వస

వికీపీడియా నుండి
వస
Sweet flag
Scientific classification
Kingdom: ప్లాంటే
(unranked): Angiosperms
(unranked): Monocots
Order: Acorales
Family: అకోరేసి
Genus: అకోరస్
Species: అ. కెలామస్
Binomial name
అకోరస్ కెలామస్
లి.

వస లేదా వజ (ఆంగ్లం : Sweet flag; సంస్కృతం : Haimavati, हैमवती, Vacha, वचा ) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం అకోరస్ కెలామస్ (Acorus calamus). ఇది అకోరేసి (Acoraceae) కుటుంబానికి చెందినది.

విషయ సూచిక

లక్షణాలు [మార్చు]

  • ఇది బహువార్షిక గుల్మం. ఇది 50-60 సెం.మీ. వరకు ఎత్తు పెరుగుతుంది.
  • ఆకులు సన్నగా పొడవుగా లేత / ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇవి 15-75 సెం.మీ. పొడవు మరియు 3.2-3.8 సెం.మీ వెడల్పుతో ఉంటాయి.
  • పుష్పాలు కాడ మీద ఏర్పడతాయి.
  • వేర్లు భూమిలోపల 30-60 సెం.మీ. వరకు వ్యాప్తిచెంది ఉంటాయి.

భాషా విశేషాలు [మార్చు]

తెలుగు భాషలో వస పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] వస [ vasa ] vasa. [from Skt. విషము.] n. Sweet flag: Acorus calamus. (E. P.) వస పాలు the root of this, macerated in milk as pap and given to an infant. చెక్కులు మీటిన వస గారు శిశువు a babe so young that if you touch his cheek it will exude pap. Serum; fat on the kidneys. A thin layer of fat found below the navel. కడుపులో బొడ్డు క్రింద నుండే ఉల్లిపొర వంటి కొవ్వు, వప. వసనాభి vasa-nābhi. n. Indian Aconite, Aconitum ferox.

ప్రాంతీయ నామములు [మార్చు]

  • ఇంగ్లీషు : స్వీట్ ఫ్లాగ్ (Sweet fag)
  • సంస్కృతం : వచ, ఉగ్రగంధ, షడ్గ్రంధ
  • హిందీ : గుడ్ బచ్
  • కన్నడం : బజేగిడా
  • మళయాళం : బవంబు
  • పార్శి : అగరేతుర్కీ

ఉపయోగాలు [మార్చు]

పూర్వం మనదేశంలో అన్ని పల్లెసీమలలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు. ఇప్పటికీ ఈ సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతునేయున్నది.[2] దీని వలన గొంతులోని కఫం పోవడమే గాక ఉత్తరోత్తరా మాటలు స్పస్టంగా రావడానికి ఉపకరిస్తుందని భావిస్తారు. శాస్త్రీయంగా కూడా దీనిని పిల్లలలో ఉపయోగించడం వలన కపమును హరించి మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. దీని ప్రభావం వలన నాలుక సంబంధమైన నాడులు చురుకుగా పనిచేస్తాయి. వస వేళ్ళను గొంతు వ్యాధులు, కడుపు నొప్పి, జ్వరం, మానసిక రుగ్మత, కాలేయం, రొమ్ము నొప్పుల నివారణలోను, మూత్రపిండ వ్యాధులలోను బొల్లి మచ్చల నివారణలో వాడతారు.

మూలాలు [మార్చు]

  1. బ్రౌన్ నిఘంటువు ప్రకారం వస పదప్రయోగాలు.
  2. వస, వాణిజ్య ప్రాముఖ్యత గల ఔషధ మరియు సుగంధమొక్కలు, డా. కొండపల్లి నరసింహారెడ్డి, స్వామి రామానంద తీర్థ ప్రచురణలు, హైదరాబాద్, 2002, పేజీలు: 22-27.
"http://te.wikipedia.org/w/index.php?title=వస&oldid=814511" నుండి వెలికితీశారు