ఆర్.సి. కృష్ణస్వామి రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు
జననం
రాచకొండ చెంగల్రాజు కృష్ణస్వామి రాజు

(1962-01-19)1962 జనవరి 19
ఈశ్వరాపురం గ్రామం, పుత్తూరు తాలుకా చిత్తూరు జిల్లా
జాతీయతఇండియన్
విద్యఎమ్.ఏ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, పబ్లిక్ రిలేషన్స్ లలో డిప్లొమోలు
వృత్తిరిటైర్డ్ ఎల్.ఐ.సి. డెవలప్మెంట్ ఆఫీసర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కథకుడు
గుర్తించదగిన సేవలు
పదమూడు కథా సంపుటులు ప్రచురణ
జీవిత భాగస్వామిసూరపరాజు మీనాక్షి
పిల్లలుపూజిత, శేషసాయి

ఆర్.సి. కృష్ణస్వామి రాజు (R.C. Krishnaswami Raju) తిరుపతికి చెందిన కథా రచయిత. ఇప్పటివరకు ఆయనవి చిన్నాపెద్దా కథలు 450 దాకా వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా మాండలికంలో, జనం మాట్లాడుకొనే భాషలో వ్రాయడం ఆయన ప్రత్యేకత.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆర్.సి. కృష్ణస్వామి రాజు (R.C. Krishnaswami Raju) తిరుపతి జిల్లా పుత్తూరు శల్య వైద్య కుటుంబానికి చెందిన రాచకొండ చెంగల్రాజు నారాయణమ్మల ఎనిమిదవ సంతానం. ఎమ్.ఏ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, పబ్లిక్ రిలేషన్స్ లలో డిప్లొమాలు పూర్తి  చేశారు. తిరుపతి ఎల్ ఐ సి కార్యాలయంలో 35 ఏళ్ళ పాటు డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. 1984-87లలో ఈనాడు పత్రికా విలేఖరిగా పని చేశారు.

రచనలు[మార్చు]

మొదటి కథ ‘ఈ కాలం పిల్లలు’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1984 లో ప్రచురితమయ్యింది. ఇప్పటి దాకా భిన్న వర్గాలకు చెందిన పదమూడు కథా సంపుటులు వెలువరించారు.

  • మాండలిక కథలు: ముగ్గురాళ్ళ మిట్ట[1], సల్లో సల్ల[2], గాండ్ల మిట్ట[3]
  • బాల సాహిత్యం: రాజు గారి కథలు[4], రాణి గారి కథలు[4], కార్వేటినగరం కథలు[5]
  • మినీ కథలు: పకోడీ పొట్లం[అరవై కార్డు కథలు][4], మిక్చర్ పొట్లం[ ముప్పై మినీ కథలు][6]
  • హాస్య కథలు: దుశ్శాలువా కప్పంగ[4]
  • ఆధ్యాత్మిక కథలు: గతం గతః[4]
  • చిత్తూరు జిల్లా యాస కథలు: కిష్టడి కతలు[7], రాజనాల బండ[8], పుత్తూరు పిల ‘గోడు’[9][4]

ఆల్ ఇండియా రేడియో, ఆదిలాబాద్ కేంద్రం వారు కిష్టడి కతలు, రాజు గారి కథలు, రాణిగారి కథలు పుస్తకాలలోని 90 కథలనూ ప్రసారం చేశారు. ఇప్పటివరకు అరవై బాలల కథలు కన్నడంలోకి అనువదింపబడ్డాయి. ఆయన రచనలపై చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలలో పరిశోధనలు జరుగుతున్నాయి.

పురస్కారాలు[మార్చు]

  • ‘ముగ్గురాళ్ళ మిట్ట’ సంపుటికి శ్రీ మక్కెన రామ సుబ్బయ్య స్మారక పురస్కారం, హైదరాబాద్ జి వి ఆర్ ఫౌండేషన్ వారి ఉత్తమ కథా సంపుటి బహుమతి లభించాయి.
  • ‘సల్లో సల్ల’ కథల సంపుటికి శ్రీమతి శివేగారి దేవమ్మ స్మారక  కథా పురస్కారం లభించింది[10]
  • అలాగే ‘పకోడి పొట్లం’ కార్డు కథల సంపుటికి రావూరి భరద్వాజ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రావూరి వెంకటేశ్వరరావు పురస్కారాన్ని అందించారు[11].
  • సాహితీ సేవ చేస్తున్నందులకు తిరుపతి విశ్వశ్రీ సాహితీ సమాఖ్య వారి  గార్లపాటి పురస్కారం లభించింది. అలాగే చెన్నై తెలుగువెలుగు సంక్షేమ సంఘం వారు తెలుగు వెలుగు పురస్కారం అందించారు.

ఇతరాలు[మార్చు]

  • ఎల్ ఐ సి ఏజెంట్లు, డెవలప్ మెంట్ ఆఫీసర్లు, పోలీసులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సి.ఏ., ఎం.బి. ఏ., చదివే విద్యార్థులకు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఇప్పటివరకు వందకి పైగా పర్సనాలిటీ డెవలప్ మెంట్ తరగతులు నిర్వహించారు.
  • ఎల్ ఐ సి డెవలప్ మెంట్ ఆఫీసర్ల అసోసియేషన్ నెల్లూరు డివిజన్ జాయింట్ సెక్రటరీగా [1997-2007]  విధులు నిర్వహించారు.
  • పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ సెక్రెటరీగాను, వైస్ చైర్మన్[16] గాను పదవీ బాధ్యతలు నిర్వహించారు. సెక్రటరీగా [2005-06] బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆ చాప్టర్ కు జాతీయ అవార్డు లభించింది.

మూలాలు[మార్చు]

  1. "విలక్షణ జానపద శైలి ముగ్గురాళ్ల మిట్ట (కథలు)".
  2. "సల్లో సల్ల... పుస్తక పరిచయం".
  3. "మంచి మనుషుల మంచి కథలు - గాండ్లమిట్ట".
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "కథా రచయిత, బాలసాహితీవేత్త శ్రీ ఆర్. సి. కృష్ణస్వామిరాజు ప్రత్యేక ఇంటర్వ్యూ".
  5. "కార్వేటినగరం కథలు పుస్తక ఆవిష్కరణ".
  6. "వైవిధ్య కథల సమాహారం - మిక్చర్ పొట్లం".
  7. "ఆకట్టుకునే 'కిష్టడి కతలు'".
  8. "'Rajanala Banda' book released in Tirupati, hailed for bringing Telugu local dialect to the fore".
  9. "మాతృభాషకు పట్టంగట్టిన పుత్తూరు'పిల'గోడు".
  10. "ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారికి శివేగారి దేవమ్మ పురస్కారం".
  11. "ఆర్.సి. కృష్ణస్వామి రాజుకు రావూరి భరద్వాజ ప్రతిభా పురస్కారం - ప్రకటన".
  12. "ఘనంగా తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానోత్సవం".
  13. "44 మందికి తెలుగు వర్సిటీ 'కీర్తి పురస్కారాలు'".
  14. "'రాణి గారి కథలు' పుస్తకానికి పెందోట బాల సాహిత్య పురస్కారం - ప్రెస్ నోట్".
  15. "ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారికి 'సాహితీ కిరణం' పురస్కారం".
  16. "Public Relations Society of India new office-bearers take charge".

01. నమస్తే తెలంగాణ (2023-03-29) "22 మందికి కీర్తి పురస్కారాలు"

02. నవతెలంగాణ (30 April 2016) "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం" Archived 2023-04-25 at the Wayback Machine

03. ఆంధ్రజ్యోతి ఆదివారం కథ - అమ్మా .. నీకు దండమే!