అక్టోబర్ 2005
Appearance
ప్రస్తుత ఘటనలు | 2005 ఘటనలు నెలవారీగా - |జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ | వికీపీడియా ఘటనలు |
అక్టోబర్ 31, సోమవారం
[మార్చు]- ప్రముఖ నేపథ్యగాయని పి.లీల మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. ఆమెకు 76 సంవత్సరాలు. కేరళలోని పాలక్కాడ్ ఆమె పుట్టినిల్లు కాగా చిత్తూరు మెట్టినిల్లు. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఆమె 15వేలకుపైగా పాటలు పాడారు. తెలుగులో లవకుశ, మాయాబజారు, పాండవవనవాసం, రాజమకుటం, గుండమ్మకథ, చిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.
- భారత్-శ్రీలంక జట్ల ల మధ్య జరుగుతున్న 7 వన్డే ల ఛాలెంజర్ సీరిస్లో భాగంగా జైపూర్లో జరిగిన 3 వ వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 3-0 గా ముందంజలో ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 298/4 పరుగుల భారీ స్కోరును భారత్ ముందుంచింది. 299 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని సాధించడానికి బరిలోకి దిగిన భారత్ జట్టు తొలి ఓవర్లోనేసచిన్ టెండుల్కర్ వికెట్ కోల్పోయినప్పటికి మహేంద్ర ధోని అధ్బుత బ్యాటింగ్ మెరుపులతో 46.1 ఓవర్లలో 4 వికెట్లకి 303 పరుగుల భారీ స్కోరును ఛేదించి అధ్బుత విజయాన్ని దీపావళి కానుకగా భారత్ క్రికెట్ అభిమానులకు అందించింది.మహేంద్ర ధోని 183 (10X6-15X4) పరుగులను 145 బంతులలో సాధించి నాట్ అవుట్ గా నిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
అక్టోబర్ 29, శనివారం
[మార్చు]- 2005: ఆంధ్ర ప్రదేశ్లో నల్గొండ జిల్లా వలిగొండ దగ్గరి గొల్నెపల్లి వద్ద తెల్లవారుఝామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇంజను, 8 పెట్టెలు పట్టాలు తప్పి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి పోయాయి. 111 మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నట్లు దక్షిణ మధ్య రైల్వే 30 వ తేదీన తెలిపింది. ప్రమాదంలో 93 మంది గాయపడ్డారు. 28 వ తేదీ రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా, గొల్నెపల్లి లోని రామసముద్రం చెరువు కట్ట తెగిపోయింది. ఈ చెరువు నుండి వచ్చిన వరద నీటి ఉధృతికి దగ్గర్లోని కల్వర్టు కొట్టుకొని పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వాగులో పడిన బోగీల్లో 4 రిజర్వేషను బోగీలు కాగా, నాలుగు జనరల్ బోగీలు. జనరల్ బోగీల్లో ప్రయాణీకులు క్రిక్కిరిసి ఉండే అవకాశం ఉన్నందున మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
- ఢిల్లీలో జరిగిన మూడు వరుస పేలుళ్ళలో 59 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. ఒక బస్సులో ఉంచిన పేలుడు పదార్ధాలను గుర్తించిన డ్రైవరు, కండక్టరు వాటిని బయటకు విసిరి వేయడంతో నాలుగో పేలుడు తప్పింది. ఇది తీవ్రవాదుల పనేనని భావిస్తున్నారు. పేలుళ్ళు జరిగిన ఒక రోజు వరకు ఏ తీవ్రవాద సంస్థా తామే దీనికి కారణమని ప్రకటించలేదు. ఎర్రకోటపై దాడి కేసులో ముందు నిర్ణయించిన దాని ప్రకారం ఈ రోజే కోర్టు తీర్పు వెలువడనుంది. ఈ సందర్భంలో ఈ పేలుళ్ళు జరగటం విశేషం. అయితే తీర్పును పేలుళ్ళు జరగక ముందే 31 వ తేదీకి వాయిదా వేసారు.[1]
అక్టోబర్ 13, గురువారం
[మార్చు]- భారత క్రికెట్ జట్టు సారథిగా రాహుల్ ద్రావిడ్ నియామకం
అక్టోబర్ 9, ఆదివారం
[మార్చు]- 2005 కాశ్మీరు భూకంపం: అక్టోబర్ 8 న ఉదయం 9:20:38 కి కాశ్మీరులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6 గా నమోదయింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో కేంద్రీకృతమైన భూకంపం పాకిస్తాన్, భారత్ లలో తీవ్ర నష్టం కలుగజేసింది.