ఇదేం పెళ్లాం బాబోయ్
ఇదేం పెళ్లాం బాబోయ్ | |
---|---|
![]() ఇదేం పెళ్లాం బాబోయ్ విహెచ్ఎస్ కవర్ | |
దర్శకత్వం | కాట్రగడ్డ రవితేజ |
రచన | చిలుకోటి కాశీ విశ్వనాథ్ (మాటలు) |
స్క్రీన్ప్లే | పంచు అరుణాచలం |
కథ | పంచు అరుణాచలం |
దీనిపై ఆధారితం | మనమాగలే వా (1988) |
నిర్మాత | బి.హెచ్. రాజన్న |
నటవర్గం | రాజేంద్ర ప్రసాద్ రాధిక |
ఛాయాగ్రహణం | కె. గోపి |
కూర్పు | ఎన్. చందన్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | రాజా ఎంటర్‌ప్రైజెస్[1] |
విడుదల తేదీలు | 1990 |
నిడివి | 136 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఇదేం పెళ్లాం బాబోయ్ 1988లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజా ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై బి.హెచ్. రాజన్న నిర్మాణ సారథ్యంలో కాట్రగడ్డ రవితేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రాధిక నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[2] 1988లో తమిళంలో వచ్చిన మనమాగలే వా చిత్ర రిమేక్ చిత్రమిది. బాక్సాఫీన్ వద్ద పరాజయం పొందింది.[3]
కథా నేపథ్యం[మార్చు]
శోభాదేవి (పి. ఆర్. వరలక్ష్మి) చాలా అహంకారంతో ఉంటూ తన కోడలు అరుణ (రాజ్యలక్ష్మి)ను బానిసలా చూస్తూ, తన మాటలను లెక్కచేయనందుకు ఆమెను ఇంటి నుండి బయటకు పంపుతుంది. అరుణ చెల్లెలు ఝాన్సీ (రాధిక) తన అక్కకి జరిగిన దానిగురించి తెలుసుకొని చదువు పూర్తిచేసి ఇంటికి తిరిగివస్తుంది. తన అక్క జీవితాన్ని సరిదిద్దాలని నిర్ణయించుకున్న ఝాన్సీ, శోభాదేవి చిన్న కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి (రాజేంద్ర ప్రసాద్) ను వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. తన వేషధారణ మార్చుకుని, వారి ఊరికి వెళ్ళి, కల్యాణ్‌ను వివాహం చేసుకొని శోభాదేవికి గుణపాఠం ఎలా నేర్పిందనేది మిగతా కథ.
నటవర్గం[మార్చు]
- రాజేంద్ర ప్రసాద్ (కళ్యాణ్ చక్రవర్తి)
- రాధిక (ఝాన్సీ/రాజన్న)
- గొల్లపూడి మారుతీరావు (చి చి స్వామి)
- కోట శ్రీనివాసరావు (దశరథరామయ్య)
- బ్రహ్మానందం (కళ్యాణ్ స్నేహితుడు)
- బేతా సుధాకర్ (శ్రీధర్)
- రాళ్ళపల్లి (నాగిరి పెంగిరి హనుమంతు)
- సాక్షి రంగారావు (రాజ శేఖరం)
- చిలుకోటి కాశీ విశ్వనాథ్ (అబ్బులు)
- శివాజీ రాజా (బుల్లిబాబు)
- చిట్టిబాబు (కళ్యాణ్ స్నేహితుడు)
- కె.కె. శర్మ (జాన్ మస్తాన్ సుబ్రహ్మణ్య శాస్త్రి)
- తాడి తాతాజి
- సత్తిబాబు (ప్రతాప సింహ మహారాజు)
- జుట్టు నరసింహం (కన్నయ్య)
- ధమ్ (సదజప్ప)
- సూర్యాకాంతం (రాములమ్మ)
- పి.ఆర్. వరలక్ష్మి (శోభాదేవి)
- రాజ్యలక్ష్మి (అరుణ)
- మమత (డాక్టర్)
- చంక్రిక (పేరంటాళ్ళు)
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: కాట్రగడ్డ రవితేజ
- నిర్మాత: బి.హెచ్. రాజన్న
- మాటలు: చిలుకోటి కాశీ విశ్వనాథ్
- కథ, చిత్రానువాదం: పంచు అరుణాచలం
- ఆధారం: మనమాగలే వా (1988)
- సంగీతం: ఇళయరాజా
- ఛాయాగ్రహణం: కె. గోపి
- కూర్పు: ఎన్. చందన్
- నిర్మాణ సంస్థ: రాజా ఎంటర్‌ప్రైజెస్
పాటలు[మార్చు]
Untitled | |
---|---|
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు. ఎకో ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[4]
క్రమసంఖ్య | పాట సంఖ్య | రచన | గాయకులు | నిడివి |
---|---|---|---|---|
1 | "డార్లింగ్ డార్లింగ్" | భువనచంద్ర | మనో | 4:07 |
2 | "చామంతి పువ్వులు కట్టి" | ఆత్రేయ | కె.ఎస్. చిత్ర | 4:15 |
3 | "గోదావరి పొంగల్లే" | భువనచంద్ర | మనో, చిత్ర | 4:21 |
4 | "మనసుకెటో" | ఆచార్య ఆత్రేయ | చిత్ర | 4:22 |
5 | "రమ్మంటే రాదయే" | భువనచంద్ర | మనో, చిత్ర | 4:20 |
ఇతర వివరాలు[మార్చు]
విసిడి, డివిడిలు హైదరాబాదు హైదరాబాదులోని వీడియో కంపెనీలో లభిస్తాయి.
మూలాలు[మార్చు]
- ↑ "Idem Pellam Baboi (overview)". youtube.
- ↑ "Idem Pellam Baboi (Cast & Crew)". Tollywood Times.com. Archived from the original on 2018-09-28. Retrieved 2020-08-14.
- ↑ "Idem Pellam Baboi (Review)". The Cine Bay.
- ↑ "Idem Pellam Baboi (Songs)". Cineradham. Archived from the original on 2017-08-18. Retrieved 2020-08-14.
ఇతర లంకెలు[మార్చు]
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసంలు
- 1990 సినిమాలు
- Articles using infobox templates with no data rows
- 1990 తెలుగు సినిమాలు
- ఇళయరాజా సంగీతం అందించిన చిత్రాలు
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు
- గొల్లపూడి మారుతీరావు చిత్రాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- సుధాకర్ నటించిన సినిమాలు
- సూర్యకాంతం నటించిన సినిమాలు
- శివాజీ రాజా నటించిన చిత్రాలు
- రాళ్ళపల్లి నటించిన సినిమాలు