ఆరు ఎ లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక విషయానికి సంబంధించి పూర్తి సమాచారం రాబట్టాలంటే మొదటగా దానిపై ప్రశ్నించే జ్ఞానం కలిగి ఉండాలి. దీనికి పరిష్కార మార్గంగా సులభమైన ఒక చిన్న పదాన్ని ఉపయోగించడం నేర్చుకున్నారు. దీనిని ఇంగ్లీషులో ఐదు డబ్ల్యూ లు, ఒక హెచ్ (Five Ws, one H) అంటారు. తెలుగులో ఈ పదాన్ని ఆరు ఎ లు అంటారు. వార్తలను సేకరించే విలేకరికి గాని, నేర విచారణ లేక ప్రమాద సంఘటనకు సంబంధించి రక్షకులకు గాని, పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలకు గాని, మొక్కలపై పరిశీలన చేసే వృక్ష శాస్త్రజ్ఞుడుకి గాని, వైద్య నిపుణులుకు గాని, సాధారణ వ్యక్తులకు సైతం ఈ చిన్న పదం ఎంతో ఉపకరిస్తుంది.

  • Who - ఎవరు
  • What - ఏమిటి
  • When - ఎప్పుడు
  • Where - ఎక్కడ
  • Why - ఎందుకు
  • How - ఎలా (How many - ఎన్ని, How much -ఎంత)

వికీపిడియాను ఉదాహరణగా తీసుకొని ఈ చిన్న పదం ద్వారా ఎంత సమాచారం సేకరించవచ్చో తెలుసుకుందాం.

ఏమిటి[మార్చు]

ఇది ఏమిటి - వికీపిడియా, ఇది ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇంటర్ నెట్ ఉపయోగించే వారికి ఇది సుపరిచితం. అణువు నుంచి అంతరిక్షం వరకు, సంకీర్తనల నుంచి విప్లవాల వరకు, పుట్టగొడుగు నుంచి పెద్ద మర్రిచెట్టు వరకు, పడవ నుంచి నది ఒడ్డున ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం వరకు, వెన్నెల నుంచి పిడుగు వరకు, సముద్రతీరం నుంచి కోన (కొండ) వరకు, గర్బాధానము నుంచి సమాధి వరకు, ఊరు నుంచి శ్మశానం వరకు అరంగేట్రం నుంచి ప్రసిద్ధుడు వరకు, మట్టి నుంచి ధనం వరకు, చిగురు నుంచి మాను వరకు, తిరుమల ప్రసాదం నుంచి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం, పిట్స్బర్గ్ వరకు, కరపత్రం నుంచి ఇంటర్నెట్ వరకు, మొక్కల నర్సరీ నుంచి విశ్వ వనం వరకు ఇందులో దొరకని సమాచారమంటూ ఉండదు. కొత్త విషయాలను తెలుసుకునేందుకు నేటి తరం సాధనంగా ఎన్నో విశేషాలను తెలియజేస్తుంది ఈ ఆన్ లైన్ వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం.

ప్రశ్నార్థక పదాలు[మార్చు]

వికీపీడియా[మార్చు]

వికీపీడియాను ఉపయోగించడం ఎలా - రాశి లోను వాసి లోను ప్రసిద్ధి చెందిన ఈ వికీపీడియాను ఉపయోగించడం చాలా తేలిక. తెలుగుతో పాటు దాదాపు 250 భాషల్లో అందుబాటులో ఉన్న ఈ వికీపీడియా నెటిజన్లు అత్యధికంగా చూసే వెబ్ సైట్లలో ఆరవది. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో మొదటి పేజీలలో వికీపీడియా పేజీలుండే అవకాశం. ప్రతి పేజీలో సామాన్యుడికి సైతం అర్ధమయ్యే విధంగా సహాయ సూచికలు. తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి తోటి వికీపీడియన్లు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆరు_ఎ_లు&oldid=2954384" నుండి వెలికితీశారు