Jump to content

డిసెంబర్ 2005

వికీపీడియా నుండి
ప్రస్తుత ఘటనలు | 2005 ఘటనలు నెలవారీగా - |జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ | వికీపీడియా ఘటనలు
డిసెంబర్ 2005
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

పతాక శీర్షికలు


డిసెంబర్‌ 24 2005, శనివారం

[మార్చు]
  • నక్సలైట్ల దాడి: విశాఖపట్నం జిల్లా సీలేరు పోలీసు స్టేషనుపై 100 మంది నక్సలైట్లు దాడిచేసి, స్టేషన్ను పేల్చేందుకు ప్రయత్నించగా పోలీసులు సమ్ర్థంగా తిపికొట్టారు. ఆపై నక్సలైట్లు ఎ.పి.జెన్‌కో అతిథిగృహాన్ని పేల్చివేసారు.
  • భానుమతి కన్నుమూత: ప్రముఖ సినిమానటి, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో అధినేత, రచయిత్రి, సంగీత దర్శకురాలు, గాయని, పద్మశ్రీ భానుమతీ రామకృష్ణ మరణించింది. ఆమె వయసు 81 సంవత్సరాలు.
  • ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ముందుచూపు లేదు: ఆంధ్రప్రదేశ్‌ రైతులు ముందుచూపుతో వ్యవహరించి, వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం, పాడి తదితర అదనపు వ్యాపకాలు ఏర్పాటు చేసుకొని ఉంటే ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తలెత్తేది కాదని భారత వ్యవసాయశాఖామంత్రి, శరద్‌ పవార్‌ అన్నాడు.

డిసెంబర్‌ 23 2005, శుక్రవారం

[మార్చు]
  • లంచాల ఎంపీల బహిష్కరణ: ప్రశ్నలడిగేందుకు లంచాలు తీసుకుంటూ కెమెరాకు దొరికిన 10 మంది లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడిని, సభల నుండి బహిష్కరించారు.

డిసెంబర్ 22 2005, గురువారం

[మార్చు]
అబ్బూరి ఛాయాదేవి
  • లంచాల ఎంపీల బహిష్కరణ నిర్ణయం: ప్రశ్నలడిగేందుకు లంచాలు తీసుకుంటూ కెమెరాకు దొరికిన 10 మంది ఎంపీలను లోక్‌సభనుండి బహిష్కరించాలని పవన్‌కుమార్ బన్సాల్ నేతృత్వం లోని సభాసంఘం సిఫారసు చేసింది.
  • ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలనే విషయంపై ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చింది.
  • అబ్బూరి ఛాయాదేవికి సాహిత్య అకాడమీ పురస్కారం: ప్రముఖ రచయిత్రి, అబ్బూరి ఛాయాదేవి రచించిన తనమార్గం అనే చిన్న కథల సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
  • నేరాలు తగ్గాయని జానారెడ్డి వెల్లడి: దోపిడీ, దొంగతనాలు, మోసాలు తప్ప అన్ని నేరాలు తగ్గాయని ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి జానారెడ్డి చెప్పారు.

డిసెంబర్ 21 2005, బుధవారం

[మార్చు]
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్
  • పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వివాదం: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచే ప్రతిపాదనపై అఖిలపక్షం సమావేశంలో ముఖ్యమంత్రి తెదేపా, తెరాస నిరసనలను పక్కనపెట్టి మెజారిటీ పార్టీల చేత సరేననిపించుకున్నారు. అఖిలపక్షంలో పోలవరంపై కూడా చర్చ జరగాల్సి ఉండగా, ప్రభుత్వం జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. పోతిరెడ్డిపాడుపై సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నుండి, 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ త్వరలో మరోసరికొత్త జీవో ఇవ్వనుంది. అనంతపురం జిల్లా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదన చేసింది.
  • రౌడీ స్వైరవిహారం: ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం, రుద్రాక్షపల్లి గ్రామంలో రౌడీయైన తన తమ్ముణ్ణి చంపేసారన్న కోపంతో రౌడి అన్న, తన అనుచరులతో కలిసి ఊరిలోని ఆరుగురిని చంపేసాడు. మరో ఆరుగురిని గాయపరచాడు.

డిసెంబర్ 20 2005, మంగళవారం

[మార్చు]
  • ఎంపీలాడ్స్ అవినీతి కుంభకోణం: ఎంపీలాడ్స్ అవినీతి కుంభకోణంపై లోక్‌సభ స్పీకరు, సొమనాథ్ చటర్జీ అవేదన వ్యక్తం చేసాడు. కళంకితులు ఐదుగురినీ సభకు రాకుండా సస్పెండు చేసి, విచారణకు అదేశించాడు.
  • రాజకీయాల ప్రక్షాళన దిశగా లోక్‌సత్తా ప్రయోగం: రాష్ట్రవ్యాప్తంగా 15,000 మంది యువకులను ఎంపిక చేసి, తగు శిక్షణనిచ్చి, వెచ్చే పంచయితీ ఎన్నికలలో పోటీ చేయించాలని లోక్‌సత్తా నిర్ణయించింది. వీరు తమకిష్టం వచ్చిన పార్టీ తరపున పోటీ చెయ్యవచ్చని లోక్‌సత్తా సమన్వయకర్త, జయప్రకాశ్ నారాయాణ తెలిపాడు.

డిసెంబర్ 19 2005, సోమవారం

[మార్చు]
  • ఎంపీలాడ్స్ అవినీతి కుంభకోణం: ఎంపీలాడ్స్ నిధుల విడుదల కోసం లంచాలడుగుతూ ఏడుగురు పార్లమెంటు సభ్యులు రహస్య కెమెరాకు చిక్కారు. స్టార్ న్యూస్ ఛానెల్, డిగ్ అనే సంస్థా కలిసి నిర్వహించిన ఈ ఆపరేషనులో భారతీయ జనతా పార్టీకు చెందిన ముగ్గురు, సమాజవాది పార్టీకి చెందిన ఇద్దరు, కాంగ్రెసు, బహుజన సమాజ్ పార్టీకి చెందిన ఒక్కొక్కరు దొరికారు.
  • సి.పి.ఎం. ప్రతివిమర్శ: తెలంగాణాపై తమపార్టీ వైఖరిని సీతారాం యేచూరి ప్రకటిస్తే, కె.సి.ఆర్ కు అంత కోపమెందుకు? ఆయనకు హామీ ఇచ్చి అమలుపరచని కాంగ్రెసుపై కోపం చూపించాలి అని సి.పి.ఎం. నాయకుడు రాఘవులు ప్రకటించాడు

డిసెంబర్ 18 2005, ఆదివారం

[మార్చు]
సీతారాం ఏచూరి తెలంగాణ ప్రజలను బ్లాక్‌మెయిల్ చేసేలా మాట్లాడటం విచారకరం. తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ప్రకటించడం ఏచూరి అవివేకమా? అహంభావమా? ఇలాంటి వ్యాఖ్యలను తెలంగాణ సీపీఎం కార్యకర్తలు చచ్చినపేనుల్లా వింటూ పడి ఉంటారా? మేం త్వరలో తెలంగాణలోని ప్రతి సీపీఎం కార్యకర్త ఇంటికి వెళ్లి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణను కించపరిచే నాయకుల జెండాలను ఎందుకు మోయాలని ప్రశ్నిస్తాం. ఎవరి ప్రయోజనాల కోసం ఏచూరి తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు? అందుకు శాస్త్రీయ ప్రాతిపదిక ఏదైనా ఉందా? అనవసరమైన ప్రకటనలు మానుకోండి. లేదంటే చంద్రబాబును ఎలా మాయం చేశామో మిమ్మల్నీ అలా మాయం చేయక తప్పదు.
మార్క్సిస్టులే కాదు ప్రపంచంలో ఏ శక్తీ తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేదు. ఈ దఫా తెలంగాణ ఏర్పడేవరకూ ఉద్యమిస్తాం. దీన్ని అడ్డుకోవాలనుకొనేవారు అగ్నిగుండంలో శలభాలైపోతారు.
  • కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పి.ఎం.సయీద్ ఆకస్మికంగా మృతిచెందాడు. ఆయన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో గుండెపోటుతో మరణించాడు. సయీద్ వయసు 65 సంవత్సరాలు. కాలేయ వాపు వ్యాధి చికిత్సకై సియోల్ వెళ్లాడు. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అక్కడే చనిపోయాడు.

డిసెంబర్ 17 2005, శనివారం

[మార్చు]
  • ప్రత్యేక తెలంగాణా అంశంపై సీతారాం ఏచూరి: "ప్రత్యేక తెలంగాణపై ఏకాభిప్రాయం వ్యక్తంకావాలని కనీస ఉమ్మడి కార్యక్రమంలో పేర్కొన్నారు. దానికి మా ఆమోదం లేదు. అందువల్ల బిల్లు ప్రవేశపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినా... ఓటింగ్ జరిగినా... ఏ దశలోనైనా సరే... దానిని మేం నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తాం" అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి స్పష్టం చేశాడు.

డిసెంబర్ 10 2005, శనివారం

[మార్చు]

డిసెంబర్ 8 2005, గురువారం

[మార్చు]
  • వ్యతిరేక వార్తలు రాస్తున్నాయనే కారణంతో ఆంధ్రజ్యోతి, మరో స్థానిక పత్రికపై సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో విశాఖ ఆర్డీవో ఆంక్షలు విధించాడు. సీనియర్ అధికారులకు వ్యతిరేకంగా వార్తలు రాసే ముందు స్క్రీనింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని, అది పరిశీలించాకే వార్తలు ప్రచురించాలని హుకుం జారీ చేసాడు. దీనితో పాత్రికేయులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. నిరసనలకు స్పందించి, ఈ ఆంక్షలను వెంటనే ఉపసంహరించారు. అధికారుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై ప్రభుత్వానికి స్పష్టమైన వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

డిసెంబర్ 6 2005, మంగళవారం

[మార్చు]
  • జీవో 120 ప్రకారం కొల్లేరు లోని 77వేల ఎకరాల్లో అభయారణ్యం ఏర్పాటు చేసి తీరాలని ప్రభుత్వం తీర్మానించింది. అభయారణ్యం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్దిష్టంగా ఆదేశాలు జారీ చేశారు. జీవో 120 ప్రకారం... ఐదో కాంటూరు లోపల 77,138 ఎకరాల్లో అభయారణ్యం ఏర్పాటు చేయాలి. ఇందులో 36,634 ఎకరాలు ప్రభుత్వ భూమి. దాదాపు ఇదంతా ఆక్రమణదారుల చేతుల్లో ఉంది.
  • ఇరాక్‌కు చమురుకు ఆహార కుంభకోణానికి సంబంధించి వోకర్ ఆరోపణలపై కేంద్రమంత్రి నట్వర్‌సింగ్ తన పదవికి రాజీనామా చేసాడు.

డిసెంబర్ 5 2005, సోమవారం

[మార్చు]
  • ఉమా భారతిని భారతీయ జనతా పార్టీ నుండి బహిష్కరించారు.

డిసెంబర్ 4 2005, ఆదివారం

[మార్చు]
  • ఉమాభారతి వివరణ:భారతీయ జనతా పార్టీ నేత ఉమాభారతి పార్టీ నాయకత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనకిచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానమిస్తూ, పార్టీ గద్దెనెక్కాక రాముణ్ణి మరచిందనీ, అద్వానీ జిన్నాను ప్రశంశించడం కన్నా రాముడి పాదాలవద్ద పడి మరణించడం మంచిదనీ విమర్శలు చేసింది.
  • పోలవరం ప్రాజెక్టును ఆపండి: ప్రజా ఉద్యమాల జాతీయ కన్వీనర్, మేథా పాట్కర్, పోలవరం వ్యతిరేక ఉద్యమం సంఘీభావ కమిటీ సభ్యులు భారీ నీటిపారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కలిసి, పోలవరం పనులను అనుమతులుఇ వచ్చేవరకు ఆపాలని కోరారు.

డిసెంబర్ 3 2005, శనివారం

[మార్చు]
  • ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై కె.సి.ఆర్ ధ్వజం: ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తెలంగాణా ఉద్యమానికి వక్రభాష్యం చెబుతున్నాయనీ, ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని [[తెరాస]] నేత, కె.సి.ఆర్ ఆరోపించాడు. తనకు కాలు పూర్తిగా నయమయి, నడవగలిగే స్థితి వచ్చాక, తెరాస పయనమెటో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో, జరగబోయే ప్రళయమెలా ఉంటుందో చూపిస్తానని అన్నాడు. మీడియా మీద నాకు గౌరవం ఉంది, ఇటువంటి వ్యతిరేక కథనాలు విరమించండి, నేను ప్రార్థిస్తున్నాను అని అన్నాడు.
  • శాసనసభ స్వర్ణోత్సవాలు:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఏర్పడి 50 ఏళ్ళయిన సందర్భంగా స్వర్ణోత్సవ సమావేశం మొదలైంది. శాసనసభ పాత సభ్యులను సభకు పిలిచి సన్మానించారు. లోక్‌సభ స్పీకరు సోమ నాథ్ ఛటర్జీ ప్రత్యేక అతిథిగా వచ్చాడు. తెరాస ఈ సమావేశాన్ని బహిష్కరించింది.

డిసెంబర్ 2 2005, శుక్రవారం

[మార్చు]
  • బాపురావుపై పరువునష్టం దావా:[[తెరాస]]కు చెందిన శాసన సభ్యులు, మందాడి సత్యనారాయణరెడ్డి, సహచర శాసన సభ్యులు, సోయం బాపురావుపై పరువునష్టం దావా వెసాడు. తనకు తాను కోవర్టుగ అభివర్ణించుకున్న బాపురావు, మందాడి అసమ్మతిని లేవనెత్తడానికి డబ్బులు తీసుకున్నాడని అర్రోపించాడు. దీనికి ప్రతిగా, మందాడి ఈ కేసు వేసాడు.

డిసెంబర్ 1 2005, గురువారం

[మార్చు]
  • పోతిరెడ్డిపాడు వివాదం..పి.జె.ఆర్ వ్యాఖ్యలు:ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యాలయమైన గాంధీభవన్లో, పోతిరెడ్డిపాడు వివాదంపై జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో వాగ్యుద్ధం జరిగినట్లు పత్రికలు రాసాయి. పోతిరెడ్డిపాడుకు సంబంధించిన జి.ఓ.ను వ్యతిరేకిస్తూ దానిని మార్చాలని కోరుతున్న ఖైరతాబాదు శాసనసభ్యుడు, పి.జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిపై అన్యాపదేశంగా వ్యాఖ్యలు చేసారని ఈ వార్తల్లో వచ్చింది. పోతిరెడ్డిపాడుపై అనవసరంగా వివాదం చేస్తున్నారని సమావేశంలో అనగా, ఆయన తీవ్రంగా స్పందిస్తూ, "బహిరంగసభలో ముఖ్యమంత్రిపై చెప్పులేయించడం కంటే ఎక్కువా..? నేను ప్రజాసమస్యలపైనే మాట్లాడుతున్నాను" అంటూ వ్యాఖ్యానించాడని పత్రికల్లో వార్తలు వచ్చాయి.
  • తెరాస అసమ్మతి-కె.సి.ఆర్ ప్రకటనకు సానుకూలత:[[తెరాస]] నేత కె.సి.ఆర్ ప్రకటనను స్వాగతించారు. తాము పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి వస్తామని తెలియజేసారు.