Coordinates: 15°53′30″N 77°49′10″E / 15.891572°N 77.819481°E / 15.891572; 77.819481

రాజోలి (జోగులాంబ గద్వాల జిల్లా)

వికీపీడియా నుండి
(రాజోలి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

రాజోలి, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలానికి చెందిన గ్రామం.[1]

రాజోలి
—  రెవిన్యూ గ్రామం  —
రాజోలి is located in తెలంగాణ
రాజోలి
రాజోలి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°53′30″N 77°49′10″E / 15.891572°N 77.819481°E / 15.891572; 77.819481
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం వడ్డేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 12,489
 - పురుషుల సంఖ్య 6,424
 - స్త్రీల సంఖ్య 6,065
 - గృహాల సంఖ్య 2,848
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)లో ఉండేది. [2]ఇది మండలంలోని పెద్ద గ్రామాలలో ఒకటి. ఈ గ్రామం కర్నూలు జిల్లా సరిహద్దులో ఉంది.ఈ గ్రామవాసులు నిత్యావసరాలకు కర్నూలు తరచూ వెళ్ళడం జర్గుతుంది. బస్సు సదుపాయాలు కూడా కర్నూలు నుంచి అధికంగా ఉన్నాయి.ఈ గ్రామం తుంగభద్ర నది పై కల సుంకేశుల ఆనకట్ట ప్రక్కనే ఉంది. డ్యాం గేట్లు తెరిచినప్పుడు వడ్డేపల్లి మార్గములో కల వాగు నిండి రోడ్డు సౌకర్యంనకు ఆటంకం కల్గుతుంది. ఇక్కడ రాజుల కాలం నాటి కోట ఉంది. ఇది రాజోలి కోటగా ప్రసిద్ధి చెందినది.

జనాభా[మార్చు]

రాజోలికోట ముఖద్వారం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2848 ఇళ్లతో, 12489 జనాభాతో 3210 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6424, ఆడవారి సంఖ్య 6065. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2429 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 82. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576392[3].పిన్ కోడ్: 509126.

2001 జనాభా లెక్కల ప్రకారము ఈ గ్రామ జనాభా 11,617. ఇందులో మహిళల సంఖ్య 5883, పురుషుల సంఖ్య సంఖ్య 5734. ఈ గ్రామంలో ఉన్న గృహాలు 2087.ప్రస్తుతం 13000 ఉన్నట్లు అంచనా.

గ్రామ పంచాయతి[మార్చు]

రాజోలికోట లోపలి దేవాలయాలు

రాజోలి గ్రామ పాలన గ్రామ పంచాయతిచే నిర్వహించబడుతుంది. ఇది మేజర్ (ప్రకటిత) గ్రామ పంచాయతి. గద్వాల డివిజన్‌లోని 5 మేజర్ గ్రామ పంచాయతిలలో ఇది ఒకటి. ఈ గ్రామ పంచాయతి పరిధిలో రెండు శివారు గ్రామాలు ఉన్నాయి. అవి తూర్పు గార్లపాడు, తుమ్మలపల్లి. ఈ గ్రామ పంచాయతి పరిధిలో 16 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డు తరఫున ఒక వార్డు మెంబరు గ్రామ పంచాయతిలో సభ్యుడిగా కొనసాగుతాడు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

రాజోలి గ్రామంలో ఒక ఉన్నత పాఠశాల, ఒక ప్రాథమికోన్నత పాఠశాల, ఒక ప్రాథమిక పాఠశాల, ఒక ఉర్దు పాఠశాల ఉంది. ఉన్నత పాఠశాల విద్య పూర్తయిన విద్యార్థులు 8 కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రమైన వడ్డేపల్లి గ్రామంలోని జూనియర్ కళాశాలకు వెళ్ళవలసి వస్తుంది. రాజోలి గ్రామంలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకై వసతిగృహం (హాస్టల్) ఉంది.సమీప బాలబడి వడ్డేపల్లిలో ఉంది.సమీప జూనియర్ కళాశాల వడ్డేపల్లిలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు కర్నూలులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ కర్నూలులో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల వడ్డేపల్లిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు కర్నూలులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

రాజోలిలో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో14 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు నలుగురు, డిగ్రీ లేని డాక్టర్లు 10 మంది ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

రాజోలిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

రాజోలి గ్రామంలో ఆంధ్రా బ్యాంకు శాఖ ఉంది.2013 దీపావళి రోజు ఆంధ్రా బ్యాంకు ATM కూడా ప్రార౦భి౦చబడింది.

వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

రాజోలిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 437 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 324 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 84 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 9 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 159 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 243 హెక్టార్లు
  • బంజరు భూమి: 637 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1313 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1371 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 822 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

రాజోలిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.రాజోలి గ్రామం తుంగభద్ర నది ఒడ్డున ఉంది కాబట్టి నీటిపారుదల సౌకర్యమునకు ఇబ్బంది లేదు. ఇక్కడ పండే పంటలలో ప్రధానమైనవి వరి, మొక్కజొన్న, మిరప మొదలగునవి.

  • బావులు/బోరు బావులు: 451 హెక్టార్లు* ఇతర వనరుల ద్వారా: 371 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

రాజోలిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, జొన్న

దేవాలయాలు/ప్రార్థానాలయాలు[మార్చు]

గ్రామంలోని ప్రముఖ దేవాలయాలు:

  • వైకుంఠ నారాయణస్వామి దేవాలయం.
  • అడివేశ్వరస్వామి దేవాలయం.
  • జుమా మసిదులు ఉన్నాయి.
  • J.P.P.M ప్రార్థన మందిరము ఉంది.

వినోదం[మార్చు]

గ్రామంలో ఒక సినిమా థియేటర్ ఉంది.

కార్యాలయాలు[మార్చు]

  • గ్రామ పంచాయతి కార్యాలయం.
  • పోలీస్ స్టేషను.
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రము.
  • టెలిగ్రాఫ్ కార్యాలయం.

అక్టోబరు 2009 వరదలు[మార్చు]

అక్టోబరు 2, 2009న తుంగభద్ర నది ఉప్పొంగిరావడంతో పురాతన దేవస్థానాలతో సహా వందల ఇండ్లు నీటిలో పూర్తిగా మునిగిపోయాయి.[4].వేలాది ప్రజలు గుట్టపై చేరి నిరాశ్రయులుగా సహాయం కోసం వేచిచూశారు. గత వందేళ్ళలో ఇంత అధికస్థాయిలో గ్రామంలోకి నీరు రావడం ఇదే తొలిసారి. సహాయక చర్యలలో భాగంగా 2010 ఫిబ్రవరి 17న ఈనాడు సహాయనిధి తరఫున చేనేత కార్మికులకు మగ్గాలు అందజేశారు.[5]

గ్రామ సమస్యలు[మార్చు]

  • మండల కేంద్రమైన వడ్డేపల్లి నుంచి రాజోలి మధ్య కల రహదారి అధ్వానంగా తయారై రాకపోకలకు ఇబ్బందిగా ఉంది.
  • భారీవర్షాల సమయంలో గ్రామ సమీపంలో ఉన్న తుంగభద్రనదిపై కల సుంకేశుల డ్యాం గేట్ల ద్వారా నీరు వదలినప్పుడు వడ్డేపల్లికి వెళ్ళు రహదారిపై కల వాగుపై దాదాపు 5 అడుగులపైగా నీరు చేరి రాకపోకలు నిలిచిపోతాయి.
  • మండల కేంద్రం వడ్డేపల్లి నుంచి రవాణా సదుపాయాలు అరుదుగా ఉన్నాయి. తరచూ నిత్యావసరాలకు కర్నూలు వెళ్ళవలసి వస్తుంది.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 18-02-2010

వెలుపలి లింకులు[మార్చు]