భూమధ్య రేఖ
భూమధ్య రేఖ, భూ ఉపరితలం మీద ఉత్తర దక్షిణ ధ్రువాల నుండి సమాన దూరంలో ఉండే ఊహా రేఖ. ఇది భూగోళాన్ని ఉత్తరార్థ, దక్షిణార్థ గోళాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖ 48,075 కి.మీ. పొడవుంటుంది. ఇది 78.7% నీటిలోను, 21.3% నేలమీదుగానూ పోతుంది.
ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువులకు కూడా ఇదే విధంగా మధ్య రేఖ ఉంటుంది. సాధారణంగా, గుండ్రంగా తిరుగుతున్న గోళం యొక్క భ్రమణాక్షానికి లంబంగా ఉన్న తలం, గోళపు ఉపరితలాన్ని ఖండించే రేఖను మధ్య రేఖ అంటారు. ఇది ఆ గోళపు రెండు ధ్రువాలకూ సమదూరంలో ఉంటుంది.
స్థూలంగా
[మార్చు]భూమధ్య రేఖ యొక్క అక్షాంశాన్ని 0° (సున్నా డిగ్రీలు) గా నిర్వచించవచ్చు. భూమధ్యరేఖ భూమ్మీద ఉన్న ఐదు ముఖ్య అక్షాంశ వృత్తాల్లో ఒకటి. మిగతావి: ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం, కర్కట రేఖ, మకర రేఖ. భూమధ్య రేఖను బాహ్య దిశలో అంతరిక్షంలోకి పొడిగించినపుడు, అది ఖగోళ మధ్య రేఖను నిర్వచిస్తుంది.
భూమి వాతావరణ చక్రంలో భాగంగా భూమధ్య రేఖా తలం సూర్యుడి గుండా ఏడాదికి రెండుసార్లు పోతుంది -మార్చి, సెప్టెంబరు విషువత్తులలో. భూమ్మీద ఉన్న పరిశీలకునికి, ఈ రోజులలో సూర్యుడు భూమధ్య రేఖ మీదుగా ఉత్తరానికిగాని, దక్షిణానికి గానీ పోతున్నట్లు కనిపిస్తుంది. మధ్యాహ్నవేళ సూర్యుడి కేంద్రం నుండి వచ్చే కిరణాలు భూమధ్య రేఖ వద్ద భూతలానికి లంబంగా ఉంటాయి.
భూమధ్య రేఖపై ఉన్న ప్రదేశాల వద్ద సూర్యోదయ, సూర్యాస్తమయాలు అత్యంత త్వరగా జరుగుతాయి. సూర్యుడు దిక్చక్రానికి దాదాపు లంబ కోణంలో కదులుతూ ఉండడం దీనికి కారణం. పగటి సమయం ఏడాది పొడవునా స్థిరంగా ఉంటుంది. రాత్రి సమయం కంటే ఇది 14 నిముషాలు ఎక్కువగా ఉంటుంది. వాతావరణ వక్రీభవనం ఒక కారణం కాగా, సూర్యోదయ సూర్యాస్తమయాలు సూర్యుడి పై కొన వద్ద (కేంద్రం వద్ద కాదు) మొదలై, ముగియడం మరొక కారణం.
భూమి కచ్చితమైన గోళాకారంలో కాక, భూమధ్య రేఖ వద్ద కొద్దిగా ఉబ్బి ఉంటుంది. భూమి సగటు వ్యాసం 12,750 కి.మీ. కానీ భూమధ్య రేఖ వద్ద వ్యాసం, ధ్రువాల వద్ద కంటే 43 కి.మీ. ఎక్కువగా ఉంటుంది.[1]
భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న కౌరూ వంటి ప్రదేశాలు అంతరిక్ష రేవులకు అనువైనవి. ఇతర అక్షాంశాల్లో కంటే ఇక్కడ, భ్రమణ వేగం ఎక్కువగా ఉండడంతో, అది అంతరిక్ష నౌక వేగానికి తోడవుతుంది. దీంతో నౌకను ప్రయోగించేందుకు తక్కువ ఇంధనం అవసరమవుతుంది. భూమి పడమర నుండి తూర్పు వైపుకు తిరుగుతుంది కాబట్టి, నౌకను కూడా తూర్పు దిశగానే ప్రయోగిస్తే, భూభ్రమణ వేగాన్ని వాడుకోవచ్చు. కనీసం ఆగ్నేయ, ఈశాన్య దిశల్లోనైనా ప్రయోగించాలి.
భూమధ్య రేఖ వద్ద ఋతువులు, శీతోష్ణస్థితి
[మార్చు]భుమిపై ఋతువులు ఏర్పడడానికి సూర్యుని చుట్టూ భూపరిభ్రమణము, భూభ్రమణాక్షానికి భూపరిభ్రమణతలానికీ మధ్య ఉన్న కోణమూ కారణాలు. ఏడాది కాలంలో కక్ష్యలో భూమి స్థానాన్ని బట్టి, ఉత్తర దక్షిణార్ధ గోళాలు సూర్యుని వైపుగాని, సూర్యుని నుండి దూరంగాగానీ వంగి ఉంటాయి. సూర్యుని వైపు తిరిగి ఉన్న భాగం అధిక సూర్యకాంతిని పొందుతుంది. ఆ సమయాంలో అది వేసవి కాలంలో ఉన్నట్లు. అవతలి వైపు ఉన్న భాగం తక్కువ సూర్యకాంతిని పొందుతుంది. అది శీతాకాలంలో ఉంటుంది. (ఆయనం చూడండి).
విషువత్తులలో భూమి అక్షం సూర్యుని వైపు వంగి ఉండదు; అది సూర్యునికి లంబకోణంలో ఉంటుంది. దానర్థం, భూగోళం యావత్తూ పగలు రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి.
భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఋతువుల మధ్య భేదాలు పెద్దగా ఉండవు. ఏడాది పొడుగూతా ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయి— దక్షిణ అమెరికా, ఆఫ్రికాల్లోని ఎత్తైన పర్వతాలను మినహాయించి. (ఆండీస్ పర్వతాలు, కిలిమంజారో పర్వతాన్ని చూడండి) వర్షాల సమయంలో భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. ఉష్ణదేశాల్లోని ప్రజలు రెండే ఋతువులను పరిగణిస్తారు: వర్షాకాలం, వేసవికాలం. కానీ భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న అనేక ప్రదేశాలు సముద్రంపై గానీ, ఏడాదంతా వర్షయుతంగా గానీ ఉన్నాయి. భూమినుండి ఈ ప్రదేశాలు ఉన్న ఎత్తును బట్టి గాని, సముద్రానికి ఉన్న సామీప్యతను బట్టి గానీ ఇక్కడి ఋతువులు ఉంటాయి.
భూమధ్య రేఖ చాలా వరకు మూడు మహా సముద్రాల గుండా పోతుంది. అవి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలు. భుమధ్య రేఖపై ఉన్న అత్యంత ఎత్తైన ప్రదేశం 4,690 మీ. ఎత్తున 0°0′0″N 77°59′31″W / 0.00000°N 77.99194°W వద్ద ఉంది. ఇది ఈక్వడార్ లో వోల్కన్ కయాంబే దక్షిణ సానువుల్లో ఉంది. ఇది మంచు పడే స్థాయికంటే కొద్దిగా పైన ఉంటుంది. ఈక్వడార్ మొత్తమ్మీద, మంచు నేలపైనే ఉండే ప్రాంతం అదొక్కటే. భూమధ్య రేఖ వద్ద మంచు పడే స్థాయి ఎవరెస్టు పర్వత స్థాయి కంటే 1,000 మీ. తక్కువ, ప్రపంచంలోని అత్యున్నత మంచు స్థాయి కంటే 2,000 మీ. తక్కువ.
భూమధ్య రేఖ వద్ద ఉన్న దేశాలు, ప్రాంతాలు
[మార్చు]భూమధ్య రేఖ 11 దేశాల గుండా పోతుంది. అది రెండు ద్వీప దేశాల గుండా కూడా పోయినప్పటికీ అది ఆ దేశాల్లోని నేలను తాకదు. మధ్యాహ్న రేఖ వద్ధ మొదలై, తూర్పుగా పోయే భూమధ్య రేఖ కింది దేశాల గుండా పోతుంది. :