కోఫీ అన్నన్
1938, ఏప్రిల్ 8న ఘనా లోని కుమాసిలో జన్మించిన కోఫి అన్నన్ (Kofi Atta Annan) ఐక్యరాజ్య సమితి యొక్క మాజీ ప్రధాన కార్యదర్శి. ఇతను ఐక్య రాజ్య సమితికి 7 వ ప్రధాన కార్యదర్శి. ఆఫ్రికా ఖండం నుంచి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు. రెండు సార్లు ఎనికై 1997, జనవరి 1 నుంచి పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగినాడు. 2001లో ఇతడికి నోబెల్ శాంతి బహమతి లభించింది.
ఘనా లోని కుమాసిలో జన్మించిన ఇతడు ఉన్నత విద్య అమెరికాలో అభ్యసించాడు. 1961లో డిగ్రీ , 1972లో మేనేజిమెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. 1962లో బడ్జెట్ అధికారిగా అన్నన్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించాడు. 1987-92 కాలంలో సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 1997లో తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ నుంచి బాధ్యతలు చేపట్టినాడు. 5 సంవత్సరాల పదవీ కాలం అనంతరం రెండో పర్యాయం మళ్ళీ ఎన్నికై 2002 నుంచి మరో ఐదేళ్ళు పనిచేసి, ప్రస్తుత ప్రధాన కార్యదర్శిబాన్ కి మూన్ కు అధికారం అప్పగించాడు.
విషయ సూచిక |
[మార్చు] కుటుంబం
అన్నన్ కవల పిల్లల్లో ఒకడు. ఇది ఘనా దేశపు సంస్కృతిలో చాలా విశేషంగా చెప్పుకుంటారు. ఆయన కవల సహోదరియైన ఎఫువా అట్టా 1991 లో మరణించింది. అట్టా అంటే ఘనా భాషలో కవలలు అని అర్థం. ఘనా సంస్కృతి ప్రకారం మొదటి పేరైన కోఫీ వారు పుట్టిన రోజును సూచిస్తుంది. కోఫీ అనే మెదటిపేరు కలవారంతా శుక్రవారం పుట్టినట్లు లెక్క. ఆయన పేరును చాలామంది అన్నన్ అని వ్యవహరిస్తారు కానీ ఆయన మాత్రం యానన్ అని పలుకుతారు.
అన్నన్ కుటుంబమంతా ఆ దేశపు ఉన్నత వర్గానికి చెందినది. ఆయన తాతలిద్దరూ మరియు మామగారు కూడా వారి తెగకు నాయకులు.అన్నన్ స్వీడన్కు చెందిన నానె మరియా అన్నన్ అనే లాయర్ ను వివాహమాడాడు. అంతకు మునుపు నైజీరియాకు చెందిన టిటీ అలాకిజా అనే మహిళ ను వివాహం తరువాత ఇద్దరు పిల్లలు కలిగారు. తరువాత ఆమెతో 1970లలో విడాకులు తీసుకున్నాడు.
[మార్చు] బిరుదులు
- 2001లో ఐక్యరాజ్యసమితితో కల్సి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది.
- 2007లో బ్రిటీష్ రాణి నుంచి నైట్‌హుడ్ బిరుదు లభించింది.[1]
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
|
|
|
|---|---|
| ట్రిగ్వేలీ · డాగ్ హమ్మర్స్ జోల్డ్ · యూ థాంట్ · కుర్ట్ వాల్దీమ్ · జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్ · బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ · కోఫీ అన్నన్ · బాన్ కి మూన్ |
|
|
|
|---|---|
|
కోఫీ అన్నన్ / ఐక్యరాజ్యసమితి (2001) • జిమ్మీ కార్టర్ (2002) • శిరిన్ ఎబాడి (2003) • వంగారి మాథాయ్ (2004) • International Atomic Energy Agency / మహమద్ ఎల్బరడెయ్ (2005) • గ్రామీన్ బ్యాంక్ / మహమద్ యూనస్ (2006) • అల్ గోరె / Intergovernmental Panel on Climate Change (2007) |
|