ఎర్ర శేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్ర శేఖర్
నియోజకవర్గం జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
సంతానం ఒక కుమారుడు

ఎం.చంద్రశేఖర్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను 1967, జూన్ 24 న జన్మించాడు.[1] సోదరుడు ఎర్రసత్యం మరణానంతరం జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎన్నికైనాడు.

రాజకీయ జీవనం[మార్చు]

ఎర్రశేఖర్‌గా పిలువబడే చంద్రశేఖర్ తొలిసారిగా సోదరుడు ఎర్రసత్యం మరణంతో ఖాళీ అయిన జడ్చర్ల స్థానం నుంచి 1996 ఉపఎన్నికలలో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు. ఆ తర్వాత 1999లో కూడా విజయం సాధించి వరుసగా రెండో సారి శాసనసభలో అడుగుపెట్టాడు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి చేతిలో ఓడిపోగా, 2008 ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిపై పోటీచేసి పరాజయం పొందినాడు. 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మల్లు రవిపై విజయం సాధించి మూడవసారి శాసనసభలో ప్రవేశించాడు.[2]

మూలాలు[మార్చు]

  1. సూర్య దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-05-2009
  2. Sakshi (14 July 2021). "ఆది నుంచీ అంతే: బీజేపీకి షాక్‌.. కాంగ్రెస్‌లో జోష్‌!". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.