Jump to content

సెర్ఛిప్

అక్షాంశ రేఖాంశాలు: 23°18′32″N 92°51′24″E / 23.308996°N 92.856701°E / 23.308996; 92.856701
వికీపీడియా నుండి
సెర్ఛిప్
పట్టణం
దస్త్రం:Serchhip.jpg
Nickname: 
సెర్కావ్‌పుయి
సెర్ఛిప్ is located in Mizoram
సెర్ఛిప్
సెర్ఛిప్
మిజోరాంలో ప్రాంతం ఉనికి
సెర్ఛిప్ is located in India
సెర్ఛిప్
సెర్ఛిప్
సెర్ఛిప్ (India)
Coordinates: 23°18′32″N 92°51′24″E / 23.308996°N 92.856701°E / 23.308996; 92.856701
దేశం భారతదేశం
రాష్ట్రంమిజోరాం
జిల్లాసెర్ఛిప్
Elevation
888 మీ (2,913 అ.)
జనాభా
 (2011)
 • Total64,875
 • జనసాంద్రత46/కి.మీ2 (120/చ. మై.)
భాషలు
 • అధికారికమిజో
Time zoneUTC+౦5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
796181
టెలిఫోన్ కోడ్+913838
Vehicle registrationఎంజెడ్-06
సమీప పట్టణంఐజాల్
స్త్రీ పురుష నిష్పత్తి976 /
అక్షరాస్యత98.76%
లోక్‌సభ నియోజకవర్గంమిజోరాం లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసెర్ఛిప్
సివిక్ ఏజెన్సీగ్రామ కౌన్సిల్

సెర్ఛిప్, మిజోరాం రాష్ట్రంలోని సెర్ఛిప్ జిల్లా ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం. మిజోరాం మధ్యభాగంలో ఉన్న ఈ పట్టణం రాష్ట్ర రాజధాని ఐజాల్ నగరానికి 112 కి.మీ.ల దూరంలో ఉంది. దేశం మొత్తంమీద ఈ జిల్లాలో అత్యధిక అక్షరాస్యత ఉంది. సెర్ఛిప్ గ్రామంలోని మొదటి కొండపైన కనిపించే సిట్రస్ చెట్ల నుండి సెర్ఛిప్ అనే పేరు వచ్చింది.

భౌగోళికం

[మార్చు]

సెర్ఛిప్ పట్టణం 23°18′N 92°50′E / 23.3°N 92.83°E / 23.3; 92.83 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1] ఇది సముద్రమట్టానికి 888 మీటర్లు (2,913 అడుగులు) ఎత్తులో ఉంది. మాట్ నది, టుయికుమ్ నదుల మధ్య ఉన్న సెర్ఛిప్ పట్టణానికి టుయికుమ్ నది నుండి త్రాగునీరు, మాట్ నది నుండి సాగునీరు అందుతోంది. పట్టణ వార్షిక ఉష్ణోగ్రతలు 34-10 డిగ్రీల వరకు ఉంటుంది

జనాభా

[మార్చు]

2011 భాతర జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 64,875 మంది జనాభా ఉన్నారు. ఇందులో 32,824 మంది పురుషులు, 32,051 మంది స్త్రీలు ఉన్నారు. 2001నాటి జనాభాతో పోలిస్తే జనాభా పెరుగుదలలో 20.45 శాతం మార్పు ఉంది.

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

ఈ పట్టణంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. ఈ పట్టణానికి సమీపంలో మాట్ నది లోయ ఉన్నందువల్ల క్యాబేజీ, ఆవపిండిలకు పంటలకు పేరొందింది.

జాల్పుయ్

రవాణా

[మార్చు]

ఇక్కడ పవన్ హన్స్ (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[2] ఈ పట్టణం 54వ జాతీయ రహదారి ద్వారా సిల్చార్ కు, 40వ జాతీయ రహదారి ద్వారా అగర్తలాకు, 150వ జాతీయ రహదారి ద్వారా ఇంఫాల్కు కలుపబడుతోంది. ఇక్కడ బస్సు, టాక్సీ, ఆటోరిక్షాలతో రవాణా సౌకర్యం ఉంది.

ప్రజారోగ్యం

[మార్చు]

ఇక్కడ మలేరియా, కాన్సర్ వంటి ప్రజారోగ్య సమస్యలు ఉన్నాయి. అంగన్వాడి కేంద్రాల నుండి శిశువులు, పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య, పోషక పదార్ధాలను అందిస్తున్నారు.

పారాగ్లైడింగ్

[మార్చు]

ఇది ఇక్కడి ప్రజలకు కొత్త ఆట. 2020లో ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సెర్ఛిప్‌ పట్టణంలో ఇంటర్నేషనల్ పారాగ్లైడింగ్ ఛాంపియన్‌షిప్ జరిగింది.

మూలాలు

[మార్చు]
  1. Falling Rain Genomics, Inc - Serchhip
  2. "MIZORAMA HELICOPTER SERVICE TUR CHIEF MINISTER IN HAWNG". Mizoram DIPR. Archived from the original on 12 డిసెంబరు 2013. Retrieved 28 December 2020.

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సెర్ఛిప్&oldid=4150104" నుండి వెలికితీశారు