శ్రీపాద పినాకపాణి

వికీపీడియా నుండి
శ్రీపాద పినాకపాణి
Born ఆగష్టు 3 1913 (1913-08-03) (వయసు 99)
Origin Flag of భారత దేశం శ్రీకాకుళం, India
Genres కర్ణాటక సంగీతం
Occupations వైద్యం
Years active 1930 - present

రోగాలను , రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాక పాణి గారు 2012 ఆగస్ట్ 3న శత వసంతంలో అడుగిడినారు.. వైద్య, సంగీత రంగాలలో నిష్ణాతులైన పలువురు వీరి శిష్యులే.. గురువులకే గురువు డా. శ్రీ పాద.. శాస్త్రీయ సంగీతం తెలుగునాట అంతంత మాత్రంగా ఉన్న దినాలవి. నాటక పద్యాలలోనో, హరికథలలోనో తప్ప శాస్త్రీయ సంగీతం వినబడని ఆరోజులలో, సంగీత తమిళ నాట లాగే శాస్త్రీయ సంగీతం తెలుగునాట పరిమళించాలని ఆకాంక్షించారు.. ఆ దిశగా ఎందరో సంగీత శిఖామణులను తెలుగు వారికి అందచేసారు..

విషయ సూచిక

జననం, బాల్యం, విద్యాబ్యాసం[మార్చు]

శ్రీపాద వారు శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో 1913 ఆగస్ట్ 3వ తేదిన కామేశ్వరరావు, జోగమ్మ దంపతులకు జన్మించారు..రాజమండ్రికి చెందిన లక్ష్మణరావు గారి వద్ద తొలి సంగీత పాఠాలు నేర్చుకున్నారు.. ద్వారం వెంకటస్వామి వారి శిష్యరికం చేశారు.. వారు 1939వ సంవత్సరలో లో విశాఖపట్నం ఆంధ్ర వైద్యకళాశాల నుండి ఎం.బి.బి.ఎస్. పట్టా తీసుకున్నారు.1945వ సంవత్సరంలో జనరల్ మెడిసన్లో ఎం.డి. పూర్తి చేసారు.

రోగ నిర్మూలన[మార్చు]

ఎం.డి. పూర్తి చేసిన పిమ్మట డా. శ్రీ పాద రాజమండ్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా ప్రభుత్వ సేవలో చేరారు..1951 నుండి 1954 వరకు విశాఖ పట్నం లో వైద్యకళాశాలలో సివిల్ సర్జన్ గా పని చేసారు.. 1957లో కర్నూల్ వైద్యకళాశాల కు బదిలీ అయ్యారు. అక్కడే కళాశాల ప్రిన్సిపాల్ గా, సూపరింటెండ్ గా పని చేసి 1968 లో పదవీ విరమణ చేసారు..కర్నూలు లో స్ధిర నివాసం ఏర్పర్చుకున్నారు..

రాగ సాధన[మార్చు]

సంగీతం వింటూనే నొటోషన్స్ రాయగల నైపుణ్యం వీరి కుంది.. పదవీ విరమణానంతరం, త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తకరచనకు శ్రీ కారం చుట్టారు..సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురించిన నాలుగు సంపుటాలలో వీరు స్వర పరచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయ కారుల కృతులు 607, ముత్తు స్వామి దీక్షితుల కృతులు 173, పదములు 44, జావళీలు 40, తానవర్ణములు, 56, తిల్లనాలు, 10 మొత్తం 1088 సంగీత గుళికలు ఉన్నాయి..పాణినీయం, ప్రపత్తి, స్వరరామమ్, అభ్యాసమ్, నా సంగీత యాత్ర పుస్తకాలు రచించారు.

శిష్యప్రముఖులు[మార్చు]

డా.నోరి దత్తాత్రేయుడు వైద్యరంగంలో శ్రీ పాద వారి ప్రముశ శిష్యులలో ఒకరు కాగా, నూకల చిన సత్యనారాయణ, నేదునూరికృష్ణమూర్తి, శ్రీరంగం గోపాల రత్నం, మల్లాది సూరిబాబు, నేతి శ్రీరామశర్మ సంగీతం లో వారిశిష్యులు..

బిరుదులు, పురస్కారాలు[మార్చు]

భారత ప్రభుత్వ పద్మభూషణ్ బిరుదు తో సత్కరించింది. వారి ఇతర బిరుదులు సంగీతకళా శిఖామణి, సప్తగిరి సంగీత విద్వాన్ మణి, గానకళాసాగర, కళాప్రపూర్ణ (ఆంధ్రవిశ్వవిద్యాలయం). ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పురస్కారం, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు వారు అందుకొన్నారు.. వారి సంగీతాన్ని కేంద్రనాటక అకాడమీ రికార్డ్ చేసి ఆర్కైవ్స్ లో పొందు పరచింది.

జయంతి ఉత్సవాలు[మార్చు]

శత వసంతం లో అడుగిడిన శ్రీ పాద పినాక పాణి గారిని రాష్ట్ర ప్రభుత్వం ఘనం గా సత్కరించింది. శుక్రవారం కర్నూలు సునయన ఆడిటోరియంలో ఆయన శిష్యులతో సంగీత కార్యక్రమాన్ని రాష్ట్ర సాంస్కృతిక విభాగం, తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి, జిల్లా కలెక్టర్ వారి కి సువరణ కంకణం బహుకరించారు. తిరుమల తిరుపతి దేవస్ధానం రూ.10,01,116 లతోపాటు గాన విద్యావారధి బిరుదు ప్రదానం చేసారు.గణపతి దత్త పీఠం వారు సన్మాన పత్రాన్ని అంద చేసారు.. భీమిలి శివగంగ పరిషత్ చీఫ్ పాట్రన్ శివానంద మూర్తి గారు శ్రీ పాద వారిని శాలువతో సత్కరించారు.

బయటి లింకులు[మార్చు]