రంగాపురం ఖండ్రిక
రంగాపురం ఖండ్రిక | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 17°10′59.999″N 80°58′0.001″E / 17.18333306°N 80.96666694°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు |
మండలం | చింతలపూడి |
విస్తీర్ణం | 3.19 కి.మీ2 (1.23 చ. మై) |
జనాభా (2011)[1] | 471 |
• జనసాంద్రత | 150/కి.మీ2 (380/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 239 |
• స్త్రీలు | 232 |
• లింగ నిష్పత్తి | 971 |
• నివాసాలు | 154 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 534460 |
2011 జనగణన కోడ్ | 587935 |
రంగాపురం ఖండ్రిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా, చింతలపూడి మండలానికి చెందిన మెట్ట ప్రాంత గ్రామం. ఈ గ్రామం చింతలపూడి పట్టణానికి, తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి పట్టణానికి మధ్య ఉంది. ఈ గ్రామానికి మరోపేరు 'అగ్రహారం' లేక 'రెడ్డి సీమ'. తూర్పు కనుమల్లో శివారు భాగాలైన తేలికపాటి అడవుల మధ్య ఈ గ్రామం ఉంది.
గ్రామ చరిత్ర
[మార్చు]సుమారు 1950 వ సంవత్సరంలో భీమవరం సమీపంలో ఉండి మండలం మహాదేవపట్నానికి చెందిన కొన్ని క్షత్రియ కుటుంబాలు వలస వచ్చారు. ఈ ప్రదేశాన్ని పూర్వం ఒక (తూర్పుచాళుక్య) మహారాజు బ్రాహ్మణుడికి అగ్రహారంగా ఇచ్చాడని కథనం ఉంది. ఒకప్పుడు పులులు, ఎలుగుబంట్లు, నక్కలు, కుందేళ్ళు, అడవిపందులు, జింకలు సంచరించిన ఈ అటవీ ప్రదేశాన్ని వ్యవసాయ భూములుగా మార్చి గ్రామంగా విస్తరించుకున్నారు. ఈ గ్రామానికి స్వర్గీయ శ్రీ గాదిరాజు రామరాజు (చిట్టిబాబు) మున్సబుగా చేశారు. తరువాత ఈ గ్రామం సీతానగరం పంచాయితీలో చేర్చబడింది.
గ్రామ భౌగోళికం
[మార్చు]సమీప గ్రామాలు
[మార్చు]సీతానగరం, మేడిశెట్టివారిపాలెం, అల్లిపల్లి, తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన బేతుపల్లి-గంగారం, దమ్మపేట, మందలపల్లి
విద్యా సౌకర్యాలు
[మార్చు]ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఎ.వి పబ్లిక్ స్కూలు అనే ప్రయివేటు పాఠశాల కూడా ఉంది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]సత్తుపల్లి మండలానికి చెందిన బేతుపల్లి-గంగారం గ్రామ శివార్లనుండి సీతానగరం గ్రామానికి 7 కిలోమీటర్ల రోడ్డు ఉంది. సీతానగరం గ్రామం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి A.P.S.R.T.C బస్సు సౌకర్యం లేకపోవుటవలన కేవలం ద్విచక్ర వాహనాల సాయంతో చేరుకోవచ్చును.
వైద్య సౌకర్యాలు
[మార్చు]ఈ గ్రామ ప్రజలకు వైద్య సదుపాయం చాలా తక్కువ అని చెప్పవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు 15 కిలోమీటర్ల సమీపంలో ఉన్న సత్తుపల్లి గ్రామానికి, 70 కిలోమీటర్ల సమీపంలో ఉన్న ఏలూరుకు, ఇతర ఆరోగ్య సమస్యలకు 150 కిలోమీటర్ల సమీపంలో ఉన్న విజయవాడకు వెళ్ళాల్సివుంటుంది.
మౌలిక వసతులు
[మార్చు]ఈ గ్రామం వారు అవసరానికి సీతానగరం రావాల్సివుంటుంది.
ప్రధాన పంటలు
[మార్చు]ఆయిల్ పామ్, మామిడి, జీడి మామిడి, వేరుశనగ, జొన్న, పసుపు, కోకోవా, కొబ్బరి, బత్తాయి, నిమ్మ, అరటి మొదలైనవి.
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, అపరాలు, కాయగూరలు మూగజీవాల పెంపకం ఈ గ్రామంలో ప్రధాన వృత్తులు.
నేలలు
[మార్చు]రాళ్ళు కలిగిన ఇసుక నేలలు, కొన్ని చోట్ల ఒండ్రు మట్టి
కులాలు
[మార్చు]క్షత్రియ, రాజులు, కాపులు, కమ్మవారు, గొల్లలు
ఔషధ మొక్కలు
[మార్చు]రావి, మర్రి, జువ్వి, చిత్రమూలం, దురదగొండి, అతబల, నేలవేము, బోడతరము, గుంటగలగర, వెంపలి, గరుడ ముక్కు, తిప్పతీగ, హోలరెనా, సఫేది ముస్లీ, అత్తిపత్తి, కసివింద, రేల, మద్ది, నల్ల పసుపు, కేవుకంద, అడవి తులసి, భూతులసి, వాండా, తెల్లగలిజేరు, సుగంధపాల, మరులమాతంగి, నల్ల వావిలి, శీకాయ, సముద్రపాల, అడవిద్రాక్ష, అడవి మల్లి మొదలైనవి.
గణాంకాలు
[మార్చు]- జనాభా (2011) - మొత్తం 471 - పురుషుల సంఖ్య 239 - స్త్రీల సంఖ్య 232 - గృహాల సంఖ్య 154
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017