Jump to content

అలంకారం

వికీపీడియా నుండి
(అలంకారాలు నుండి దారిమార్పు చెందింది)

Suryachamdrulu divaratrulu adipathulu alamkaram gurthimchamdi

Kastala kulimilu kakimandi na Gunda

[మార్చు]

శబ్ద ప్రాధాన్యం గలవి శబ్దాలంకారాలు.

ఉదాహరణ: చొక్క పుటుక్కు క్రిక్కిరిసి స్రుక్కక పెక్కువ నక్క జంబుగన్. మరొక్క ఉదాహరణ పద్యంలో గడన గల మగని జూసిన,అడుగడుగున మడుగులిడుదురు అతివలు తమలో, గడనుడిగిన మగని జూసిన నడుపీనుగ వచ్చె ననుచు నగుదురు సుమతీ. ఈ పద్యంలో అనే అక్షరం పలుమార్లు వచ్చి శబ్దాలంకారాన్ని చేకూర్చింది. అలాగే వచనములో కూడా శబ్ధాలంకరానికి మరొక ఉదాహరణ: (అల్లసాని పెద్దనగారి మనుచరిత్రము లో) అనినన్ జిటిలుండు పటపటమని బండ్లు గొరికి, యటమటంమ్మున విద్య గొనుటయుంగాక గుట గుటలు గురుతోనా యని ..... ఇందులో ట అను అక్షరము పలుమార్లు వచ్చింది.

  • ఛేకానుప్రాసాలంకారం: అర్థ భేదము గల రెండేసి అక్షరములు వ్యవధానము లేకుండా వెనువెంటనే వచ్చుట.
  • ఉదాహరణ: భీకర కర వికరముల్.
  • హారతి హారతి కి ఇచ్చిరి.
  • నందన నందన నీకు వంద వందనాలు
  • సుందర దరహాస రుచులు.
  • లాటానుప్రాసాలంకారం: అర్థభేధం లేక తాత్పర్య భేదం కలుగునట్లు ఒక పదము రెండు సార్లు ప్రయోగింపబడిన అది లాటానుప్రాసము.
  • ఉదాహరణ: శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ.
  • మానవత్వము గలుగు మనిషి మనిషి .
  • తల్లిదండ్రులను సేవించు సుతులు సుతులు .
  • విద్య నభ్యసించు విద్యార్థులు విద్యార్థులు .
  • ప్రభా ధనులు నా కనులలో కనుము కనుము .
  • యమకాలంకారం: అర్థభేదముగల అక్షరాల సమూహమును మరల మరల ప్రయోగింపబడినచో దానిని యమకము అంటారు.
  • ఉదాహరణ: పురమునందు నందిపురమునందు.
  • ఓ హారికా జోహారికా
  • మనసు భద్రమయ్యే మన సుభద్రకు .
  • లేమా దనుజుల గెలవగ లేమా.
  • ముక్తపదగ్రస్తాలంకారం: విడిచిన పద భాగము అవ్యవధానముగా మరల గ్రహించుచు వ్రాయబడిన అది ముక్తపదగ్రస్తము.
  • ఉదాహరణ: ఓ రాజా! శత్రువులను జయించుము, జయించి రాజ్యమును పొందువు. పొంది ప్రజలను పాలింపుము. పాలించి సుఖమును పొందుము.
  • మార సుందర, సుందర ధీర మూర్తి, మూర్తి గత లో ప పూజితాంగ, అంగ
  • విద్య వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల ధనం, ధనం వల్ల దానం, దానం వల్ల సుఖం లభిస్తాయి.
  • అంత్యప్రాసాలంకారం: మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్య ప్రాసం అవుతుంది. ఉదాహరణలు:

1. తోటలో నారాజు తొంగి చూసెను నాడు; నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు.

2. భాగవతమున భక్తి జీవితమున రక్తి.

3. భాగవతమున భక్తి, భారతంలో యుక్తి, రామ కథ యే రక్తి

2. అర్థాలంకారాలు

[మార్చు]

అర్థ విశేషములను బట్టి వచ్చునవి అర్థాలంకారములు. లాగా తెల్లగా ఉంది). (ఓ కృష్ణ నీ కీర్తిి హంసవలె ఆకాశగంగ యందు మునుగు చున్నది). (దూడ పాలు తాగుతున్న సేపు తల్లి ఆవు పైన ఈగ సోకినను పాషాణ దేనువు వలె కదలక నిలిచి ఉన్నది). ( స్వాతి ముఖం చంద్రబింబము వలె అందముగా వుంది) . ఉపమాలంకారము లో నాలుగు అంశాలు ఉంటాయి. అవి 1. ఉపమానము: పోలికగా చెప్ప బడినది. 2. ఉపమేయం: పోల్చబడింది. 3. సమాన ధర్మం: ఉపమేయ ఉపమానాలకున్ను సమాన ధర్మాన్ని తెలిపేది . 4. ఉపమా వాచకం: ఉపమేయ సమాన ధర్మాలను కలిపి చెప్పడానికి ఉపయోగించే అక్షరాలు, పదాలు.

  1. అన్వయాలంకారం: ఉపమానము, ఉపమేయము ఒకటే వస్తువగుచో అది అన్వయాలంకారం. ఉదాహరణ: (రచిత్ రచిత్ వలె అతిలోక సుందరుడు). (రామ రావణ యుద్ధము రామ రావణ యుద్ధము వలె ఉన్నది). (చంద్రుడు చంద్రుని వలె కాంతిలో గొప్పవాడు).
  2. ఉపమేయోపమ అలంకారం: రెండు వస్తువులకు పర్యాయ క్రమమున ఉపమేయ ఉపమానత్వమును కల్పించి చెప్పడం ఉపమేయోపమ అలంకారం. ఉదాహరణ: (రాజా నీయందు ధర్మము అర్ధము వలెను, అర్థముు ధర్మము వలెను శ్రీమంతులు). (ఆ నరసింహినుకిిిిి ఈ నరసింహ రాయలుు సాటి, ఈ నరసింహ రాయలకు నరసింహుడు సాటి).
  3. ప్రతీపాలంకారం: ఉపమానముగా ప్రసిద్ధమయిన దానిని, ఉపమేయంగా కల్పించి చెప్పడం ప్రతీపాలంకారం. అంటే ఉపమానం కావలసింది ఉపమేయంగా మారినందువల్ల రెండింటినీ ఉపమేయాలుగానే భావించవలసి వస్తుంది. ఉదాహరణ: (పద్మముు నీ లోచనము తో సమానం.) (సూర్యుడు నీ ముఖము తో సమానుడు).
  4. రూపకాలంకారం: ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని అరోపించడం రూపకాలంకారం. ఉపమేయమునకు ఉపమానం తోటి అభేదాన్ని గాని, తాద్రూప్యాన్ని గాని వర్ణించటం రూపకం. ఒకటి అభేద రూపకం, రెండవది తాద్రూప్య రూపకం.ఉదాహరణలు: (ఓ రాజా నీ యశశ్చంద్రిక లు దిగంతాలకు వ్యాపించి ఉన్నాయి)( మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు) (ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.) (ప్రజస్వత్ తేనె పలుకులు అందరికీ ఇష్టమే)
  5. పరిణామాలంకారం: ఉపమానం ఉపమేయముతో తాదాత్మ్యమును పొంది క్రియను నిర్వహించిన అది పరిణామాలంకారం.
  6. ఉల్లేఖాలంకారం: ఒక్క వస్తువే ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా కనిపించడం ఉల్లేఖాలంకారం. ఉదాహరణలు:(ఆ రాజు ప్రజల చేత దేవుని గాను, యాచకుల చేత కల్ప వృక్షము గాను, విరోధుల చేత రౌద్రుని గాను చూడ బడుతాడు.) (శరత్ వక్తృత్వ మునందు బృహస్పతి, కీర్తి యందు అర్జునుడు, విలువిద్య యందు భీష్ముడునాడు)
  7. స్మృతి
  8. భ్రాంతిమద అలంకారం: ఒక దానిని చూచి మరొకటిగా భ్రమించినచో అది భ్రాంతిమద అలంకారం. ఉదాహరణ:(ఆ మేక ఈ రైతు ని కసాయివాడని అనుకొని,భయం తో అక్కడి నుండి పారిపోయింది. )
  9. సందేహాలంకారం: సందేహం (అనిశ్చయ జ్ఞానం) వలన ఏర్పడే అలంకారం సందేహాలంకారం. ఉదాహరణ:(ఈమె ముఖము పద్మమో చంద్రుడో నిిశ్చయములేదు.)
  10. అపహ్నుతి
  11. ఉత్ప్రేక్షాలంకారం: ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండటం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం. ఉదాహరణలు: ( ఆ యేనుగు నడిచే కొండా అనిపించుచున్నది). (చీకటిలో నీడను చూసి దెయ్యం ఏమో అనుకున్నాను). (దూరముగా ఉన్న తాడుని చూసి పాము ఏమో అని భయపడ్డాను.)
  12. అతిశయోక్త్యలంకారం: చెప్పవలసిన దానిని ఎక్కువ చేసి చెప్పడం, గొప్పగా చెప్పడం అతిశయోక్తి అలంకారం.
  13. తుల్యయోగిత
  14. దీపకాలంకారం: ప్రకృతాప్రకృతములకు ధర్మైక్యం చేసి చెప్పడం దీపకాలంకారం.
  15. ఆవృత్తిదీపకము
  16. ప్రతివస్తూపమాలంకారం: రెండు వాక్యముల కొక సామాన్య ధర్మముతో అన్వయం ఉంటే అది ప్రతి వస్తూపమాలంకారం. అంటే ప్రతి వాక్యార్ధంలోనూ ఒకే సమాన ధర్మాలను భిన్న పదాలచేత తెలియజేయడం.
  17. దృష్టాంతాలంకారం: రెండు వాక్యాల యొక్క వేరువేరు ధర్మాలు బింబ ప్రతిబింబ భావంతో చెబితూ ఉంటే అది దృష్టాంతాలంకారం. ఉదాహరణలు:( ఓ రాజా నీవేే కీర్తిమంతుడు చంద్రుడే కాంతి వంతుడు)( సత్య పురుషుడు తననెవరూ కోరక పోయిన మేలుు చేస్తూ లోకానికి ఆనందం కలిగిస్తాడు. కలువలను వికసింప చేయమని చంద్రుని ఎవరు ప్రార్థిస్తారు)
  18. నిదర్శన
  19. వ్యతిరేకాలంకారం: ఉపమేయ ఉపమానములకు పోలికతో పాటు భేదమును కూడా చెప్పినచో అది వ్యతిరేకాలంకారం.
  20. సహోక్తి
  21. వినోక్తి
  22. సమాసోక్తి
  23. పరికరాలంకారం: సాభిప్రాయ విశేషణాలతో కూడినచో అది పరికరాలంకారం.
  24. పరికరాంకురం
  25. శ్లేషాలంకారము: అనేకార్థాల నాశ్రయించుకొని యుండిన ఎడల అది శ్లేషాలంకారం. ఉదాహరణ: మానవ జీవితం సుకుమారం. 1) మా నవ జీవితం సుకుమారమైనది మనవ జీవితం సుకుమారమైనది 2) మీ  సంగతి ఏమిటి? మీసం గతి ఏమిటి? 3) గురూజీ వనం బాగుందా? గురూ జీవనం బాగుందా? 4) మాట  మాట పెరిగింది.    మా  టమాట పెరిగింది. 5) ఆహారం చూడు ఎంత బాగుందో! ఆ హారం చూడు ఎంత బాగుందో! 6) మాతా తమరు నిమిషంలో చేరారు.     మా తాత మరునిమిషంలో చేరారు. 7) నావ లతలపై పడింది.   నా వల తలపై పడింది. 8) ఆమె కవితలతో జీవనం చేయును.   ఆమె కవి తలతో జీవనం చేయును. 9)మాతా  మరను పట్టుకో.   మా తామరను పట్టుకో.
  26. అప్రస్తుత ప్రశంసాలంకారం: ప్రస్తుతమును ఆశ్రయించుకొని, అప్రస్తుతమును తలచుకొన్నచో అది అప్రస్తుత ప్రశంసాలంకారం.
  27. ప్రస్తుతాంకురం
  28. పర్యాయోక్తము
  29. వ్యాజస్తుతి అలంకారం: పైకి నిందిస్తున్నట్లుగా కనిపించినా తరచిచూస్తే స్తుతి చేస్తున్న విధం కనిపిస్తుంది. పైకి స్తుతిస్తున్నా తరచిచుస్తే నిందిస్తున్నట్లు కనిపిస్తుంటే వ్యాజస్తుతి అలంకారం.ఉదాహరణలు:(ఓ గంగా పాపాత్ములను కూడా స్వర్గమునకు చేర్చు నీకు వివేకము లేదు) ( ఓ ధూ తిక, బాగు బాగు! నా కోసం నీవు దంతాల చేత, గోర్ల చేత గాయాలు పొందావు. ఇంతకంటే ఏమి చేయగలవు.) దూది కాక
  30. వ్యాజనిందాలంకారం: నింద చేత మరియొక నింద స్ఫురించటం వ్యాజనిందాలంకారం.
  31. ఆక్షేపము
  32. విరోధాభాసాలంకారం: విరోధమునకు అభాసత్వము కలుగుచుండగా విరోధాభాసం అవుతుంది. పైకి కనిపించే విరోధం విరోధంగా కాకుండా విరోధం ఉన్నట్లుగా అనిపించి, ఆలోచిస్తే ఆ విరోధం అభాసం (పోతుంది) అవుతుంది. కనుక ఇది విరోధాభాసాలంకారం.
  33. విభావన
  34. విశేషోక్తి అలంకారం: సమృద్ధంగా కారణం ఉండి కూడా కార్యోత్పత్తి జరగక పోవడం విశేషోక్తి అలంకారం.
  35. అసంభవము
  36. అసంగతి
  37. విషమాలంకారం: అనను రూపాలయిన (సమాలు కాని) రెండింటికి సంబంధం వర్ణింపబడిన ఎడల అది విషమాలంకారం.
  38. సమం
  39. చిత్రం
  40. అధికము
  41. అల్పము
  42. అన్యోన్యము
  43. విశేషము
  44. వ్యాఘాతం
  45. కారణమాల
  46. ఏకావలి
  47. మాలాదీపకము
  48. సారాలంకారం: పూర్వపూర్వముల కంటే ఉత్తరోత్తరాలకు ఉత్కర్ష కలిగించడం సారాలంకారం. ముందున్న వాటి కంటే తర్వాత వచ్చేవాటికి గొప్పతనాన్ని కలిగించడం ఉత్తరోత్తర ఉత్కర్ష అంటారు.
  49. యథాసంఖ్య అలంకారం: ఒక దాని తరువాత ఒకటిగా వరుసగా సమాన సంఖ్యాకాలయ్యే వాటి యొక్క సముదాయం యథాసంఖ్య లేదా క్రమ అలంకారం.
  50. పర్యాయము
  51. పరివృత్తి
  52. పరిసంఖ్య
  53. వికల్పము
  54. సముచ్చయము
  55. కారకదీపకము
  56. సమాధి
  57. ప్రత్యనీకము
  58. కావ్యార్థాపత్తి
  59. కావ్యలింగాలంకారం: సమర్థనీయమయిన అర్థానికి సమర్థనం కావ్యలింగాలంకారం.
  60. అర్థాంతరన్యాసాలంకారం: సామాన్యం చేత విశేషం గాని, విశేషం చేత సామాన్యం గాని సమర్థింప బడితే అది అర్థాంతరన్యాసాలంకారం. ఉదాహరణలు: (శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు వీరులకు సాధ్యము కానిది లేదు కదా!) ( ప్రవరుడు హిమాలయాలలో తిరుగుతూ తన పాద లేపనము కరిగిపోవడం తెలియలేదు దైవ కృతము నకు అసాధ్యం లేదు కదా.)
  61. వికస్వరము
  62. ప్రౌడోక్తి
  63. సంభావన
  64. మిథ్యాధ్యవసితి
  65. లలితము
  66. ప్రహర్షణము
  67. విషాదము
  68. ఉల్లాసము
  69. అవజ్ఞ
  70. అనుజ్ఞ
  71. లేశము
  72. ముద్ర
  73. రత్నావళి
  74. తద్గుణాలంకారం : స్వీయ గుణాన్ని వదిలేసి మరొక దాని గుణాన్ని స్వీకరించటం వర్ణించినట్లయితే అది తద్గుణాలంకారం.
  75. పూర్వరూపము
  76. అతద్గుణము
  77. అనుగుణము
  78. మీలితము
  79. సామాన్యము
  80. ఉన్మీలితము
  81. విశేషము
  82. ఉత్తరము
  83. సూక్ష్మము
  84. పిహితము
  85. వ్యాజోక్తి
  86. గూడోక్తి
  87. వివృతోక్తి
  88. యుక్తి
  89. లోకోక్తి అలంకారం: సందర్భాన్ని అనుసరించి ఒక సామెత లేదా నానుడి చెప్పడం లోకోక్తి అలంకారం.
  90. ఛేకోక్తి అలంకారం: లోకోక్తితో పాటు అర్థాంతర స్ఫురణం కూడా ఉండటం ఛేకోక్తి అలంకారం.
  91. వక్రోక్తి అలంకారం: శ్లేష వలన గాని, కాకువు వలన గాని అన్యార్ధం కల్పించబడిన అది వక్రోక్తి అలంకారం.
  92. స్వభావోక్తి అలంకారం: జాతి, గుణ, క్రియాదుల చేత దాని స్వభావాన్ని వర్ణించిన ఎడల అది స్వభావోక్తి అలంకారం. ఉదాహరణలు:( శివాజీ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడె పై పెదవితో, కదలాడే కనుబొమ్మ ముడితో, గొప్ప హుంకార ముతో, గర్జిస్తూ ఉన్నాడు.)
  93. భావికము
  94. ఉదాత్తాలంకారం: సమృద్ధిని గాని, అన్యోపలక్షిత మయిన శ్లాఘ్య చరిత్రను గాని వర్ణించిన ఎడల అది ఉదాత్తాలంకారం అవుతుంది.
  95. అత్యుక్తి
  96. నిరుక్తి
  97. ప్రతిషేధము
  98. విధి
  99. హేతువు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అలంకారం&oldid=4375114" నుండి వెలికితీశారు