చార్మినార్ ఎక్స్‌ప్రెస్
వికీపీడియా నుండి
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (Charminar Express; హిందీ: चारमिनार एक्सप्रेस) భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది హైదరాబాద్ మరియు చెన్నై పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. దీనికి హైదరాబాద్ లోని చారిత్రాత్మక నిర్మాణం చార్మినార్ స్మారకంగా నామకరణం చేశారు. దీనిని దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్నది.
ఇది 790 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 12 గంటలు ప్రయాణిస్తుంది.
రైలుబండ్ల సమయం [మార్చు]
- రైలుబండి సంఖ్య 12759 చెన్నై నుండి హైదరాబాద్ చేరుస్తుంది. ఇది చెన్నై సెంట్రల్ లో సాయంత్రం 18.10 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 08.00 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
- రైలుబండి సంఖ్య 12760 హైదరాబాద్ నుండి చెన్నై చేరుస్తుంది. ఇది హైదరాబాద్ లో సాయంత్రం 18.30 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 08.15 గంటలకు చెన్నై చేరుతుంది.
సమయ పట్టిక [మార్చు]
| SNo | స్టేషన్ కోడ్ | స్టేషన్ పేరు | Route No. | Arrival Time | Dep. Time | దూరం | రోజు |
|---|---|---|---|---|---|---|---|
| 1 | MAS | చెన్నై సెంట్రల్ | 1 | Source | 18:10 | 0 | 1 |
| 2 | SPE | సూళ్ళూరుపేట | 1 | 19:19 | 19:20 | 83 | 1 |
| 3 | NYP | నాయుడుపేట | 1 | 19:43 | 19:45 | 110 | 1 |
| 4 | GDR | గూడూరు కూడలి | 1 | 20:40 | 20:45 | 138 | 1 |
| 5 | NLR | నెల్లూరు | 1 | 21:09 | 21:11 | 176 | 1 |
| 6 | KVZ | కావలి | 1 | 21:47 | 21:49 | 227 | 1 |
| 7 | OGL | ఒంగోలు | 1 | 22:43 | 22:45 | 292 | 1 |
| 8 | CLX | చీరాల | 1 | 23:18 | 23:20 | 342 | 1 |
| 9 | TEL | తెనాలి కూడలి | 1 | 00:15 | 00:17 | 399 | 2 |
| 10 | BZA | విజయవాడ కూడలి | 1 | 01:15 | 01:25 | 431 | 2 |
| 11 | KMT | ఖమ్మం | 1 | 02:28 | 02:30 | 532 | 2 |
| 12 | DKJ | డోర్నకల్ కూడలి | 1 | 02:59 | 03:00 | 555 | 2 |
| 13 | MABD | మహబూబాబాద్ | 1 | 03:18 | 03:20 | 579 | 2 |
| 14 | WL | వరంగల్ | 1 | 04:13 | 04:15 | 639 | 2 |
| 15 | KZJ | కాజీపేట కూడలి | 1 | 04:40 | 04:42 | 649 | 2 |
| 16 | SC | సికింద్రాబాద్ కూడలి | 1 | 07:15 | 07:20 | 781 | 2 |
| 17 | HYB | హైదరాబాద్ దక్కన్ | 1 | 08:00 | Destination | 790 | 2 |