Jump to content

అప్పాజీ అంబరీష దర్భా

వికీపీడియా నుండి
(అప్పాజీ అంబరీష్ దర్భా నుండి దారిమార్పు చెందింది)
అప్పాజీ అంబరీష దర్భా
అప్పాజీ అంబరీష దర్భా
జననం
అప్పాజీ అంబరీష దర్భా

(1965-03-01) 1965 మార్చి 1 (వయసు 59)
విద్యాసంస్థఆంధ్ర విశ్వవిద్యాలయం
వృత్తినటుడు,
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం
జీవిత భాగస్వామిడాక్టర్ సుధారాణి మిరియాల
పిల్లలుడి.ఎస్.వి.రాంషా
తల్లిదండ్రులురాంషా, శిరీష
బంధువులుకోడలు కృష్ణ మంజూష

అప్పాజీ అంబరీష దర్భా సృజనాత్మక డిజిటల్ మీడియా నిపుణుడు, సినిమా నటుడు. తెలుగు యూనికోడ్ ఫాంట్స్ రూపకర్త.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

అప్పాజీ 1965, మార్చి 1న రాంషా, శిరీష దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట లో జన్మించాడు.[1] సామర్లకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ (1980-1982), కాకినాడలోని పిఆర్ డిగ్రీ కళాశాలలో బిఏ (1982-1985) చదివాడు.

వృత్తి జీవితం

[మార్చు]

అప్పాజీ అంబరీష తనకున్న అభిరుచితో ప్రకటనలు, డిజిటల్ మాధ్యమరంగంలోకి ప్రవేశించి, వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలపై పనిచేశాడు. 2004 నుండి 2014 వరకు వివిధ అడ్వర్టైజ్మెంట్ కంపనీలలో క్రియేటివ్ డైరెక్టర్ గా, బ్రాండ్ స్ట్రాటజీ మేనేజర్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించాడు.

డిజిటల్ తెలుగు అభివృద్ధికి కృషి

[మార్చు]

కంప్యూటర్ ప్రవేశించిన తొలినాళ్ళలోనే తెలుగు ఫాంట్స్ అభివృద్ధి చేయాలనుకున్న అంబరీష ఈజీఫాంట్స్ పేరుతో కొన్ని ఫాంట్స్ అభివృద్ధి చేశాడు. సాఫ్ట్‌వేర్‌తో అనుకూలమైన వివిధ డిజైన్లను,గూగుల్ కోసం ప్రత్యేకంగా తెలుగు, కన్నడ భాషలో యూనికోడ్ ఫాంట్‌లను తయారుచేశాడు. అనేక ప్రచురణకర్తలకు, సంస్థలకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు యూనికోడ్ ఫాంట్లను రూపొందించాడు. 2011, ఆగస్టు 15న విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో రమణీయ ఫాంట్స్ పేరుతో ఒక ఫాంట్ విడుదల చేశాడు. రమణీయ, పొన్నాల, రవిప్రకాశ్‌, లకిరెడ్డి, చతుర, పెద్దన, తిమ్మన, రామరాజ, తెనాలిరామకృష్ణ, తానా మొదలైన ఫాంట్లు రూపొందించాడు.[2]

నటనారంగం

[మార్చు]

2011లో ప్రియా ఫుడ్స్-స్నాక్ మ్యాజిక్ వాణిజ్య ప్రకటనలో తొలిసారిగా కథానాయకుడి తండ్రిగా నటించాడు. ఆ తరువాత అప్పారావు గారి అబ్బాయి అనే షార్ట్ ఫిల్మ్ లో అప్పారావు పాత్రతో షార్ట్ ఫిలింరంగంలోకి, తథాగత గౌతమ బుద్ధ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించాడు.

సినిమాలు

[మార్చు]

అప్పాజీ అంబరీష నటించిన సినిమాలు[3]

షార్ట్ ఫిల్మ్స్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. imdb. "Darbha Appaji Ambarisha". IMDb. Retrieved 17 July 2020.
  2. రమణీయ తెలుగు ఫాంట్లు, ఈనాడు ఆదివారం అనుబంధం, ఆచంట సుదర్శనరావు, 12 ఆగస్టు 2012, పుట. 27.
  3. డైలీహంట్, ఇండస్ట్రీ హిట్ (26 February 2020). "బ్లాక్ బస్టర్ 'భీష్మ'లో ఒక చిన్న భాగం కావడం గర్వంగా ఉంది!! -అప్పాజీ అంబరీష". www.dailyhuntin. Retrieved 21 July 2020.
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (26 February 2020). "'భీష్మ'లో చిన్న భాగమైనందుకు గర్వంగా ఉంది: అప్పాజీ అంబరీష". Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.
  5. నమస్తే తెలంగాణ, సినిమా (16 July 2020). "ఇది ఫుల్లీ రొమాంటిక్ 'డర్టీ హరి'". ntnews. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.

బయటి లంకెలు

[మార్చు]