మున్నంగి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ?మున్నంగి ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు • తీరము |
63.15 కి.మీ² (24 sq mi) • 30 మీ (98 అడుగులు) • 66 km (41 mi) |
| వాతావరణం • అవపాతం ఉష్ణోగ్రత • వేసవికాలం • శీతాకాలం |
Tropical (Köppen) • 989.1 mm (38.9 in) 27 °సె (81 °ఫా) • 48 °సె (118 °ఫా) • 18.6 °సె (65 °ఫా) |
| దూరాలు • Hyderabad నుండి • Delhi నుండి • Mumbai నుండి |
• 295 కి.మీలు NW (rail) • 1,798 కి.మీలు N (land) • 1,003 కి.మీలు W (land) |
| ప్రాంతం | కోస్తా ఆంధ్ర |
| జిల్లా(లు) | గుంటూరు |
| భాష(లు) | తెలుగు |
| M.L.A | నాదెండ్ల మనోహర్ |
| జిల్లా కలెక్టరు | బి. రామాంజనేయులు |
| S.P. | బాగ్చి |
| లోక్‌సభ నియోజకవర్గం | తెనాలి |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 522 304 • +91-8644-272 • AP 07, |
| వెబ్‌సైటు: www.munnangi.com | |
మున్నంగి గుంటూరు జిల్లా కొల్లిపర మండలములోని ఒక గ్రామము. మున్నంగి కృష్ణా నది తీరాన కలదు. దీనిని పూర్వము మునికోటిపురము అని పిలిచేవారు.
విషయ సూచిక |
పేరు వెనుక కథ [మార్చు]
మునికోటిపురము అని ఈ గ్రామానికి పేరు రావడానికి కారణంగా ఈ కథను చెప్పుకుంటారు. పూర్వం కోటి మంది మునులు కృష్ణా నది తీరాన ప్రాతఃకాలానికి ముందు తపస్సు చేస్తూ ఉండేవారు. జనసంచారం మొదలవక ముందే వారు అదృశ్యమయేవారు. ఒక రోజు కృష్ణా నదీ తీరాన గల పంట పొలాలలో (లంక)పని చేస్తున్న ఒక రైతు చీకటి పడగా ఆ రేయి అక్కడే నిదురించెను.అర్దరాత్రి సమయములో మెలకువ వచ్చిన ఆ రైతుకు కోటి మంది మునులు కృష్ణా నదీ తీరాన తపస్సు చేస్తూ కనిపించారు. ఆశ్చర్యంతో వారి తపస్సును గమనిస్తున్న ఆ రైతును మునులలో ఒకరు "ఈ విషయాన్ని ఎవరికైనా తెలియపరచిన నీ తల వేయి ముక్కలవును"అని శపించెను. భయముతో ఆ రైతు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆ రైతు తన అవసాన దశలో ఈ సంగతిని తన బంధువులకు వెల్లడించగా, వెంటనే అతని తల వేయి వ్రక్కలయెను. ఆ తెల్లవారు ఝామున ప్రజలు కృష్ణా నదీ తీరానికి వెళ్ళి చూడగా మునులు అదృశ్యమై, ఆ రోజు నుండి వారు మరలా ఎవరికీ కనిపించలేదు. అలా ఈ ఊరికి "మునికోటిపురము" అనే నామము వచ్చెను. కాలక్రమేణా 'మున్నంగి'గా వ్యవహరించబడసాగెను.
గ్రామ విశేషణములు [మార్చు]
- విశ్వనాథ సత్యనారాయణ గారిని మున్నంగి గ్రామ ప్రజలు ఆహ్వానించి సన్మానమును జరిపెను. విశ్వనాథ వారు మున్నంగిలోని వేణుగోపాలస్వామి మీద "మున్నంగి వేణుగోపాలా!" అను మకుటముతో నొక శతకమును వ్రాసెను. అది మధ్యాక్కరలలో గలదు.
- స్వర్గీయ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి మున్నంగిని సందర్శించి ఇందిరా గాంధీ విగ్రహావిష్కరణను జరిపెను.
- మున్నంగి గ్రామము సర్వమతసమానమైనది. ఈ గ్రామములో హిందువులతో పాటు ముస్లీములు, క్రైస్తవులు కలసిమెలసి నివసిస్తున్నారు. హిందూ దేవాలయములతో పాటుగా చర్చి, మసీదులు కూడా కలవు. ఇక్కడ ఉర్దూ పాఠశాలకూడా ఉండుట దీనికి నిదర్శనం.
- మున్నంగి దేవాలయాలలో శివాలయము ప్రత్యేకమైనది. ఇది ఐదు గుళ్ళ సముదాయము.ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క దైవస్వరూపము(శ్రీగంగా పార్వతీ సమేత శ్రీసకల కోటేశ్వరస్వామి, శ్రీ భ్రమరాంభ సమేత శ్రీశైలమల్లిఖార్జున స్వామి, శ్రీ బాలత్రిపుర సుందరీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ షట్ క్రోణబాలత్రిపురసుందరీ దేవి, అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి) కలరు.ఈ ఐదు గుళ్ళకు ఒకే ద్వారముండుట ఈ గుడి ప్రత్యేకత. అందుకే ఈగుడిని "ఐదు దేవుళ్ళ గుడి"గా పిలుస్తారు.
కొన్ని గణాంకాలు [మార్చు]
- జనాభా: 6597
- పురుషులు: 3325
- స్త్రీలు: 3272
- అక్షరాస్యత: 69.35 శాతం
- పురుషుల అక్షరాస్యత: 73.77 శాతం
- స్త్రీల అక్షరాస్యత: 64.91 శాతం
బయటి లింకులు [మార్చు]
|
|
|
|---|---|
| వల్లభాపురం · మున్నంగి · దంతులూరు · కుంచవరం · అత్తోట · సిరిపురం · చివలూరు · పిడపర్రు · పిడపర్తిపాలెం · కొల్లిపర · జెముడుపాడు · జెముడుపాడు పాలెం · దావులూరు · దావులూరు పాలెం · తూములూరు · హనుమాన్ పాలెం · బొమ్మువానిపాలెం · అన్నవరం(కొల్లిపర) · అన్నవరం లంక · గుదిబండి వారి పాలెం · గొడవర్రు |