కాపు, తెలగ, బలిజ
స్వరూపం
(కాపు,నాయుడు,తెలగ నుండి దారిమార్పు చెందింది)
కాపు | |
---|---|
వర్గీకరణ | శూద్రులు |
మతాలు | హిందూమతం |
దేశం | భారతదేశం,మలేషియా |
వాస్తవ రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ |
జనాభా | 26% |
Subdivisions | తెలగ ,ఒంటరి,బలిజ |
Reservation (Education) | EWS కోటా కింద 10 శాతం రిజర్వేషన్ |
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సామాజిక వర్గమైన బలిజ,తెలగ/కాపులు, ముఖ్యముగా తెలుగు నాట ప్రముఖమైన సామాజిక వర్గము.ఈ కులము ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా లలో విస్తరించి ఉంది. ఈ కులంలో ప్రాంతాలను బట్టి అనేక పేర్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి బలిజ, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు. కాపు అనగా కాపలాదారు(watchman) అని అర్ధము[1][1] అనగా వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం అని చెప్పవచ్చు.కాపు బిరుదు నాయుడు.
చరిత్ర
- "నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంథంలో (1920) సయ్యద్ సిరాజుల్ హసన్ అనే చరిత్రకారుడు కాపుల గురించి ఈ విధంగా పేర్కొన్నాడు. ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయి కాపు, రెడ్డి, వెలమ, కమ్మ, మహారాష్ట్రలో కుంబీ, కర్ణాటకలో ఒక్కలిగ, లింగాయత్ కులాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
- మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును నాయుడుఅని సంబోధించేవారు. అందువలన కాపులు నాయుడు-కాపులు, రెడ్డి-కాపులు అని రెండు ప్రధాన వర్గాలుగా ఏర్పడ్డారు. తెలంగాణలో ఉన్న మున్నూరుకాపులు పటేల్ గా స్థిరపడ్డారు.
- ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు.[2]
- కమ్మవారు, వెలమవారు 10వ శతాబ్దములో ఏవో కారణాల వల్ల విడిపోయారు.[3] తొలుత కాపులుగా ఉన్న వీరు ఆయుధోపజీవులై కాపు కులము నుండి విడిపోయారు.[4][5]
- "....కాలచోదితమున కాకతీవరుగొల్చి కాపులెల్ల వెలమ, కమ్మలైరి".[6]
- పండితుడు బాలగోపాల్ ప్రకారం, "మున్నూరు కాపులు, బలిజలు, మరియు తెలగలు సమిష్టిగా 'కాపులు'గా సూచిస్తారు". వారు ఒకే సంఘంగా సంఘటితం కావడానికి ప్రయత్నించారు, కానీ "అది పూర్తి కావాల్సి ఉంది ".[20][21
రిజర్వేషన్లు మరియు దాని కారణాలు
- బ్రిటీష్ కాలం 1915లో, కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయి.ఆ రోజుల్లో, దళితులు మరియు గిరిజనులు మరియు 3వ కేటగిరీలో కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయి.1961లో, కాపు వెనుకబాటుతనాన్ని చూసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, కాపులకి గోచీని కలిగి లేరు, వారు రిజర్వేషన్ కలిగి ఉండాలిఅని జీవో జారీ చేసారు[7]
- సామాజిక వ్యవస్థలో, కాపులు చాలా ప్రదేశాలలో అసలైన నైపుణ్యం లేని కార్మికులు, కొంతమంది తక్కువ స్థాయి వైట్ కాలర్ ఉద్యోగాలు మరియు కొంతమంది చిరువ్యాపారులు.
- తెలంగాణాలో మున్నూరు కాపు ఉత్తరాంధ్రలో తూర్పు కాపు BC వర్గంలో చేర్చబడ్డారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బీసీలుగా ఉన్నటువంటి
తెలగ/కాపు,బలిజ,ఒంటరి కులాలను బీసీల జాబితా నుండి 1959లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయకుండానే, ఎలాంటి రిపోర్టు లేకుండానే తొలగించారు. దీనివలన కాపులు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాలలో వెనుకబాటుకు గురయ్యారు.
- మంజునాథ కమిషన్ నివేదిక ఆధారంగా నాటి ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసినా రాజకీయ కారణాల వలన నేటికీ అమలుకు నోచుకోలేదు.
కాపు-ఉప కులాలు
- తూర్పు కాపు (ఉత్తరాంధ్ర)
- కాపు (కోస్తా ఆంధ్ర)
- తెలగ(కోస్తా ఆంధ్ర)
- ఒంటరి (కోస్తా ఆంధ్ర)
- బలిజ (రాయలసీమ),(దక్షిణాంధ్ర)
- బనజిగ బలిజ (కర్ణాటక)
- తెలగ (కర్ణాటక)
- కవర బలిజ (తమిళనాడు)
- మున్నూరు కాపు (తెలంగాణా)
ప్రసిద్ధి చెందిన రాజకీయ ప్రముఖులు
- కూర్మా వెంకటరెడ్డి నాయుడు మద్రాస్ రాష్ట్ర గవర్నర్ (1936 - 1937) మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి 1937
- కూర్మా వెంకటరెడ్డి నాయుడు మద్రాస్ రాష్ట్ర గవర్నర్ (1936 - 1937) మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి 1937
- రఘుపతి వేంకటరత్నం నాయుడు, స్వాతంత్ర్య సమరయోధులు, సంఘసంస్కర్త
- కన్నెగంటి హనుమంతు, స్వాతంత్ర్య సమరయోధులు
- తోట నరసయ్య నాయుడు, స్వాతంత్ర్య సమరయోధులు
- కోడి రామ్మూర్తి నాయుడు, మల్లయోధుడు
- రఘుపతి వెంకయ్య నాయుడు, తెలుగు సినిమా పితామహుడు
- వంగవీటి రంగా,ఎమ్మెల్యే మరియు కాపు నాడు నిర్వహించారు
- ముద్రగడ పద్మనాభం,కాపు రిజర్వేషన్ల విప్లవకారుడు,మాజీ మంత్రి
- జక్కంపూడి రామ్మోహన్ రావు,మాజీ మంత్రి
వ్యాపార వేత్తలు
- పొంగూరు నారాయణ విద్యా సంస్థలు
- తోట చంద్రశేఖర్ 99tv
మూలాలు
- ↑ 1.0 1.1 https://www.google.co.in/books/edition/Maharashtra/BsBEgVa804IC?hl=en&gbpv=1&dq=kapu+means+watchman&pg=PA1495&printsec=frontcover
- ↑ దక్షిణ భారతదేశంలో కులాలు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909
- ↑ కమ్మ-వెలమ: దక్షిణ భారత కులములు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909, Castes and Tribes of Southern India
- ↑ Velugotivari Vamsavali, English Translation by N. Venkataramanaiah
- ↑ పద్మనాయక చరిత్ర; సర్వజ్ఞ సింగ భూపాల; Padmanayakacharitra, Sarvajna Singabhupala
- ↑ వెలుగోటివారి వంశావళి, నేలటూరి వెంకటరమణయ్య
- ↑ "'బాబు గారూ ఆనాడు కాపు ఆందోళనకు మద్దతిచ్చారు..మరి డబ్బెంత ఇచ్చారు?'". BBC News తెలుగు. 2017-12-21. Retrieved 2023-09-12.