జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్
వికీపీడియా నుండి
జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్ (Javier Pérez de Cuéllar) ఐక్యరాజ్య సమితికి 5 వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పెరూకు చెందిన దౌత్యవేత్త. ఇతడు 1920, జనవరి 19న పెరూ రాజధాని నగరం లిమాలో జన్మించాడు.
డిక్యుల్లర్ 1940లో పెరూ విదేశాంగ మంత్రిగా, 1944లో దౌత్య సర్వీసులో పనిచేసినాడు. ఆ తరువాత ఫ్రాన్స్ లోని పెరూ దౌత్య కార్యాలయంలో కార్యదర్శిగా వ్యవహరించనాడు. ఆ తదుపరి కాలములలో డిక్యుల్లర్ స్విట్జర్లాండ్, సోవియట్ యూనియన్ (నేటి రష్యా), పోలాండ్, వెనుజులాలలో రాయబారిగా పనిచేసినాడు. 1946లో లండన్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తొలి సమావేశపు కాలములో అతడు పెరూ నుంచి జూనియర్ సభ్యుడిగా హాజరైనాడు. 1973 మరియు 1974లలో భద్రతా మండలిలో తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించినాడు. 1974 జూలైలో సైప్రస్ సమస్య వివాదించు కాలములో డుక్యుల్లర్ భద్రతా మండలి అధ్యక్షుడిగా ఉన్నాడు. 1975, సెప్టెంబర్ 18 నాడు అతడికి సైప్రస్‌లో ప్రధాన కార్యదర్శి యొక్క ప్రధాన దూతగా నియమించినారు. ఈ పదవిలో అతడు 1977 డిసెంబర్ వరకు కొనసాగినాడు. 1979, ఫిబ్రవరి 27న ఐక్యరాజ్య సమితి యొక్క ఉప ప్రధాన కార్యదర్శిగా ప్రత్యేక రాజకీయ అంశం కొరకు నియమించబడినాడు. అప్ఘనిస్తాన్ సమస్యపై కూడా ప్రధాన కార్యదర్శి యొక్క ప్రత్యేక దూతగా వ్యవహరించే అవకాశం లభించినది. 1981, డిసెంబర్ 31 న డిక్యుల్లర్ ఐక్యరాజ్య సమితి యొక్క 5 వ ప్రధాన కార్యదర్శిగా పదవీ భాధ్యతలు కుర్ద్ వాల్దీమ్ నుంచి స్వీకరించినాడు. 1986లో అతడు తిరిగి రెండో పర్యాయము ఐరాస ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 1991, డిసెంబర్ 31 వరకు పదవిలో కొనసాగినాడు. రెండు సందర్భాల్లోను కూడా డిక్యుల్లర్ ఫాక్లాండ్ దీవుల సమస్యపై బ్రిటన్ మరియు అర్జెంటీనాల మద్య మద్యవర్తిగా నిర్వర్తించాడు. ఆ విధంగా మధ్య అమెరికాలో శాంతిసాధనకు దోహదపడినాడు. ఇతని తరువాత బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. డిక్యుల్లర్ 1995లో పెరూ అద్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో అల్బెర్టో ఫుజుమొరితో పోటీపడి పరాజయం పొందినాడు.
[మార్చు] బయటి లింకులు
|
|
|
|---|---|
| ట్రిగ్వేలీ · డాగ్ హమ్మర్స్ జోల్డ్ · యూ థాంట్ · కుర్ట్ వాల్దీమ్ · జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్ · బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ · కోఫీ అన్నన్ · బాన్ కి మూన్ |