Jump to content

నరిశెట్టి ఇన్నయ్య

వికీపీడియా నుండి
(ఎన్.ఇన్నయ్య నుండి దారిమార్పు చెందింది)
నరిశెట్టి ఇన్నయ్య
నరిశెట్టి ఇన్నయ్య
జననంనరిశెట్టి ఇన్నయ్య
1937, అక్టోబరు 31
గుంటూరు జిల్లా చేబ్రోలు
వృత్తిసంపాదకులు
ప్రసిద్ధిరాజకీయ, సాంఘిక, తాత్విక రచయిత
మతంహ్యూమనిస్ట్
వెబ్‌సైటు
www.http://innaiahn@tripod.com

నరిశెట్టి ఇన్నయ్య 1937, అక్టోబరు 31గుంటూరు జిల్లా చేబ్రోలు శివారు పాతరెడ్డిపాలెంలో జన్మించాడు. తెలుగులో రాజకీయ, సాంఘిక, తాత్విక రచనలు, కొన్ని అనువాదాలు చేశాడు. ప్రముఖ హ్యూమనిస్ట్ ఎం.ఎన్. రాయ్‌ రచనలు అనువదించాడు. తెలుగు అకాడమీ వీటిని ప్రచురించింది. ఇతడు హేతువాది. తెలుగులో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించాడు.

బాల్యం

[మార్చు]

ఇన్నయ్య ఉన్నత పాఠశాలలో చదువుతుండగా, అతని నాన్న రాజయ్య ఆంధ్రప్రభ, భారతి తెప్పించేవాడు. మద్రాసు నుండి నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వాన వచ్చే పత్రిక కోసం రోజూ ఎదురు చూచి చదివేవాళ్ళు. అప్పట్లో అన్నా ప్రగడ కామేశ్వరరావు గారి అంకుశం, బండి బుచ్చయ్య గారి ములుకోల, సూర్యదేవర రాజ్యలక్ష్మి గారి తెలుగుదేశం, వాహిని పత్రికలు చదువుతుండే వాడు. రాజకీయ హడావుడి ఎక్కువగా ఉండేది. తెనాలినుండి జ్యోతి పక్షపత్రిక, రేరాణి, అభిసారిక వచ్చేవి. ధనికొండ హనుమంతరావు సంపాదకత్వాన అభిసారిక యువతను పెద్దలను ఆకట్టుకునేది. మద్రాసు నుండి తెలుగు స్వతంత్ర పత్రిక వచ్చేది. ఆ విధంగా ఉన్నత పాఠశాలలోనే వివిధ పత్రికలు చదువుతుండడం వలన, అతను ప్రజావాణిలో వ్రాయడానికి అలవాటుపడ్డాడు.

విద్యాభ్యాసం

[మార్చు]

బి.ఏ. ఫిలాసఫి , ఏ.సి. కళాశాల, గుంటూరు, ఎం.ఏ ఫిలాసఫి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, పి.హెచ్.డి. ఉస్మానియా విశ్వవిద్యాలయం

పత్రికలలో పని

[మార్చు]
Ab shah with Innaiah

ఇన్నయ్య విద్యాభ్యాసం చేస్తున్నపుడు అనగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రజావాణిలో ఉద్యోగంలో చేరాడు.1954 నుండి పదేళ్ళ పాటు "ప్రజావాణి" కి రాశాడు. అనేక అనువాదాలు కూడా చేశాడు. ఇన్నయ్య సోదరుడు విజయరాజకుమార్ కల్లు గీత సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు కాగా 1954లో కాలేజీ చదువు ఒక సంవత్సరం వాయిదా వేసుకుని ఇంటి పోషణకు ప్రజావాణిలో ఉద్యోగం చెయ్యవలసి వచ్చింది. లచ్చన్న నాయకత్వంలో జరిగిన గీత సత్యాగ్రహం, రాష్ట్రంలో మధ్య నిషేధం తొలగించాలని పోరాడి గెలిచింది. ఈ నేపథ్యంలో అతను ఉద్యోగం చేశాడు. తొలుత గుంటూరువారి తోటలో అద్దెకుండేవాళ్ళు. ఇన్నయ్య తండ్రి రాజయ్య పొలాలు పోగొట్టుకుని, జబ్బు పడ్డాడు. ఇన్నయ్య ఉద్యోగం చేస్తూ జబ్బుపడ్డాడు. అయినా అతని అన్న జైలు నుండి తిరిగి వచ్చే వరకూ ప్రజావాణిలో ఉద్యోగం చేశాడు. అప్పుడు రచయితలతో, రాజకీయవాదులతో పరిచయమైంది. ప్రజావాణి రాజకీయ వారపత్రికగా ప్రభావం చూపెట్టింది. కమ్యూనిస్టు వ్యతిరేకత పత్రికలో ఉండేది. ప్రజావాణి విమర్శలకు రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు స్పందించారు. మద్దుకూరి చంద్రశేఖరరావు వంటి వారు ప్రతి విమర్శల్ని వారి పత్రికలలో రాశారు.[1]

ఇన్నయ్య అన్న విజయరాజ కుమార్ తొలుత ఫార్వర్డ్ బ్లాక్ లో, తరువాత కృషి కార్ లోక్ పార్టీలో ఉండడం వలన, అతనికి ఆ పార్టీల వారితో పరిచయాలు కలిగాయి. జైలు నుండి విడుదలై అతని అన్న రాగానే, మళ్ళీ కాలేజీ చదువులు కొనసాగించగలిగాడు. అయినా రచనలు మానలేదు. ఎం.ఎన్. రాయ్ రచనలు కొన్ని అనువదించి ప్రజావాణిలో ప్రచురించాడు. 1964 వరకూ రాశారు. తరువాత ప్రజావాణికి మానేశాడు. వట్టి కొండ రంగయ్య కొన్నేళ్ళ తరువాత ప్రజావాణి నిలిపేశాడు. పార్టీలు అధికారం రాజకీయాలు అనే ఎం.ఎన్.రాయ్ వ్యాస సంపుటి, మెన్ ఐ మెట్ అనే వ్యక్తిత్వ అంచనాల రచన ప్రజావాణిలో అనువదించాడు. అతన రచన లేవీ సెన్సార్ కాకుండా రంగయ్య ప్రచురించి అతన్ని ప్రోత్సహించాడు.

తస్లిమా నస్రీన్ పై హైదరాబాదు మజ్లిస్ పార్టీకి చెందిన వారు చేసిన దాడిలో అతను కూడా గాయపడ్డాడు.[2]

నిర్వహించిన వివిధ హోదాలు

[మార్చు]
attack on taslima
  • రచయిత & ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
  • కో-ఎడిటర్ (పి. సత్యనారాయణ): “ప్రసరీత” - సాంఘిక శాస్త్రాలలో తెలుగు త్రైమాసికం 1972-75.
  • చీఫ్ రిపోర్టర్ & స్పెషల్ కరెస్పాండెంట్: “ఆంధ్ర జ్యోతి”, తెలుగు డైలీ (హైదరాబాద్ బ్యూరో) 1975-81.
  • ప్రెసిడెంట్: A.P. చాప్టర్ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్, హైదరాబాద్, 1988-90.
  • ప్రెసిడెంట్: A.P. హేతువాద సంఘం, 1991-93.
  • with co-writers
    కార్యదర్శి: ఇండియన్ రాడికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్, 1992-94.
  • సాధారణ కార్యదర్శి: ఇండియన్ హేతువాద సంఘం, 1994-96.
  • వైస్ ప్రెసిడెంట్: 1996 నుండి రేషనలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.
  • కో-ఆర్డినేటర్: ఫరా, AP - నాస్తిక సమాఖ్య , హేతువాది, మానవతావాద సంఘం, A.P. 2003-2005.
  • జనరల్ సెక్రటరీ: ఇండియన్ రాడికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్, 2005-2007.
  • చైర్మన్: సెంటర్ ఫర్ ఎంక్వైరీ- ఇండియా, 2000-2009.

వ్యక్తిగత విషయాలు

[మార్చు]
Book release on m n roy, Avula Sambasiva Rao Chief Justice

ఇన్నయ్య వెనిగళ్ల కోమల ను పెళ్లాడాడు. తెనాలిలో వీరి పెళ్ళి 1964 లో ఆవుల గోపాలకృష్ణమూర్తి నిర్వహించాడు. ఆమె అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసి 1995లో పదవి విరమించింది. ఆమె ఎమ్. ఎన్.రాయ్ పుస్తకం "మెమోయిర్స్ ఆఫ్ కేట్" తెలుగులోకి అనువాదం చేసింది. ఆయన కుమారుడు రాజు నరిసెట్టి వాల్ స్ట్రీట్ జర్నల్ ఐరోపా, మింట్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికలలో సంపాదకుడుగా పనిచేసిన తరువాత వాల్ స్ట్రీట్ జర్నల్ డిజిటల్ మీడియా నెట్వర్క్ కు, న్యూయార్క్ ప్రింటు ఎడిషన్ కు సంపాదకునిగా ఉన్నాడు. ప్రస్తుతం గిజిమోడో డిజిటల్ కంపెనీలో సి.ఇ.ఒ. గా పనిచేస్తున్నాడు. ఇన్నయ్య కుమార్తె డా నవీనా హేమంత్ చిన్న పిల్లల మానసికశాస్త్ర నిపుణురాలిగా అమెరికాలో పనిచేస్తున్నది.[3]

రచనలు, ఇతరాలు

[మార్చు]
Johnson, Bob with Innaiah in staton island, NY, atheist leaders interview.
Innaiah with Narla

తెలుగులో చేసిన రచనల్లో కొన్ని

  1. రామ్ మోహనరాయ్ నుండి ఎమ్.ఎన్.రాయ్ వరకు 1973
  2. ఆంధ్రప్రదేశ్ లో కులరాజకీయాలు 1985
  3. వి.ఆర్.నార్ల జీవితం-అనుభవాలు 1987
  4. నరిసెట్టి, ఇన్నయ్య. "Wikisource link to మూఢనమ్మకాలకు దివ్యజ్ఞానసమాజ సిమెంట్". Wikisource link to అబద్ధాల వేట - నిజాల బాట. రేషనలిస్ట్ వాయిస్ పబ్లికేషన్స్. వికీసోర్స్. 
  5. మనదేశంలో పూర్ణ వికాసం రాదా -డా.ఇ.ఇన్నయ్య 1990
  6. నరహంతకులు 1992
  7. చిట్కా వైద్యాలు-చిల్లరడాక్టర్లు 1998
  8. మతాల చిత్రహింసలో చిన్నారులు 2000
  9. హిందూ ముస్లిం ఐక్యత
  10. ఇన్నయ్య గారి ప్రయాణం - ఇండియా నుంచి అమెరికా దాకా
  11. ఏది నీతి ? ఎదిరీతి ?
  12. ఆంధ్ర ప్రదేశ్ లో విప్లవ మానవత్వ ఉద్యమం
  13. నమ్మిచెడినవారికోసం
  14. మిసిమి వ్యాసాలు
  15. నేను కలిసిన మానవతావాదులు, ముఖ్యమంత్రులు
  16. ఉగ్రవాదుల మీద మోనోగ్రాఫ్
Forced into faith

ఆంగ్లం నుండి అనువదించిన పుస్తకాలు

  1. చైనాలో విప్లవం ప్రతి విప్లవం -ఎమ్ ఎన్ రాయ్
  2. రష్యన్ విప్లవం -ఎం ఎన్ రాయ్
  3. రీసన్ రొమాంటిసిజం విప్లవం- భాగం 1 2
  4. పార్టీలు, అధికారం రాజకీయాలు- ఎం ఎన్ రాయ్
  5. గ్రేట్ ట్రెడిషన్ అండ్ లిటిల్ ట్రెడిషన్ ఇన్ ఇండియా - అగేహానంద భారతి
  6. గాడ్ డెల్యూజన్, రిచర్డ్ డాకిన్స రచనా,అశోక్ పబ్లికేషన్స్, విజయవాడ.
  7. హేతువాది ప్రచురించిన క్రిస్టోఫర్ హిచెన్స్- దేవుడు గొప్పవాడు కాదు
  8. ఎం ఎన్ రాయ్ జీవితం- వి.బి.కార్నిక్ తెలుగు అకాడమీ, హైదరాబాద్
  9. పార్టీలు, అధికారం రాజకీయాలు M N రాయ్- తెలుగు అకాడమీ
  10. లైఫ్ ఆఫ్ ఎం ఎన్ రాయ్- సిబ్నారాయణ రే- తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ
  11. వై ఐ యామ్ నాట్ ముస్లిం- ఇబ్న్ బర్రాక్
  12. With taslima
    వి ఆర్ నార్లా రాసిన గీత గురించి నిజం
  13. ఎవెలిన్ ట్రెంట్- రేషనల్ పబ్లిషర్స్
  14. USA లోని ప్రోమేథ్యూస్ పుస్తకాలు ప్రచురించిన ఫోర్సెడ్ ఇంటు ఫైథ్
  15. ప్రోమేతియస్ ప్రచురించిన ఎం ఎన్ రాయ్ రచనల ఎంపికలు
  16. విలువలతో జీవించడం- ఇన్నయ్య గారి ఆత్మ కథ
  17. హైదరాబాద్ నుండి ప్రసరీతా త్రైమాసిక తెలుగు పత్రిక సంయుక్తంగా పోలు సత్యనారాయణ ఇన్నయ్య నరిశెట్టి సంకలనం చేసింది: వి ఆర్ నార్లా (నార్లా వెంకటేశ్వరరావు) తన చివరి తెలుగు నాటకం 'నరకం లో హరిశ్చంద్ర' (ఇన్నయ్య కు) అంకితం చేశారు
  18. ఎ.బి.షా చేత శాస్త్రీయ పద్ధతి ఇన్నయ్యచే అనువదించబడింది
  19. రేషనలిస్ట్ పుస్తకాలచే ప్రచురించబడిన అగేహానంద భారతి యొక్క ఆత్మకథ
  20. లెటర్ టు క్రిస్టియన్ నేషన్- ఆగెహానంద భారతి.

మూలాలు

[మార్చు]
  1. నరిసెట్టి, ఇన్నయ్య. "వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు (part-1)". telugumedianews.blogspot.in/2007/05/part-1.html. Archived from the original on 21 మార్చి 2016. Retrieved 21 March 2016.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Taslima roughed up in Hyderabad - Today's Paper - The Hindu". thehindu.com. 2016. Retrieved March 21, 2016.
  3. "BIO-DATA INNAIAH NARISETTI" (PDF). tana2013.org/. Archived from the original (PDF) on 3 జూన్ 2013. Retrieved 12 May 2016.

బయటి లింకులు

[మార్చు]