దుగ్గిరాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దుగ్గిరాల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం దుగ్గిరాల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 10,280
 - పురుషులు 5,137
 - స్త్రీలు 5,143
 - గృహాల సంఖ్య 2,555
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
  ?దుగ్గిరాల మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటములో దుగ్గిరాల మండలం యొక్క స్థానము
గుంటూరు జిల్లా పటములో దుగ్గిరాల మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°21′55″N 80°35′52″E / 16.365274°N 80.597706°E / 16.365274; 80.597706
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము దుగ్గిరాల
జిల్లా(లు) గుంటూరు
గ్రామాలు 14
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
60,420 (2001)
• 30346
• 30074
• 70.20
• 76.09
• 63.30


దుగ్గిరాల (ఆంగ్లం: Duggirala) గుంటూరు జిల్లాలో తెనాలి సమీపములోని ఒక గ్రామం మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రం. పిన్ కోడ్ నం. 522 330., ఎస్.టి.డి.కోడ్ = 08644.

దుగ్గిరాల భారతదేశంలోని ప్రధాన పసుపు వ్యాపారకేంద్రాల్లో ఒకటి.

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

 1. శ్రీ భూ, నీలా సమేత చెన్నకేశవస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, 2014,ఏప్రిల్-12 రాత్రి నుండి 15 వతేదీ వరకూ నిర్వహించెదరు. 13వ తేదీ రాత్రి 7 గంటలకు, స్వామివారి కళ్యాణం, వైభవంగా నిర్వహించినారు. అర్చకుల పవిత్ర వేదమంత్రాల మధ్యన, ఉదయం నుండి ప్రత్యేకపూజలు, అభిషేకాలు జరిపినారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. 14న భక్తుల దర్శనార్ధం, ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించినారు. విష్ణాలయం నుండి శివాలయం, జెండాచెట్టు, గ్యాస్ కంపెనీ, రైలుపేట మీదుగా ఈ ఉత్సవం సాగింది. గ్రామ వీధులలో భక్తులు, స్వామివారికి హారతుకు పట్టి నైవేద్యాలు సమర్పించినారు. [6]
 2. శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖమాసం(మే నెల)లో నాలుగు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. రెండవ రోజు రాత్రికి స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. [7]
 3. శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ రామాలయం:- దుగ్గిరాల రామానగర్ లో, గ్రామస్థుల వితరణతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2014, ఆగష్టు-20, శ్రావణమాసం, బుధవారం నాడు, విగ్రహప్రతిష్ఠా కార్యక్రం, కన్నులపండువగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలోభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. [8]

గ్రామ ప్రముఖులు[మార్చు]

దుగ్గిరాల గ్రామానికి చెందిన శ్రీ వెనిగళ్ళ సత్యనారాయణరావు గారు, స్వాతంత్ర్య సమరయోధునిగా కారాగార శిక్ష అనుభవించారు. గ్రామ సర్పంచిగా పనిచేసి గ్రామాభివృద్ధికి బాటలు వేశారు. ప్రజాభిమానంతో వరుసగా సమితి అధ్యక్షునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, మంత్రిగా నిస్వార్ధ సేవలందించారు. దుగ్గిరాల గ్రామానికి డిల్లీ స్థాయిలో పేరు తెచ్చి పెట్టారు. అదే స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేశారు. మూడు వంతెనలు, ప్రత్యేక రహదారులు, యార్డు ఏర్పాటుచేసి, పసుపు వ్యాపారంలో దుగ్గిరాలకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చి పెట్టారు. గ్రామంలో టెలిఫోను ఎక్ఛేంజి, విద్యుత్తు సబ్ స్టేషను నిర్మింపజేశారు. రెండు సార్లు ఎం.ఎల్.సి.గా, మొత్తం 12 సం. రాజకీయ సేవలందించారు. [4]

గ్రామ పంచాయతీ[మార్చు]

 1. శ్రీ నిమ్మగడ్డ వెంకట్రావు గారు, 1959 నుండి 1964 వరకూ ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. శ్రీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, అప్పటి రాష్ట్ర సలహా కమిటీలో, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, గౌతు లచ్చన్న గార్లతోపాటు, వీరు గూడా సభ్యులుగా ఉన్నారు. వీరు 2014,మార్చిలో కాలధర్మం చెందినారు. [5]
 2. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి మేఘావత్ పార్వతీబాయి సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ వల్లూరి కోటేశ్వరరావు ఎన్నికైనారు. [3]

పరిశ్రమలు[మార్చు]

దేశంలోని అగ్రగామి కాఫీ తయారి సంస్థ "కాంటినెంటల్ కాఫీ" దుగ్గిరాల పట్టణంలో ఉంది.

గణాంకాలు[మార్చు]

 • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 10280
 • పురుషులు 5137
 • మహిళలు 5143
 • నివాసగ్రుహాలు 2555
 • విస్తీర్ణం 805 హెక్టారులు
 • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • చింతలపూడి 3 కి.మీ
 • అనుమర్లపూడి 3 కి.మీ
 • నందివెలుగు 3 కి.మీ
 • మోరంపూడి 4 కి.మీ
 • ఈమని 4 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

 • దక్షణాన తెనాలి మండలం
 • పశ్చిమాన పెదకాకాని మండలం
 • ఉత్తరాన మంగళగిరి మండలం
 • తూర్పున కొల్లిపర మండలం

మండలంలోని గ్రామాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

 • [1]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 • [2]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.

[3] ఈనాడు విజయవాడ/మంగళగిరి; జనవరి-14,2014;1వ పేజీ. [4] ఈనాడు గుంటూరు; 2013,జులై-18; 8వ పేజీ. [5] ఈనాడు విజయవాడ/మంగళగిరి; 2014,మార్చ్-10, 2వ పేజీ. [6] ఈనాడు విజయవాడ/మంగళగిరి; 2014; ఏప్రిల్-14/15; 1వ పేజీ. [7] ఈనాడు విజయవాడ/మంగళగిరి; మే-10,2014; 2వ పేజీ. [8] ఈనాడు విజయవాడ/మంగళగిరి; 2014, ఆగష్టు-21; 2వపేజీ.


సై

"http://te.wikipedia.org/w/index.php?title=దుగ్గిరాల&oldid=1285644" నుండి వెలికితీశారు