India v దక్షిణాఫ్రికా | ||||||
మొదటి T20I | 2018 నవంబరు 6: India v వెస్ట్ ఇండీస్ | ||||||
చివరి T20I | 2023 జనవరి 29: India v న్యూజీలాండ్ | ||||||
మొదటి WODI | 2021 మార్చి 7: India v దక్షిణాఫ్రికా | ||||||
చివరి WODI | 2021 మార్చి 17: India v దక్షిణాఫ్రికా | ||||||
మొదటి WT20I | 2021 మార్చి 20: India v దక్షిణాఫ్రికా | ||||||
చివరి WT20I | 2021 మార్చి 23: India v దక్షిణాఫ్రికా | ||||||
జట్టు సమాచారం | |||||||
| |||||||
2023 జనవరి 29 నాటికి |
భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం లక్నోలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియంలో 50,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.ఇది భారతదేశంలోని ఐదవ అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియానికి గతంలో "ఏకానా క్రికెట్ స్టేడియం" అని పేరు పెట్టారు. "ఏకానా" అనేది సంస్కృత పదానికి "ఒకటి" లేదా "ఐక్యత" అని అర్థం. ఆ తరువాత దీనిని భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి మీదుగా పేరు మార్చారు. భారతదేశంలోని అన్ని స్టేడియంల కంటే ఈ స్టేడియంలో ఎక్కువ పొడవైన బౌండరీలున్నాయి. ఇది ఉత్తర ప్రదేశ్ క్రికెట్ జట్టుకు హోమ్ గ్రౌండ్. IPL ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్కు కూడా హోమ్ వేదిక.
2019లో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు దీనిని తమ హోమ్ గ్రౌండ్‌గా ఉపయోగించుకుంది.
చరిత్ర
[మార్చు]లక్నోలో ప్రపంచ స్థాయి స్టేడియం నిర్మాణం కోసం 2014 లో ప్రాజెక్టును ప్రారంభించారు. 2012-2017 రాష్ట్ర ప్రభుత్వ హయాంలో అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో ఏకానా స్పోర్ట్జ్ సిటీ, లక్నో డెవలప్‌మెంట్ అథారిటీల మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఏకానా స్పోర్ట్జ్ సిటీని నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ, జిసి కన్‌స్ట్రక్షన్ & డెవలప్‌మెంట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్. భాగస్వామ్య ఒప్పందం ప్రకారం, క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ప్రభుత్వం ఏకానా స్పోర్ట్జ్ సిటీకి 71 ఎకరాలను 35 సంవత్సరాల లీజుకు ఇచ్చింది. లీజు 2052 వరకు నడుస్తుంది. అదనంగా, ప్రభుత్వం 99 సంవత్సరాల లీజుపై రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం మరో 66 ఎకరాల భూమిని కూడా ఇచ్చింది. క్రికెట్ స్టేడియాన్ని రూ 360 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.
అంతర్జాతీయ మ్యాచ్ కంటే ముందు స్టేడియంలో 2017–18 దులీప్ ట్రోఫీ ఫైనల్ జరిగింది. అక్టోబరు 27 న భారత న్యూజిలాండ్‌ల మధ్య 3వ వన్‌డే కోసం స్టేడియాన్ని కేటాయించినప్పటికీ, స్టేడియం ఇంకా అసంపూర్తిగానే ఉండడంతో వేదికను కాన్పూర్‌కు మార్చారు. నవంబరు 6 న, స్టేడియంలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్, భారత వెస్టిండీస్ మధ్య ఒక ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జరిగింది. 1994లో భారత, శ్రీలంకల టెస్ట్ మ్యాచ్ తర్వాత 24 సంవత్సరాల తర్వాత లక్నోలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగడం ఇదే మొదలు. ఆ మ్యాచ్‌లో టీ20ల్లో నాలుగు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరిసారిగా లక్నో అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది, 1994 జనవరిలో. అప్పుడు, కెడి సింగ్ బాబు స్టేడియంలో శ్రీలంకతో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడింది.
2019 మేలో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం ఈ వేదికను ఉపయోగించుకుంటామని BCCIని అభ్యర్థించింది. 2019 ఆగస్టులో BCCI, భారతదేశంలోని ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు మూడవ హోమ్ వేదికగా దీన్ని ఇచ్చింది. గతంలో ఆ జట్టు డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడాలలోఆడింది.
2019 లో ఆఫ్ఘనిస్తాన్ vs వెస్టిండీస్ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఇక్కడే జరిగాయి. 2019 నవంబరు 27 న, మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది.
2022 మేలో, మహిళల T20 ఛాలెంజ్ నాల్గవ ఎడిషనులో అన్ని మ్యాచ్‌లు ఇక్కడే జరపాలని షెడ్యూల్ చేసారు. అయితే, ఆ తర్వాత, మ్యాచ్‌లను పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకు మార్చారు.
ఉత్సవాలు
[మార్చు]ప్రభుత్వం నిర్వహించిన రెండు ప్రధాన కార్యక్రమాలకు స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది.
అవార్డు ప్రదానోత్సవం
[మార్చు]2021లో జపాన్‌లోని టోక్యోలో జరిగిన 2020 సమ్మర్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2021 ఆగస్టు 19 న స్టేడియంలో అవార్డు ప్రదానోత్సవం నిర్వహించింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమం
[మార్చు]2022 మార్చి 25 న, 2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, వరుసగా రెండవ మంత్రివర్గంలోని మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక ఆతిథ్యం ఇచ్చింది. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించింది. ప్రధాన మంత్రి, నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి, అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అనేక మంది వచ్చారు.
వేదికపై అంతర్జాతీయ రికార్డులు
[మార్చు]అంతర్జాతీయ సెంచరీల జాబితా
[మార్చు]టెస్ట్ మ్యాచ్‌లు
[మార్చు]ఈ వేదికపై ఒకే ఒక్క టెస్టు సెంచరీ నమోదైంది.
నం. | స్కోర్ | ఆటగాడు | జట్టు | బంతులు | సత్రాలు. | ప్రత్యర్థి జట్టు | తేదీ | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|
1 | 111* | షమర్ బ్రూక్స్ | వెస్ట్ ఇండీస్ | 214 | 2 | ఆఫ్ఘనిస్తాన్ | 2019 నవంబరు 28 | వెస్టిండీస్ గెలిచింది |
వన్ డే ఇంటర్నేషనల్స్
[మార్చు]ఈ వేదికపై రెండు వన్డే సెంచరీలు నమోదయ్యాయి -పురుషుల మ్యాచ్‌లో ఒకటి మహిళల మ్యాచ్‌లో ఒకటి.
నం. | స్కోర్ | ఆటగాడు | జట్టు | బంతులు | సత్రాలు. | ప్రత్యర్థి జట్టు | తేదీ | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|
1 | 109* | షాయ్ హోప్ | వెస్ట్ ఇండీస్ | 145 | 2 | ఆఫ్ఘనిస్తాన్ | 2019 నవంబరు 11 | వెస్టిండీస్ గెలిచింది |
No. | Score | Player | Team | Balls | Inns. | Opposing team | Date | Result |
---|---|---|---|---|---|---|---|---|
1 | 132* | Lizelle Lee | దక్షిణాఫ్రికా | 132 | 2 | భారతదేశం | 12 March 2021 | South Africa won |
ట్వంటీ20 ఇంటర్నేషనల్స్
[మార్చు]ఈ వేదికపై ఒక్క టీ20 సెంచరీ నమోదైంది.
నం. | స్కోర్ | ఆటగాడు | జట్టు | బంతులు | సత్రాలు. | ప్రత్యర్థి జట్టు | తేదీ | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|
1 | 111* | రోహిత్ శర్మ | భారతదేశం | 61 | 1 | వెస్ట్ ఇండీస్ | 2018 నవంబరు 6 | భారత్ గెలిచింది |
అంతర్జాతీయ ఐదు వికెట్ల పంటల జాబితా
[మార్చు]టెస్ట్ మ్యాచ్‌లు
[మార్చు]నం. | బౌలర్ | తేదీ | జట్టు | ప్రత్యర్థి జట్టు | ఇన్ | ఓవర్లు | పరుగులు | Wkts | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | కరీం జనత్ | 2019 నవంబరు 16 | ఆఫ్ఘనిస్తాన్ | వెస్ట్ ఇండీస్< | 2 | 4 | 11 | 5 | ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది |
టీ20లు
[మార్చు]No. | Bowler | Date | Team | Opposing team | Inn | Overs | Runs | Wkts | Result |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | Rahkeem Cornwall | 27 November 2019 | వెస్ట్ ఇండీస్ | ఆఫ్ఘనిస్తాన్ | 1 | 25.3 | 75 | 7 | West Indies won |
2 | Hamza Hotak | 27 November 2019 | ఆఫ్ఘనిస్తాన్ | వెస్ట్ ఇండీస్ | 2 | 28.3 | 74 | 5 | West Indies won |