ఎం.ఆర్. రాజాకృష్ణన్
ఎం.ఆర్. రాజాకృష్ణన్ | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా సౌండ్ డిజైనర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1999–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మంజు |
పిల్లలు | గౌరీ పార్వతి |
తల్లిదండ్రులు |
|
మేడయిల్ రాధాకృష్ణన్ రాజాకృష్ణన్ కేరళ రాష్ట్రానికి చెందిన సినిమా సౌండ్ డిజైనర్. తమిళం, హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళ సినిమాలకు పనిచేశాడు. 2018లో వచ్చిన రంగస్థలం సినిమాకు 2019లో ఉత్తమ ఆడియోగ్రఫర్ గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. 2011లో ఉరుమి, చప్పా కురిష్ సినిమాల ఆడియో మిక్సింగ్‌కు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును, 2013లో మంచాడికురు సినిమాకు కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ మంచిడికురు, పెరల్ అవార్డును గెలుచుకున్నాడు.
జననం, విద్య
[మార్చు]రాజాకృష్ణన్ 1977 మే 25న కేరళలోని త్రివేండ్రంలో జన్మించాడు. తండ్రి ఎంజి రాధాకృష్ణన్ మలయాళ సినిమారంగంలో ప్రసిద్ధ సంగీత దర్శకుడు, కర్ణాటక సంగీత విద్వాంసుడు. తల్లి పద్మజా రాధాకృష్ణన్ కళలు, సాహిత్యరంగంలో కృషి చేసింది. తాతయ్య మలబార్ గోపాలన్ నాయర్, నానమ్మ కమలాక్షి అమ్మ కూడా సంగీత విద్వాంసులు. బాబాయ్ ఎంజి శ్రీకుమార్ మలయాళంలో ప్రసిద్ధ గాయకుడు.[1]
తన మేనత్త, ప్రఖ్యాత కర్నాటక గాయకురాలు డాక్టర్. కె. ఓమనకుట్టి వద్ద కర్ణాటక సంగీతాన్ని నేర్చకున్నాడు. మావేలికర కృష్ణంకుట్టి నాయర్, త్రిపుణితుర రాధాకృష్ణన్ మార్గదర్శకత్వంలో మృదంగం కూడా నేర్చుకున్నాడు. అర్థశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత త్రిస్సూర్‌లోని చేతన స్టూడియోలో సౌండ్ డిజైనింగ్‌లో కోర్సు చేశాడు.
వృత్తిరంగం
[మార్చు]23 సంవత్సరాల వయస్సులో దీపన్ ఛటర్జీ దగ్గర అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్‌గా పనిచేశాడు. 2004లో జాతీయ అవార్డు పొందిన బలోతెక్కో (బెంగాలీ)తో సహా దాదాపు 70 సినిమాకు పనిచేశాడు. ఆ తర్వాత చెన్నైలోని ఫోర్ ఫ్రేమ్స్ సౌండ్ కంపెనీలో అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్‌గా చేరాడు. మలయాళంలో చాలామంది దర్శకులతో పనిచేశాడు. మలయాళం, హిందీ, తమిళం, కన్నడం, మరాఠీ, తెలుగు, బెంగాలీ వంటి వివిధ భాషలలో 200 సినిమాలకు పైగా సౌండ్ డిజైనింగ్, మిక్సింగ్ చేసాడు.
అవార్డులు
[మార్చు]- రంగస్థలం సినిమాకు 2019 ఉత్తమ ఆడియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డు [2]
- 2015: చార్లీ (మలయాళం) సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు[3]
- 2013: చప్పా కురిష్, ఉరుమి[4] సినిమాలకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
- 2013: మంచాడికురు (మలయాళం) సినిమాకు ఉత్తమ సౌండ్ డిజైన్‌గా పెర్ల్ అవార్డు
- 2012: మంచాడికురు (మలయాళం) సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు
- 2012: ఉరుమి సినిమాకు ఉత్తమ సౌండ్ డిజైనర్‌గా సూర్య టివి అవార్డు
- 2011: ఉరుమి సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం రిపోర్టర్ ఛానల్ అవార్డు
- 2011: ఉరుమి సినిమాకు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
- 2006: కీర్తిచక్ర సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు
- 2006: అనంతబద్రం సినిమాకు ఉత్తమ ఆడియోగ్రఫీకి అమృత ఫెర్టానిటీ అవార్డు
సినిమాలు
[మార్చు]సంవత్సరం | భాష | సినిమా పేరు | అవార్డులు |
---|---|---|---|
2019 |
హిందీ | కబీర్ సింగ్ | |
కన్నడం | అతడే శ్రీమన్నారాయణ | ||
మలయాళం | చిల్డ్రన్ పార్కు | ||
ఎవరికి చెప్పొద్దు | |||
కల్కి | |||
కెత్తియోలను ఎంత మాలాఖా | |||
మరక్కార్: అరేబియా సముద్ర సింహం | |||
మార్గంకాళి | |||
గ్యాంగ్స్ ఆఫ్ 18 | |||
ప్రతి పూవంకోజి | |||
సత్యం పరంజ విశ్వసిక్కువో | |||
తమిళం | ఆదిత్య వర్మ | ||
దేవి 2 | |||
కనులు కనులను దోచాయంటే | |||
మెయి | |||
నేర్కొండ పార్వై | |||
తెలుగు | డియర్ కామ్రేడ్ | ||
జార్జ్ రెడ్డి | |||
ప్రెజర్ కుక్కర్ | |||
2018 | మలయాళం | బ్యాక్‌స్టేజర్ | |
తమిళం | అసురగురువు | ||
తెలుగు | రంగస్థలం | నేషనల్ ఫిల్మ్ అవార్డ్ బెస్ట్ సౌండ్ మిక్స్ | |
2017 | మలయాళం | ఎజ్రా | |
గోధా | |||
జోమోంటే సువిశేషాంగల్ | |||
ఓరు మెక్సికన్ అపరత | |||
టేకాఫ్ | |||
తమిళం | విక్రమ్ వేద | ||
2016 | కన్నడం | కిరిక్ పార్టీ | |
మలయాళం | యాక్షన్ హీరో బిజు | ||
గుప్పీ | |||
హేయ్ పిల్లగాడ | |||
తమిళం | 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్ | ||
మో | |||
ఓట్టతూధువన్-1854 | |||
సమ్ టైమ్స్ | |||
తరై తప్పట్టై | |||
2015 | మలయాళం | అమర్ అక్బర్ ఆంటోనీ | |
చార్లీ | ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు | ||
జో అండ్ ది బాయ్ | |||
కుంజీరామాయణం | |||
మిలి | |||
లార్డ్ లివింగ్‌స్టోన్ 7000 కండి | |||
ప్రేమమ్ | |||
తమిళం | 144 | ||
36 వయసులో | |||
ఇదు ఎన్న మాయం | |||
కాక ముట్టై | |||
మయూరి | |||
ఒరు నాల్ ఇరవిల్ | |||
2014 | మలయాళం | బెంగుళూరు డేస్ | |
మిస్టర్ ఫ్రాడ్ | |||
ఓం శాంతి ఓషాణ | |||
ఉన్నిమూలం | |||
తమిళం | కుకూ | ||
జిగర్తాండ | |||
ముండాసుపట్టి | |||
శైవం | |||
2013 | మలయాళం | 1983 | |
ఎస్కేప్ ఫ్రమ్ ఉగాండా | |||
ఎజు సుందర రాత్రికల్ | |||
గీతాంజలి | |||
ఇమ్మానుయేల్ | |||
కలిమన్ను | |||
ముంబై పోలీస్ | |||
నాడోడిమన్నన్ | |||
నేరం | |||
పాపిలియో బుద్ధుడు | |||
పుల్లిపులికలుమ్ అట్టింకుట్టియుమ్ | |||
రెడ్ వైన్ | |||
రోమన్స్ | |||
తీరా | |||
తమిళం | చెన్నైయిల్ ఒరు నాల్ | ||
ఇధర్కుతానే ఆసైపట్టై బాలకుమారా | |||
పరదేశి | |||
సూదు కవ్వుం | |||
తలైవా | |||
2012 | మలయాళం | 101 వెడ్డింగ్స్ | |
అయలుమ్ నింజనుమ్ తమ్మిళ్ | |||
డైమండ్ నెక్లెస్ | |||
గ్రాండ్ మాస్టర్ | |||
మాస్టర్స్ | |||
పుతియా తీరంగల్ | |||
షట్టర్ | |||
స్పానిష్ మసాలా | |||
తట్టతిన్ మరయతు | |||
తీవ్రం | |||
జనతా హోటల్ | |||
తమిళం | మలై పోఝుతిన్ మాయకతిలాయ్ | ||
పిజ్జా | |||
తాండవం | |||
వేలాయుతం | |||
2011 | మలయాళం | అరబియం ఒట్టకవుం పి మాధవన్ నైరుం | |
చప్పకురుష్ | ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు | ||
కుంజలియన్ | |||
ట్రాఫిక్ | |||
ఉరుమి | ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు | ||
ఉత్తమ సౌండ్ డిజైనర్‌గా సూర్య టీవీ అవార్డు | |||
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం రిపోర్టర్ ఛానల్ అవార్డు | |||
తమిళం | దైవతిరుమకల్ | ||
మయక్కమ్ ఎన్నా | |||
2010 | హిందీ | ఆక్రోష్ | |
మలయాళం | కాక్టెయిల్ | ||
ఎల్సమ్మ ఏనా ఆనకుట్టి | |||
మద్రాసు పట్టినం | |||
2009 | హిందీ | దే ధనా ధన్ | |
మరాఠీ | సుఖంత్ | ||
మలయాళం | నీలతామర | ||
వింటర్ | సంగీత స్వరకర్త | ||
2008 | హిందీ | తహాన్ | |
మలయాళం | కలకత్తా న్యూస్ | ||
మంచాడికూరు | ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు | ||
బెస్ట్ సౌండ్ డిజైన్‌కి పెరల్ అవార్డు | |||
మిన్నమిన్నికొట్టం | |||
ముల్లా | |||
తమిళం | కాంచీవరం | ||
2007 | హిందీ | భూల్ భూలయ్య | |
కన్నడం | ప్రారంభ | ||
2006 | మలయాళం | అచ్చన్ ఉరంగత వీడు | |
క్లాస్‌మేట్స్ | |||
కీర్తిచక్ర | ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు | ||
తమిళం | ఇ | ||
మలయాళం | అనంతభద్రం | ఉత్తమ ఆడియోగ్రఫీకి అమృత ఫెర్టానిటీ అవార్డు | |
తమిళం | నవరస |
మూలాలు
[మార్చు]- ↑ "Early Life, Career". The Hindu.
- ↑ "National Awards 2019: Raja Krishnan on winning Best Audiography for Rangasthalam, and working on Nerkonda Paarvai-Entertainment News, Firstpost". 12 August 2019.
- ↑ "Charlie, Moideen bag top honours". The Hindu. 2 March 2016.
- ↑ "Raja of Sounds".