పుష్యరాగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుష్యరాగం

తెలుపు మాట్రిక్స్ పై పుష్యరాగ స్ఫటికం
సాధారణ సమాచారం
వర్గమునెసో లిలికేట్ ఖనిజాలు
రసాయన ఫార్ములాAl2SiO4(F,OH)2
ధృవీకరణ
రంగురంగులేని (మలినాలు లేనిదైతే), నీలం, గోధుమ, నారింజ, గ్రే, పసుపు, ఆకుపచ్చ, గులాబీ, ఎర్రని గులాబీ

పుష్యరాగం (ఆంగ్లం:Topaz) అనునది అల్యూమినియం, ఫ్లోరిన్ యొక్క సిలికేట్ ఖనిజం. దీని ఫార్ములా Al2SiO4 (F, OH)2. ఇది ఆర్థోమార్ఫిక్ వ్యవస్థలో స్పటికీకరణం చెందుతుంది. దాని స్ఫటికాలు ఎక్కువగా పిరమిడ్, ఇతర ముఖాలచే మూసివేయబడతాయి. ఇది సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఖనిజాలలో కఠినమైనది. ఇది ఏ ఇతర సిలికేట్ ఖనిజం కన్నా కఠినమైనది. దానియొక్క సహజ పారదర్శకత, వివిధ రంగుల కలయికతో గల దీని కఠినత్వం మూలంగా దీనిని ఆభరణాల తయారీలో, ఇతర రత్నాలను కత్తిరించడానికి ఎక్కువగా వాడుతారు.[1]

పుష్యరాగం అనునది ఒక శిల, ఇది పలు రంగులలో లభ్యమగును. దీనిని నవగ్రహాలలో గురు గ్రహానికి ప్రీతి పాత్రమైనదిగా చెపుతారు. వీటిలో అనేక రంగులున్నా తెల్లనివీ, పసుపు తెలుపూ కలగలసినవీ అత్యధికంగా వినియోగిస్తారు.

లక్షణాలు[మార్చు]

Facet cut topaz gemstones in various colors

పుష్యరాగం సహజసిద్ధంగా బంగారు గోధుమ లేక పసుపు రంగులో ఉంటుంది. కొన్ని సందర్భాలలో తక్కువ విలువ కలిగిన "సిట్రైన్" అనే రంగు రాయితో పోలిఉండటాన గుర్తుపట్టడానికి కష్టంగా ఉంటుంది.[1] పుష్యరాగ రత్నాలలో వైన్ ఎరుపు, లేత బూడిదరంగు, ఎరుపు-ఆరెంజ్, లేత ఆకుపచ్చ లేదా గులాబీ రంగు, అపారదర్శకం నుండి పారదర్శకంగా వివిధ రంగులను వాటిలో కలిపే వివిధ రకాల మలినాల (impurities) మూలంగా ఏర్పడతాయి. గులాబీ, ఎరుపు రకాలు పుష్యరాగం యొక్క నిర్మాణంలో అల్యూమినియం స్థానంలో క్రోమియం స్థానభ్రంశం చెండడం వలన ఏర్పడతాయి.

నారింజ రంగు పుష్యరాగం అతి విలువైనది. ఇది సాంప్రదాయకంగా నవంబరు నెల జన్మరత్నం. ఇది స్నేహానికి గుర్తు. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని "ఉతై" రాష్ట్రం యొక్క రాష్ట్ర రత్నం. [2]

రాజ్యసంబంధిత పుష్యరాగాలు పసుపు, గులాబీ (అరుదైనది, సహసిద్ధమైనదైతే) లేదా గులాబి-నారిజ రంగులు గలవి. బ్రెజిల్ రాజ్యసంబంధిత పుష్యరాగం ఎక్కువగా కాంతివంతమైన పసుపు నుండి గాఢ బంగారు గోధుమ రంగు కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఊదారంగు కలిగి ఉంటుంది.

పలు గోధుమ లేదా లేత పుష్యరాగాలు వాటిని ప్రకాశవంతమైన పసుపు, బంగారం, పింక్ లేదా వైలెట్ రంగులో తయారు చేయడానికి వివిధ విధానాలను అవలంబిస్తారు. కొన్ని రాజ్యసంబంధిత పుష్యరాగాలు సూర్యకాంతిలో ఎక్కువసమయం ఉంచినపుడు వాటి రంగును కోల్పోవచ్చు.[3][4]

నీలం పుష్యరాగం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన టెక్సాస్ రాష్ట్ర రత్నం. [5] సాధారణంగా నీలం పుష్యరాగం చాలా అరుదుగా లభిస్తుంది.

సాధారణంగా, రంగులేని, బూడిద రంగు లేదా లేత పసుపు, నీలిరంగు పదార్ధాలు వేడిగా భావించబడతాయి, కావలసిన ముదురు నీలం పుష్యరాగాన్ని ఉత్పత్తి చేయడానికి వికిరణాలను యిస్తాయి. [4]

ఆధ్యాత్మికంగా పుష్యరాగం రంగులేనిది. ఇది కృత్రిమంగా దానిపై ఆవిరి చేర్చే విధానంలో పూతపూయబడి ఇంధ్రధనుస్సు ప్రభావాన్ని దానిపై ఇస్తుంది.[6]

చాలా కష్టంగా ఉన్నప్పటికీ, పుష్యరాగాన్ని ఇతర ఖనిజాలు లేదా ఇదే విధమైన కఠినత్వంగల (కోరుండం వంటి) పదార్థాలతో పోలిస్తే ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. దీనికి కారణం ఆ రాయి యొక్క అణువులలోగల బలహీనమైన పరమాణు బంధాలు ఒకటి లేదా మరియొక అక్షీయ తలంపై (ఉదాహరణకు వజ్రంలో కర్బన పరమాణువులు ఒకదానికొకటి సమాన శక్తితో బంధాలను అని తలాలలో ఏర్పరచడం) ఉండటం. దీని ఫలితంగా పుష్యరాగం తగినంత బలాన్ని ఉపయోగించినపుడు పగుళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. [7]

పుష్యరాగం సాపేక్షంగా తక్కువ వక్రీభవన గుణకాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువ తలాలు కలిగిన ఈ రాళ్ళు మెరవవు. అధిక వక్రీభవన గుణకం కలిగిన ఖనిజాలలోని రాళ్ళు మెరుస్తాయి. అందువలన రంగులేని పుష్యరాగం అదే విధంగా తయారుచేయబడిన క్వార్ట్జ్ కన్నా మెరుస్తుంది. ఒక విలక్షణతతో "తెలివిగా" కత్తిరించినపుడు, పుష్పరాగము మెరుస్తున్న టేబుల్ ముఖాలు కలిగి మెరిసే కిరీటం కోణాల యొక్క వలయం చుట్టూ మెరిసే టేబుల్ కోణాన్ని చూపుతుంది.[8]

ప్రాంతాలు, లభ్యత[మార్చు]

పుష్యరాగం సాధారణంగా గ్రానైట్, రైయోలైట్ రకం గల సిలిసిక్ ఇగ్నెయస్ రాళ్ళతో కూడి ఉంటుంది. ఇది సాధారణంగా గ్రానైటిక్ పెగ్మటైట్స్ లో స్ఫటికీకరణం చెందుతుంది లేదా దక్షిణ అమెరికాలోని పశ్చిమ ఉతై ప్రాంతంలో గల పుష్యరాగ పర్వతాల వద్ద ప్రవహించే రైయోలైట్ లావాలో ఆవిరి కేవిటీలతో కలసి ఉంటుంది. ఇవి రష్యాలోని యూరల్, ల్మెన్ పర్వతాల వద్ద వివిధ ప్రాంతాలలోని ఫ్లోరైట్, కేసెటెరైట్ తో కూడి ఉంటుంది. ఇవి ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నార్వే, పాకిస్థాన్, ఇటలీ, స్వీడన్, జపాన్, బ్రెజిల్, మెక్సికో, ఫ్లిండర్స్ ద్వీపం, ఆస్ట్రేలియా, నైజీరియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా లభ్యమవుతాయి.

బ్రెజిల్ పుష్యరాగ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది.[9] బ్రెజీలియన్ పెగ్మటైట్స్ నుండి లభ్యమైన కొన్ని స్వచ్ఛమైన పుష్యరాగ స్ఫటికాలు పెద్ద పరిమాణం, వందల పౌండ్ల భారాన్ని కలిగి ఉంటాయి. ఈ పరిమాణం గల స్ఫటికాలు మ్యూజియం కలక్షన్స్ లో మనం చూడవచ్చు. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు వద్ద గల పుష్యరాగం 157.75 కారట్ల భారం ఉన్నట్లు జీన్ బాప్టిస్టు తావర్నీరు గుర్తించాడు.[10] పెద్దవి, స్పష్టమైన నీలిరంగు పుష్యరాగాల నమూనాలను జింబాబ్వే లోని సెయింట్ అన్న్స్ వద్ద 1980 చివరి భాగంలో గుర్తించారు. [11] 22,892.5 కారట్ల ఎక్కువ బరువు గల అమెరికన్ గోల్డెన్ పుష్యరాగాన్ని ఇటీవల గుర్తించారు.

రంగులేని, లేత నీలి రంగుగల రకాలు మాసొన్ కంట్రీ, టెక్సాస్ లో గల ప్రెకాంబ్రిన్ గ్రానైట్ లో కనుగొన్నారు.[12] ఆ ప్రాంతంలో వాణిజ్యపరమైన త్రవ్వకాలు జరుగుటలేదు. [13]

వ్యుత్పత్తి[మార్చు]

పుష్యరాగాన్ని ఆంగ్లంలో టోపజ్ అంటారు. "Topaz" అను పదం గ్రీకు Τοπάζιος (టొపాజియస్) లేదా Τοπάζιον (టొపాజియన్) నుండి వ్యుత్పత్తి అయినది.[14] గ్రీకు భాషలో టొపాజియస్ అనునది ఎర్ర సముద్రంలో గల గుర్తించడానికి కష్టతరంగా ఉన్న సెయింట్ జాన్స్ ద్వీపం యొక్క ప్రాచీన నామం. ప్రాచీన కాలంలో ఇక్కడ పసుపు రాళ్ళు (ప్రస్తుతం క్రిసోలిన్:పసుపురంగు ఆలివైన్ గా నమ్మకం) త్రవ్వకాలు జరిగాయి. సాంప్రదాయ యుగానికి ముందు పుష్యరాగం గురించి తెలియదు. ప్లింటీ చెప్పిన ప్రకారం ఎర్రసముద్రంలో గల ఇతిహాస ద్వీపం "టోపాజస్". ఇచ్చట మొట్టమొదట పుష్యరాగాల కొరకు మైనింగ్ జరిగింది. "టోపజ్" అనే పేరు సంస్కృత పదం तपस् "తపస్" (అర్థం "వేడి" లేదా "అగ్ని") కి సంబంధించింది.[14]

చారిత్రిక వినియోగం[మార్చు]

ఖనిజాలు, రత్నాలపై మొదటి వ్యవస్థాత్మక గ్రంథాల రచయితగా నికోలస్, 1652 లో ఈ అంశంపై రెండు అధ్యాయాలను అంకితం చేశారు.[15] మధ్య యుగంలో ఏ పసుపు రంగు రాయినైనా టోపజ్ గా వ్యవహరించేవారు. నవీన కాలంలో ఇది సిలికేట్ గా వ్యవహరించబడింది.

బైబిల్ యొక్క నవీన ఆంగ్ల అనువాదాలలో ముఖ్యంగా కింగ్ జేమ్స్ శైలిలో "టోపజ్" యొక్క ప్రస్తావన ఉంది.

అయితే సెప్టుయజింట్ అనువాదం నుండి వ్యుత్పత్తి అయిన "టోపజ్"ను పుష్యరాగంగా కాక పసుపు రాయిగా వ్యవహరించబడింది. అది పుష్యరాగం కాదు కానీ క్రిసోలైట్ అని భావింపబడింది. [16]

నమ్మకం[మార్చు]

ఒక ఇంగ్లీషు నమ్మకం ప్రకారం పుష్యరాగం పిచ్చిని పోగొడుతుంది.[17]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Karen Hurrell; Mary L. Johnson (15 December 2016). Gemstones: A Complete Color Reference for Precious and Semiprecious Stones of the World. Book Sales. p. 169. ISBN 978-0-7858-3498-4.
  2. Utah State Gem – Topaz Archived 2012-11-14 at the Wayback Machine. Pioneer.utah.gov (2010-06-16). Retrieved on 2011-10-29.
  3. Imperial Topaz Archived 2009-05-13 at the Wayback Machine, Natural History Museum of Los Angeles County
  4. 4.0 4.1 Gemstones & Gemology – Topaz Archived 2012-07-17 at the Wayback Machine, Emporia State University
  5. State Gem – Texas Blue Topaz. State Gemstone Cut – Lone Star Cut. state.tx.us
  6. Mystic Topaz, Consumer Information. Farlang.com (2008-10-30). Retrieved on 2011-10-29.
  7. Renee Newman (7 January 2015). Gem & Jewelry Pocket Guide: A traveler's guide to buying diamonds, colored gems, pearls, gold and platinum jewelry. BookBaby. p. 104. ISBN 978-0-929975-49-8.[permanent dead link]
  8. H. Dake, (16 April 2013). The Art of Gem Cutting - Including Cabochons, Faceting, Spheres, Tumbling and Special Techniques. Read Books Limited. p. 105. ISBN 978-1-4474-8480-6.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
  9. "Topaz Guide". Ayana Jewellery. Archived from the original on 2016-11-24. Retrieved November 23, 2016.
  10. Famous and Notheworthy Topazes Archived 2013-10-29 at the Wayback Machine Rao Bahadur, A Handbook of Precious Stones, Geological Survey of India
  11. "Topaz (Blue)". Cape Minerals. Archived from the original on 8 ఫిబ్రవరి 2017. Retrieved 7 February 2017.
  12. Handbook of Texas Online – Mineral Resources and Mining. Tshaonline.org. Retrieved on 2011-10-29.
  13. Mason, Texas Chamber of Commerce Web site
  14. 14.0 14.1 మూస:OEtymD
  15. A Lapidary or History of Gemstones, University of Cambridge, 1652.
  16. Farrington, Oliver (1903) Gems and Gem Minerals Archived 2013-09-11 at the Wayback Machine. Chicago. p. 119.
  17. Pettigrew, Thomas Joseph (1844) On Superstitions Connected with the History and Practice of Medicine and Surgery. Philadelphia E. Barrington and G.D. Haswell. p. 70.

బయటి లింకులు[మార్చు]