నరిశెట్టి ఇన్నయ్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నరిశెట్టి ఇన్నయ్య
Innaiah Narisetti.JPG
నరిశెట్టి ఇన్నయ్య
జననం నరిశెట్టి ఇన్నయ్య
1937, అక్టోబరు 31
గుంటూరు జిల్లా చేబ్రోలు
ప్రసిద్ధి రాజకీయ, సాంఘిక, తాత్విక రచయిత

నరిశెట్టి ఇన్నయ్య 1937, అక్టోబరు 31గుంటూరు జిల్లా చేబ్రోలు శివారు పాతరెడ్డిపాలెంలో జన్మించాడు. తెలుగులో రాజకీయ, సాంఘిక, తాత్విక రచనలు మరియు కొన్ని అనువాదాలు చేశాడు. ప్రముఖ హ్యూమనిస్ట్ ఎం.ఎన్. రాయ్‌ రచనలు అనువదించాడు. తెలుగు అకాడమీ వీటిని ప్రచురించింది. ఇతడు హేతువాది. తెలుగులో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించాడు.

బాల్యం[మార్చు]

ఇన్నయ్య ఉన్నత పాఠశాలలో చదువుతుండగా, వారి నాన్న రాజయ్య ఆంధ్రప్రభ, భారతి తెప్పించేవాడు. మద్రాసు నుండి నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వాన వచ్చే పత్రిక కోసం రోజూ ఎదురు చూచి చదివేవాళ్ళు. అప్పట్లో అన్నా ప్రగడకామేశ్వరరావు గారి అంకుశం, బండి బుచ్చయ్య గారి ములుకోల, సూర్యదేవర రాజ్యలక్ష్మి గారి తెలుగుదేశం, వాహిని చదువుతుండే వాడు. రాజకీయ హడావుడి ఎక్కువగా ఉండేది. తెనాలినుండి జ్యోతి పక్షపత్రిక, రేరాణి, అభిసారిక వచ్చేవి. ధనికొండ హనుమంతరావు సంపాదకత్వాన అభిసారిక యువతను పెద్దలను ఆకట్టుకున్నది. మద్రాసు నుండి తెలుగు స్వతంత్ర వచ్చేది. ఆ విధంగా ఉన్నత పాఠశాలలోనే వివిధ పత్రికలు చదువుతుండడం వలన, ఆయన ప్రజావాణిలో వ్రాయడానికి అలవాటుపడ్డాడు.

పత్రికలలో పని[మార్చు]

ఇన్నయ్య విద్యాభ్యాసం చేస్తున్నపుడు అనగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రజావాణిలో ఉద్యోగంలో చేరాడు.1954 నుండి పదేళ్ళ పాటు "ప్రజావాణి"కి రాశాడు. అనేక అనువాదాలు కూడా చేశాడు. ఇన్నయ్య హఠాత్తుగా కల్లు గీత సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు కాగా, రాజమండ్రి జైలుకు పంపారు. లచ్చన్న నాయకత్వంలో జరిగిన గీత సత్యాగ్రహం, రాష్ట్రంలో మధ్య నిషేధం తొలగించాలని పోరాడి గెలిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఉద్యోగం చేశాడు. తొలుత గుంటూరువారి తోటలో అద్దెకుండేవాళ్ళు. ఇన్నయ్య తండ్రి రాజయ్య పొలాలు పోగొట్టుకుని, జబ్బు పడ్డాడు. ఇన్నయ్య ఉద్యోగం చేస్తూ జబ్బుపడ్డాడు. అయినా వారి అన్న జైలు నుండి తిరిగి వచ్చే వరకూ ప్రజావాణిలో ఉద్యోగం చేశాడు. అప్పుడు రచయితలతో, రాజకీయవాదులతో పరిచయమైంది. ప్రజావాణి రాజకీయ వారపత్రికగా ప్రభావం చూపెట్టింది. కమ్యూనిస్టు వ్యతిరేకత పత్రికలో ఉండేది. ప్రజావాణి విమర్శలకు రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు స్పందించారు. మద్దుకూరి చంద్రశేఖరరావు వంటి వారు ప్రతి విమర్శల్ని వారి పత్రికలలో రాశారు.[1]

ఆయన అన్న విజయరాజ కుమార్ తొలుత ఫార్వర్డ్ బ్లాక్ లో, తరువాత కృషి కార్ లోక్ పార్టీలో ఉండడం వలన, ఆయనకు ఆ పార్టీల వారితో పరిచయాలు కలిగాయి. జైలు నుండి విడుదలై ఆయన అన్న రాగానే, మళ్ళీ కాలేజీ చదువులు కొనసాగించగలిగాడు. అయినా రచనలు మానలేదు. ఎం.ఎన్. రాయ్ రచనలు కొన్ని అనువదించి ప్రజావాణిలో ప్రచురించాడు. 1964 వరకూ రాశారు. తరువాత ప్రజావాణికి మానేశాడు. వట్టి కొండ రంగయ్య కొన్నేళ్ళ తరువాత ప్రజావాణి నిలిపేశాడు. పార్టీలు అధికారం రాజకీయాలు అనే ఎం.ఎన్. రాయ్ వ్యాస సంపుటి, మెన్ ఐ మెట్ అనే వ్యక్తిత్వ అంచనాల రచన ప్రజావాణిలో అనువదించాడు. ఆయన రచన లేవీ సెన్సార్ కాకుండా రంగయ్య ప్రచురించి ఆయన్ని ప్రోత్సహించాడు.

తస్లిమా నస్రీన్ పై హైదరాబాదు మజ్లిస్ పార్టీకి చెందిన వారు చేసిన దాడిలో ఈయన కూడా గాయపడ్డాడు.[2]

వ్యక్తిగత విషయాలు[మార్చు]

ఇన్నయ్య వెనిగళ్ల కోమలను పెళ్లాడాడు. ఆమె అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసి పదవి విరమించింది. ఆమె ఎమ్. ఎన్.రాయ్ పుస్తకం "మెమోయిర్స్ ఆఫ్ కేట్" తెలుగులోకి అనువాదం చేసింది. ఆయన కుమారుడు రాజు నరిసెట్టి వాషింగ్టన్ పోస్ట్, మింట్, వాల్ స్ట్రీట్ జర్నల్ యూరోప్ పత్రికలలో సంపాదకుడుగా పనిచేసి ప్రస్తుతం వాల్ స్ట్రీట్ జర్నల్ డిజిటల్ మీడియా నెట్వర్క్ కు మరియు న్యూయార్క్ ప్రింటు ఎడిషన్ కు సంపాదకునిగా ఉన్నాడు. ఆయన కుమార్తె డా నవీనా హేమంత్ చిన్న పిల్లల మానసికశాస్త్ర నిపుణురాలిగా అమెరికాలో పనిచేస్తున్నది.[3]

రచనలు, ఇతరాలు[మార్చు]

 • నార్ల వెంకటేశ్వరరావు తన నాటకం నరకములో హరిశ్చంద్ర ఈయనకు అంకితమిచ్చాడు.
 • మామిడిపూడి వెంకటరంగయ్యతో ఆంధ్రలో స్వాతంత్ర్య సమరం రచించాడు
 • ఎం.ఎన్.రాయ్, ఎ.బి. షా, వి.బి.కార్నిక్, అగీహానంద భారతి, పాల్ కర్జ్ రచనలు అనువదించాడు. ప్రసారిత పత్రిక సంపాదకుడు.
 • మానవతా వాదము సంఘాలలో పనిచేసాడు. అంతర్జాతీయ పత్రికలు ఫ్రీ ఎంక్వైరర్, ఎన్‌సైక్లోపీడియా ఆన్ బిలీఫ్ లలో రాశాడు.
 1. రామ్ మోహనరాయ్ నుండి ఎమ్.ఎన్.రాయ్ వరకు 1973
 2. ఆంధ్రప్రదేశ్ లో కులరాజకీయాలు 1985
 3. వి.ఆర్.నార్ల జీవితం-అనుభవాలు 1987
 4. అబద్ధాల వేట - నిజాల బాట (2011)
 5. మనదేశంలో పూర్ణ వికాసం రాదా -డా.ఇ.ఇన్నయ్య 1990
 6. నరహంతకులు 1992
 7. చిట్కా వైద్యాలు-చిల్లరడాక్టర్లు 1998
 8. మతాల చిత్రహింసలో చిన్నారులు 2000
 9. హిందూ ముస్లిం ఐక్యత

మూలాలు[మార్చు]

 1. నరిసెట్టి, ఇన్నయ్య. "వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు (part-1)". http://telugumedianews.blogspot.in/2007/05/part-1.html. Retrieved 21 March 2016.  External link in |website= (help)
 2. "Taslima roughed up in Hyderabad - Today's Paper - The Hindu". thehindu.com. 2016 [last update]. Retrieved March 21, 2016.  Check date values in: |date= (help)
 3. "BIO-DATA INNAIAH NARISETTI" (PDF). http://tana2013.org/. Retrieved 12 May 2016.  External link in |website= (help)

బయటి లింకులు[మార్చు]