అస్మితా మార్వా
అస్మితా మార్వా | |
---|---|
జననం | అస్మితా గుంటి |
వృత్తి | ఫ్యాషన్ డిజైనర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1994 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | హర్వేష్ మార్వా |
వెబ్‌సైటు | asmitadesign.com |
అస్మితా మార్వా, తెలంగాణకు చెందిన ఫ్యాషన్ డిజైనర్, వోగ్ ద్వారా తొమ్మిదిమంది అత్యుత్తమ అంతర్జాతీయ డిజైనర్లలో ఒకరిగా గుర్తించబడింది.[1] కలంకారి అవతార్ తో ఫ్యాషన్ ప్రపంచంలో రాణిస్తోంది.[2][3] బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్, గోవా బీచ్ ఫ్యాషన్ వీక్‌లో కూడా పాల్గొన్నది. ఫ్యాషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యురాలిగా కూడా పనిచేస్తోంది.
జననం
[మార్చు]అస్మితా మార్వా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించింది.
డిజైనింగ్ రంగం
[మార్చు]అస్మితా మార్వా 1990లలో హైదరాబాద్‌లో దుస్తులను డిజైన్ చేయడం ప్రారంభించింది. తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టిన మొదటి హైదరాబాదు డిజైనర్ గా నిలిచింది. నాగార్జున, బాలకృష్ణ, ప్రీతి జింటా, అంజలా జవేరి, శ్రియ, మహేష్ బాబు, టబు, అసిన్, ఛార్మి, అనుష్క మొదలైన నటీనటులకు మన్మధుడు, సంతోషం, ప్రేమంటే ఇదేరా, అర్జున్, అతడు, పోకిరి, ఘర్షణ వంటి సినిమాలలో అస్మితా డిజైన్ చేసిన దుస్తులు ధరించారు.
2003 డిసెంబరులో మార్వా అస్మిత అనే ఫ్యాషన్ లేబుల్‌ను ప్రారంభించింది. సిగ్నేచర్ స్టోర్ రెవ్స్ డి ఎటోయిల్ ద్వారా హైదరాబాద్, ముంబై, ఢిల్లీలోని "అజా ఫ్యాషన్స్"లో విక్రయించబడింది.
జర్నలిజం
[మార్చు]హైదరాబాద్ టైమ్స్‌లో స్టైల్ అనే అంశంపై చాలా సంవత్సరాలు కాలమ్స్ రాసింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]అస్మితకు హర్వేష్ మార్వాతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "About Us | Asmita Marwa Asmita Marwa". asmitadesign.com. Archived from the original on 2020-07-06. Retrieved 2022-05-22.
- ↑ "Archived copy". Archived from the original on 3 April 2017. Retrieved 2022-05-22.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Dundoo, Sangeetha Devi (18 August 2008). "Metro Plus Hyderabad: Dress it up!". The Hindu. Archived from the original on 24 March 2009. Retrieved 2022-05-22.