వాసు ఇంటూరి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వాసు ఇంటూరి | |
---|---|
జననం | వాసు ఇంటూరి |
విద్య | బీఎస్సీ |
వాసు ఇంటూరి ఒక టీవీ, సినీ నటుడు, దర్శకుడు.[1] అమృతం సీరియల్లో సర్వం పాత్రతో ప్రేక్షకులకు సుపరిచితుడు. గంగతో రాంబాబు అనే సీరియల్ కు కూడా దర్శకత్వం వహించాడు. అమృతం చందమామలో అనే సినిమాకు దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజుతో కలిసి స్క్రిప్టు రచించాడు.[2]
జీవితం
[మార్చు]వాసు స్వస్థలం బాపట్ల. తండ్రి వీఆర్వోగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. వాసు బాపట్లలో ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల నుంచి బీఎస్సీ పట్టా పొందాడు. ఎంసీయే చదవడం కోసం హైదరాబాదుకు వచ్చాడు కానీ సినిమా రంగం మీద ఆసక్తితో మధ్యలోనే వదిలేశాడు.
కెరీర్
[మార్చు]సుమారు ఆరు సంవత్సరాల పాటు సహాయ దర్శకుడిగా, స్క్రిప్టు రచయితగా పనిచేశాడు. గుణ్ణం గంగరాజు నిర్మించిన అమృతం కార్యక్రమంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 313 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఆ సీరియల్ కు సహాయ దర్శకుడిగా, దర్శకుడిగా, స్క్రిప్టు రచయితగా పనిచేశాడు.[1] అందులో సర్వేశ్వరన్ అలియాస్ సర్వం అనే అమాయకుడైన పనివాడి పాత్రలో కూడా నటించాడు. వాసు నటించిన ఇతర సీరియళ్ళు మై నేం ఈస్ మంగతాయారు, నాన్న (జెమిని టివి), శ్రీకృష్ణావతారాలు, గంగతో రాంబాబు, ఎదురీత మొదలైనవి.
నటించిన సినిమాలు
[మార్చు]- అనుకోకుండా ఒక రోజు
- అష్టాచెమ్మా
- గోల్కొండ హైస్కూల్
- సాహసం
- చెంబు చిన సత్యం (2015)
- చందమామ కథలు
- అమృతం చందమామలో
- రోజులు మారాయి
- ఐపిసి సెక్షన్ (2018)
- బేవర్స్ (2018)
- అన్నపూర్ణ ఫొటో స్టూడియో (2023)
- ఛాంగురే బంగారు రాజా (2023)
- శ్రీరంగనీతులు (2024)
- సుందరకాండ (2024)
- శ్వాగ్ (2024)
సీరియళ్ళు
[మార్చు]- రెండురెళ్ళు ఆరు (రచన, నిర్మాణం, దర్శకత్వం)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "తెలుగు సినీ నటుడు వాసు ఇంటూరి". nettv4u.com. Retrieved 23 September 2016.
- ↑ సాక్షి విలేఖరి. "మాది 'ఏ' సర్టిఫికెట్ సినిమా :గుణ్ణం గంగరాజు". sakshi.com. జగతి పబ్లికేషన్స్. Retrieved 23 September 2016.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వాసు ఇంటూరి పేజీ