ఏడు వారాల నగలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పూర్వము ఏడు వారాల నగలకు ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నది. ఏడువారాల నగల గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఈనాడు కూడా వాటి గురించి తెలుసుకోవడం ఆసక్తికరమే! మన పూర్వీకులు గ్రహాల అనుగ్రహము కోసము, ఆరోగ్యరీత్య స్త్రీ పురుషులు బంగారు నగలను ధరించెడివారు. వారము రోజులు అనగా ఆదివారము మొదలు శనివారము వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణములను ధరించెడివారు. వీటినే ఏడు వారాల నగలు అంటారు. గ్రహాలకు అనుకూలముగా కంఠహారములు, గాజులు, కమ్మలు, ముక్కుపుడకలు, పాపిటబిల్ల, దండెకడెము (వంకీ), ఉంగరాలు మొదలగు ఆభరణాలను ధరించెడివారు.[1]

ఏ రోజున ఏయే నగలు ధరించెడివారు[మార్చు]

ఆదివారము - సూర్యుని కోసము కెంపుల కమ్మలు, హారాలు మొదలగున్నవి.

సోమవారము - చంద్రుని కోసం ముత్యాల హారాలు, గాజులు మొదలగునవి.

మంగళవారం - కుజుని కోసం పగడాల దండలు, ఉంగరాలు మొదలగునవి.

బుధవారం - బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి.

గురువారము - బృహస్పతి కోసం పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు మొదలగునవి.

శుక్రవారం - శుక్రుని కోసము వజ్రాల హారాలు, ముక్కుపుడక మొదలగునవి.

శనివారము - శని ప్రభావం పడకుండా ఉండడం కోసం నీలమణి హారాలు మొదలగునవి.

ఇంకా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

పాటీల్ నారాయణరెడ్డి గారి ఆచారాలు శాస్త్రీయత అనుగ్రంధము నుండి తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

  1. "ఏడు వారాల నగల గురించి తెలుసా?". Retrieved 2015-09-20.[permanent dead link]