కైత్లాపూర్ ఫ్లై ఓవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కైత్లాపూర్‌ ఫ్లై ఓవర్‌ హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కైత్లాపూర్‌ నుంచి మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ వరకు నూతనంగా కైత్లాపూర్‌ ఫ్లైఓవర్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.

నిర్మాణ వివరాలు[మార్చు]

కూకట్‌పల్లి నియోజకవర్గంలో కైత్లాపూర్‌ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు రూ.83.06 కోట్లు వ్యయంతో 675.50 మీటర్ల పొడవులో, 46 మీటర్ల మేర రైల్వే స్పాన్‌, 16.61 మీటర్లలో నాలుగు లేన్ల బై డైరెక్షనల్‌లో 5.50 మీటర్లలో సర్వీస్‌ రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి రైల్వే పనులకు గాను రూ.18.06 కోట్లు, భూ సేకరణకు రూ.25 కోట్లు, నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ రూ.40 కోట్లు ఖర్చు పెట్టారు.[1] పాదచారులు వంతెన దాటేందుకు వీలుగా ప్రత్యేక మెట్లు, సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు.

కైత్లాపూర్‌ ఆర్‌వోబీతో బోయిన్‌పల్లి, బాలానగర్‌, ఎర్రగడ్డ, మూసాపేట, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాలకు సాఫీగా ప్రయాణం సాగనుంది. దీంతో జేఎన్టీయూ మీదుగా హైటెక్ సిటీ ఫ్లై ఓవర్‌ మీదుగా వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవడంతో మలేషియా టౌన్‌షిప్‌ జంక్షన్‌, హైటెక్‌ సిటీ ఫ్లై ఓవర్‌, సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది.[2][3] కైత్లాపూర్‌ ఫ్లైఓవర్ నిర్మాణంతో సనత్ నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 4 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గింది.

ప్రారంభం[మార్చు]

కైతలాపూర్ ఫ్లై ఓవర్‌ను 2022 జూన్ 21న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.హెచ్. మల్లారెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గౌడ్, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు,సురభి వాణి దేవి, కె. నవీన్ రావు, తెలంగాణ స్టేట్‌ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ పాటిమీది జగన్ మోహన్ రావు, జోనల్ కమిషనర్ వి.మమతా, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.[4]

మూలాలు[మార్చు]

  1. Eenadu (6 May 2022). "నిమిషాల్లో ఓఆర్‌ఆర్‌పైకి". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  2. Namasthe Telangana (28 May 2022). "కైత్లాపూర్‌ ఆర్వోబీ రెడీ..!". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  3. Namasthe Telangana (27 May 2022). "ఆర్‌వోబీతో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ : ఎమ్మెల్యే కృష్ణారావు". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  4. Namasthe Telangana (21 June 2022). "కైతలాపూర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". Archived from the original on 21 June 2022. Retrieved 21 June 2022.