కామాక్షి అమ్మవారి దేవాలయం, కంచి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కామాక్షి అమ్మవారి దేవాలయం కంచి లో ఉన్న ప్రముఖ దేవాలయం. కాంచీపురం, కాంజీవరం, కంచి  వంటి పేర్లతో పిలిచే ఈ నగరం చారిత్రకంగా ప్రసిద్ధి  చెందిన పవిత్ర నగరాల్లో ఒకటి.  మధురై లోని  మీనాక్షి అమ్మవారి ఆలయంతిరుచిరాపల్లి సమీపంలోని తిరువనైకవిల్ అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం, కంచి కామాక్షమ్మ దేవాలయం తమిళనాట  పేరు పొందిన అమ్మవారి ఆలయాలు. కంచి అనగా మొల చూల వడ్డాణం అని అర్ధం, ఈ ఆలయాన్ని కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవ రాజులు కట్టించివుండవచ్చు. ఇది అమ్మవారి అష్టాదశ 18 శక్తి పీఠాలలో ఒకటి [1], అమ్మ వారి నాభి భాగం ఇక్కడ ఉన్నది అని ప్రతీతి .ఇక్కడ అమ్మవారు పద్మాసనం తో యోగ ముద్రలో ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత . ఇది ఐదు ఎకరాల స్థలంలో , నాలుగు విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తటాకముతో విస్తరించబడినది . [2] ఈ దేవాలయము సమీపాన వరాహ రూపమైన మహావిష్ణు (తిరు కాల్వనూర్ దివ్యదేశ ) దేవాలయం ఉండేది గుడి శిధిలం కావటం వలన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునః ప్రతిష్టించారు. ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రీ మండపం , అరూపలక్ష్మి , స్వరూపాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. అమ్మ వారి విగ్రహం ముందు ఉగ్రరూపంనుండి శాంత పరచటానికి , జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది.[3]

కంచి కామాక్షి దేవాలయం
కంచి కామాక్షి దేవాలయం

కామాక్షి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం, దాని తరువాత వచ్చిన శంకరా చార్యులతో తో దగ్గరి సంబంధం ఉంది. ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర యొక్క గ్యాలరీ ఉంది. కామాక్షి దేవత ప్రధాన దేవత, ఈ ఆలయం యాభై ఒకటి శక్తి పీఠాలలో ఒకటి.

అమ్మవారి విగ్రహ స్వరూపం[మార్చు]

కామాక్షి అమ్మవారి విగ్రహం
కామాక్షి అమ్మవారి విగ్రహం

అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు , పద్మాసన భంగిమ లో యోగ ముద్రలో ఉంటారు . తన ఎడమ చేతిలో చెరకు గడ ,చిలుకను తన కుడి చేతిలో పట్టుకుంది. దేవత తన చేతుల్లో పాశ , అంకుశాన్ని ధరించి ఉంటారు .

ఆలయ చరిత్ర[మార్చు]

శివుడిని వివాహం చేసుకోవడానికి కామక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతి యొక్క దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడు

ఉత్సవములు[మార్చు]

ఆలయంలో ప్రతి రోజు నాలుగు ఆరాధన సేవలు అందిస్తారు. వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు మాసి తమిళ మాసం వసంతకాలం లో వస్తుంది. ఈ సమయంలో రథోత్సవం , తెప్పోత్సవం జరుగుతాయి. అంతేకాక తమిళ మాసమైన వైకాసిలో నవరాత్రి, ఆడి, ఐపాసి మాసంలో , శంకర జయంతి ,వసంత ఉత్సవాలు జరుగుతాయి.

మూలాలు[మార్చు]

  1. "Sri Kanchi Kamakshi Amman Temple". www.kanchikamakshi.com. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  2. "Sri Kanchi Kamakshi Amman Temple". www.kanchikamakshi.com. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  3. "About the Peetham". www.kamakoti.org. Archived from the original on 2020-05-12. Retrieved 2020-06-08.