అక్షాంశ రేఖాంశాలు: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E / 17.483; 78.417

ఎర్రగడ్డ, హైదరాబాద్

వికీపీడియా నుండి
(యర్రగడ్డ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఎర్రగడ్డ
సమీప ప్రాంతాలు
ఎర్రగడ్డ ప్రధాన రహదారి
ఎర్రగడ్డ ప్రధాన రహదారి
ఎర్రగడ్డ is located in Telangana
ఎర్రగడ్డ
ఎర్రగడ్డ
Location in Telangana, India
ఎర్రగడ్డ is located in India
ఎర్రగడ్డ
ఎర్రగడ్డ
ఎర్రగడ్డ (India)
Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E / 17.483; 78.417
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500018
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

ఎర్రగడ్డ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ మొట్టమొదటి మోడల్‌ రైతుబజార్‌ ఏర్పాటుచేయబడింది.[1] ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు, ఎలక్ట్రికల్ పరికరాలు ఉంటాయి.

వైద్యం

[మార్చు]

ఇక్కడ సెయింట్ థెరీసా ఆసుపత్రి, ఎర్రగడ్డ మానసిక అసుపత్రి, ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ వైద్యశాల వంటి ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.

గృహోపకరణాలు

[మార్చు]

మధ్య తరగతి, పేదవారికి అతి తక్కువ ధరలకే ఫర్నీచర్‌ ఇక్కడ దొరుకుతుంది. ఎర్రగడ్డ జాతీయ రహదారి పుట్‌పాత్‌లపై 50 సంవత్సరాలుగా వ్యాపారాలు నిర్వహించబడుతున్నాయి. చెప్పులు పెట్టుకునే స్టాండ్‌ దగ్గర నుంచి స్కూల్‌లో ఉపయోగించే జాయింట్‌ బెంచీల వరకు ఇక్కడ లభ్యమవుతాయి. దాదాపు 25 కుటుంబాలు ఈ వ్యాపారంతోనే పొట్టుపోసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.[2]

రవాణా

[మార్చు]

ఎర్రగడ్డ నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు వివిధ వాహనాల రవాణా సదుపాయం ఉంది. ఇక్కడ ఎర్రగడ్డ మెట్రో స్టేషను కూడా ఉంది.

టిమ్స్ ఆసుపత్రి

[మార్చు]

ఎర్రగడ్డ పరిధిలోని ఎర్ర‌గ‌డ్డ ఛాతీ ఆస్ప‌త్రిలో 17 ఎక‌రాల్లో జీ ప్ల‌స్ 14 అంత‌స్తుల్లో వెయ్యి ప‌డ‌క‌ల మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణానికి 2022 ఏప్రిల్ 26న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు భూమిపూజ చేశాడు. 880 కోట్లు రూపాయలతో నిర్మించనున్న ఈ మ‌ల్టీ సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌లో వెయ్యి ప‌డ‌క‌లను (300 ఐసీయూ బెడ్స్), 16 ఆప‌రేష‌న్ థియేట‌ర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు టి. హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కాలేరు వెంక‌టేష్, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, ఇతర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.[3][4]

ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి

[మార్చు]

పాదచారుల భద్రత కోసం సుమారు 5 కోట్ల రూపాయలతో స్టేర్ కాస్, లిఫ్ట్ గా, ఎస్కలేటర్, షెల్టర్ వాక్ వేతోపాటు మెరుగైన లైటింగ్, భద్రత సౌకర్యాలతో నిర్మించిన ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిని 2022 నవంబరు 14న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, హోంమంత్రి మహమ్మద్ అలీ, మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు.[5]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి (31 October 2015). "నేడు ఎర్రగడ్డ రైతు బజార్‌లో కందిపప్పు కౌంటర్‌ ప్రారంభం". Retrieved 6 June 2018.[permanent dead link]
  2. ఆంధ్రజ్యోతి, తెలంగాణా- కధనాలు (27 September 2017). "పేదవాడి ఫర్నీచర్‌కు కేరాఫ్‌ ఎర్రగడ్డ". Archived from the original on 12 జూన్ 2018. Retrieved 6 June 2018.
  3. "CM KCR: హైదరాబాద్‌లో టిమ్స్‌ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్‌ భూమి పూజ". EENADU. 2022-04-26. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.
  4. telugu, NT News (2022-04-26). "ఎర్ర‌గ‌డ్డ టిమ్స్‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమిపూజ‌". Namasthe Telangana. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.
  5. telugu, NT News (2022-11-14). "ఎర్రగడ్డ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి తలసాని". www.ntnews.com. Archived from the original on 2022-11-14. Retrieved 2022-11-21.