పనప్పాకం ఆనందాచార్యులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పనప్పాకం ఆనందాచార్యులు (1843 - 1908) అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు.[1]

వీరు చిత్తూరు జిల్లాకు చెందిన కడమంచి గ్రామంలో 1843 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసాచార్యులు. వీరు చిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయంలో 1863లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1865లో ఎఫ్.ఎ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చియప్పా పాఠశాలలో ఉపాధ్యాయునిగా 1969 వరకు పనిచేశారు. ప్రైవేటుగా చదివి 1869లో బి.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై మద్రాసు హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులైన కావలి వెంకటపతిరావు వద్ద అప్రెంటిస్ గా పనిచేశారు. 1870లో వకీలుగా అనుమతిని పొంది హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులయ్యారు. వీరు 1889లో మద్రాసు అడ్వకోట్ల సంఘాన్ని స్థాపించారు.

వీరు 1885లో బొంబాయిలో సమావేశమైన నాటి నుండి భారత జాతీయ కాంగ్రెసు సభా సమావేశాలలో పాల్గొని గణనీయమైన సేవచేశారు. 1891 నాగపూర్ లో జరిగిన 7వ జాతీయ సభకు వీరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ పదవిని అలంకరించిన మొట్టమొదటి దక్షిణ భారతీయులు వీరు. వీరు కాంగ్రెసు కార్యనిర్వహక సంఘంలో సభ్యులుగాను, అలహాబాదు కాంగ్రెసు కార్యదర్శులలో ఒకరుగా ఎన్నికయ్యారు. 1896లో భారతీయ సామ్రాజ్య శాసనసభకు చెన్నై నుండి ప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు. ఆ సభలో నిర్భయంగా ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసి 1903లో రాజీనామా చేశారు.

వీరు 1908లో పరమపదించారు.

మూలాలు[మార్చు]

  1. అనంతా (ఆనందా) చార్యులు, పనప్పాకం (1843-1907), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 11 - 12.

బయటి లింకులు[మార్చు]