Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

అజయ్ భూపతి

వికీపీడియా నుండి
అజయ్ భూపతి
జననం (1985-08-14) 1985 ఆగస్టు 14 (వయసు 39)
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే-మాటల రచయిత
క్రియాశీల సంవత్సరాలు2011 - ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • వేగేశ్న రామరాజు (తండ్రి)

అజయ్ భూపతి (జ. ఆగస్టు 14, 1985), తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే-మాటల రచయిత. ఇతడు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆర్‌ఎక్స్‌ 100కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.[1] 2019లో ఉత్తమ తొలి తెలుగు దర్శకుడిగా సైమా అవార్డును అందుకున్నాడు.[2]

తొలి జీవితం

[మార్చు]

అజయ్ భూపతి 1985, ఆగస్టు 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా లోని ఆత్రేయపురం గ్రామంలో జన్మించాడు. ఇతడి తండ్రి రామరాజు వేగేశ్న వ్యవసాయదారుడు. చదువు పూర్తైన తరువాత, సినిమారంగంలో ప్రవేశించడానికి హైదరాబాదు వెళ్ళాడు.

సినిమారంగం

[మార్చు]

సినీ దర్శకులు రమేశ్‌ వర్మ, వీరు పోట్ల దగ్గర సహాయ దర్శకుడిగా అజయ్ భూపతి, తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. రామ్ గోపాల్ వర్మతో కలిసి వంగవీటి సినిమాకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, కిల్లింగ్ వీరప్పన్ సినిమాకు చీఫ్ కో డైరెక్టర్ గా, ఎటాక్, వీర, దూసుకెళ్తా వంటి సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాడు. 2018లో ఆర్‌ఎక్స్‌ 100 సినిమాకి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇది హిందీలో కూడా రిమేక్ చేయబడింది.[3] శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ ముఖ్యపాత్రలలో మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కించాడు.[4]ఆయన దర్శకత్వం వహించిన ఆర్‌ఎక్స్‌ 100 సినిమాను హిందీలో తడప్ పేరుతో రీమేక్ చేశారు.

సినిమాలు

[మార్చు]

దర్శకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా ఇతర వివరాలు
2018 ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడిగా తొలి చిత్రం[5]
2021 మహాసముద్రం [6] చిత్రీకరణ; తెలుగు-తమిళ చిత్రం
2023 మంగళవారం [7]

మూలాలు

[మార్చు]
  1. World, Republic. "'RX100': Director Ajay Bhupathi set to make a sequel to the movie?". Republic World.
  2. "Siima Awards: 2019 Winners". Archived from the original on 2021-04-22. Retrieved 24 April 2021.
  3. "RX100 Hindi remake: Ahan Shetty and Tara Sutaria's Tadap goes on floors". India Today. 6 August 2019. Retrieved 24 April 2021.
  4. World, Republic. "Aditi Rao Hydari finalised for Sharwanand's 'Maha Samudram' to be helmed by Ajay Bhupathi". Republic World. Retrieved 24 April 2021.
  5. "RX 100 movie review: This love story has very few surprises". July 13, 2018. Retrieved 24 April 2021.
  6. Eenadu (23 June 2021). "ద్వితీయ యజ్ఞం.. దాటేరా విఘ్నం? - tollywood directors second projects". www.eenadu.net. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
  7. "మంగళవారం సోయగం |". web.archive.org. 2023-09-26. Archived from the original on 2023-09-26. Retrieved 2023-09-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]