శ్యామశాస్త్రి
వికీపీడియా నుండి
సంగీత త్రిమూర్తులలో మూడవవాడైన శ్యామశాస్త్రి (1762 - 1827) తిరువారూరు గ్రామస్థుడు. ఈయన అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము, ముద్దుగా శ్యామకృష్ణా యని పిలిచేవారు. అదే ఈయన కృతుల లో ఈయన ముద్ర అయినది. ఈయన బంగారు కామాక్షి ఉపాసకుడు. అమ్మపై తప్ప వేరొకరి పై రచనలు చేయలేదు. ఈయన కలగడ, మాంజి, చింతామణి మొదలగు అపూర్వ రాగములను కల్పించాడు. త్యాగరాజాదులచే కొనియాడబడిన ఈయన లయజ్ఞానము శ్లాఘనీయమైనది. ఆనంద భైరవి రాగమన్న ఈయనకు చాల యిష్టమని చెప్తారు. ఆంధ్ర గీర్వాణ భాషా కోవిదుడై ఈయన కృతులలో ముఖ్యమైనవి: ఓ జగదంబా, హిమాచలతనయ, మరి వేరే గతి యెవ్వరమ్మా, హిమాద్రిసుతే పాహిమాం, శంకరి శంకురు, సరోజదళనేత్రి, పాలించు కామాక్షి, కామాక్షీ (స్వరజతి), కనకశైలవిహారిణి, దేవీ బ్రోవ సమయమిదే, దురుసుగా, నన్ను బ్రోవు లలిత, మొదలగునవి. ప్రఖ్యాత వాగ్గేయకారుడైన సుబ్బరాయశాస్త్రి ఈయన కుమారుడే.