దక్షిణ అమెరికాలో హిందూమతం
దక్షిణ అమెరికా ఖండంలో హిందూ మతం మైనారిటీ మతం. మొత్తం ఖండంలోని జనాభాలో 1% కంటే తక్కువ మంది హిందూమతాన్ని అనుసరిస్తున్నారు. హిందూ మతం అనేక దేశాలలో ఉన్నప్పటికీ, గయానా, సురినామ్‌ల లోని ఇండో-కరేబియన్ జనాభాలో బలంగా ఉంది. దక్షిణ అమెరికాలో దాదాపు 3,20,000 మంది హిందువులు ఉన్నారు. ప్రధానంగా గయానా ల్లోని భారతీయ ఒప్పంద కార్మికుల వారసులు ఉన్నారు. గయానాలో దాదాపు 1,85,000 మంది, సురినామ్‌లో 1,20,000 మంది, ఫ్రెంచ్ గయానాలో కొంతమందీ హిందువులున్నారు. గయానా, సురినామ్‌లలో, హిందూమతం రెండవ అతిపెద్ద మతం. కొన్ని ప్రాంతాలు, జిల్లాలలో, హిందువులే మెజారిటీగా ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో, హిందూ సంస్కృతి ప్రభావం కారణంగా, బ్రెజిల్, అర్జెంటీనా, వెనిజులా తదితర దక్షిణ అమెరికాలోని ఇతర దేశాల్లో హిందువుల సంఖ్య పెరిగింది.
దేశం వారీగా హిందూమతం
[మార్చు]అర్జెంటీనా
[మార్చు]అర్జెంటీనాలో 2,030 మంది భారతీయ మూలాలు కలిగినవారు, 1,300 మంది ప్రవాస భారతీయులూ ఉన్నారు. వారిలో కొందరు ఇప్పటికీ ఆయుర్వేదాన్ని అనుసరిస్తారు, యోగాను అభ్యసిస్తారు, భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదిస్తారు.
వారు ఉత్తర ప్రావిన్సులలో భారతీయ సంఘాన్ని [1] స్థాపించారు. భారతీయ పండుగలను జరుపుకోవడం, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం చేస్తారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడిన వారికీ, వీరికీ మధ్య పరస్పర సంబంధాలు పెద్దగా లేవు.
చాలా మంది హిందువులు గయానా, జమైకా, ట్రినిడాడ్ టొబాగో, సురినామ్ ల నుండి వలస వచ్చిన ఇండో-కరేబియన్లు .
2015లో దాదాపు 34,460 [2] హిందువులు (దేశ జనాభాలో 0.08%) ఉన్నారు.
బ్రెజిల్
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, బ్రెజిల్ జనాభాలో 0.005% మంది (9,500 మంది) హిందువులు ఉన్నారు. బ్రెజిలియన్ హిందువులలో అత్యధికులు ఈస్ట్ ఇండియనులు. అయితే, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ప్రభావం కారణంగా కొంతమంది మతం మారారు.
1960లో సురినామ్, మధ్య అమెరికాల నుండి మనౌస్ నగరంలో వ్యాపారులుగా దుకాణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కొద్ది సంఖ్యలో సింధీలు వలస వచ్చారు. వీరే మొదటి తరానికి చెందిన హిందువులు. రెండవ తరంగంలో 1960, 1970లలో వచ్చిన విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఉన్నారు.
చిలీ
[మార్చు]1920లలో కొంతమంది భారతీయులు చిలీకి వెళ్లారు. మిగిలిన వారు 30 ఏళ్ల క్రితం అక్కడికి వలస వెళ్ళారు. భారతదేశం నుండి మాత్రమే కాకుండా, ట్రినిడాడ్ టొబాగో, గయానా, సురినామ్, హాంకాంగ్, ఇండోనేషియా, నైజీరియా, పనామా, ఫిలిప్పీన్స్, సింగపూర్ నుండి కూడా వీరు వలస వెళ్ళారు.
చిలీలో 1400 పైచిలుకు హిందువులున్నారు. వీరిలో 400 మంది (90 కుటుంబాలు) రాజధాని నగరం శాంటియాగోలో నివసిస్తున్నారు. [3]
చిలీ హిందువుల్లో ఎక్కువ మంది సింధీలు. పుంటా అరేనాస్‌లో సింధీ, స్పానిష్ భాషలలో సేవలను అందించే హిందూ దేవాలయం ఉంది. [4]
పుంటా అరేనాస్‌తో పాటు, చిలీ రాజధాని శాంటియాగో లోను, ఇక్విక్ లోనూ భారతీయ వ్యాపారులున్నారు. శాంటియాగోలోని వ్యాపారవేత్తల కార్యకలాపాలు ప్రధానంగా దిగుమతులు, రిటైల్ దుకాణాలకు మాత్రమే పరిమితమయ్యాయి.
కొలంబియా
[మార్చు]కొలంబియాలో హిందూమతం ప్రధానంగా భారతీయుల రాకతో పరిచయం అయింది. ముఖ్యంగా ట్రినిడాడ్ టొబాగో, గయానా, సురినామ్ నుండి వచ్చిన భారతీయ వలస కార్మికులు ఇక్కడీ హిందూమతాన్ని తీసుకువచ్చారు. హిందూమతం కొలంబియాలో ప్రధానంగా అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘ సభ్యులు, భారతీయ ప్రవాసులూ ఆచరిస్తున్నారు. రాజధాని బొగోటాలో ఇస్కాన్ కేంద్రాలు ఉన్నాయి. [5] దేశంలోని 20 నగరాల్లో కూడా ఇస్కాన్‌కు దేవాలయాలు ఉన్నాయి. [6] ఈ సంఘంలో సుమారు 700 మంది సభ్యులు ఉన్నారు. [7]
ఫ్రెంచ్ గయానా
[మార్చు]ఫ్రెంచ్ గయానాలోని చాలా మంది హిందువులు సురినామ్ మూలానికి చెందినవారు. 2000 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 1.6% (2,02,000లో 3,200) హిందువులు. [8]
గయానా
[మార్చు]ఈస్ట్ ఇండీస్ వలసదారుల్లో దాదాపు 84% మంది హిందువులు. ఒప్పంద కార్మిక వ్యవస్థ కాలంలో, ఈస్ట్ ఇండీస్ కుల వ్యవస్థ విచ్ఛిన్నమైంది. క్రైస్తవ మిషనరీలు 1852లో, కార్మిక ఒప్పందాలకు లోబడి ఉన్న తూర్పు భారతీయుల మతం మార్చడానికి ప్రయత్నించారు గానీ పెద్దగా విజయం సాధించలేదు. మిషనరీలు తమ వైఫల్యానికి బ్రాహ్మణులే కారణమని భావించారు: క్రైస్తవ మిషనరీలు గ్రామాలలో మతమార్పిడి చేయడం మొదలుపెట్టాక, బ్రాహ్మణులు కులంతో సంబంధం లేకుండా హిందువులందరికీ ఆధ్యాత్మిక ఆచారాలను నిర్వహించడం ప్రారంభించారు. 1930ల తరువాత, హిందూ మతపు స్థితి మెరుగుపడినందున, హిందువులపై వివక్ష తగ్గినందున క్రైస్తవ మతంలోకి హిందూ మతమార్పిడులు మందగించాయి.
పరాగ్వే
[మార్చు]2002 జనాభా లెక్కల ప్రకారం, పరాగ్వేలో దాదాపు 551 మంది హిందువులు నివసిస్తున్నారని అంచనా వేసారు. పరాగ్వే జనాభాలో ఇది 0.01%. భారతదేశంలో పరాగ్వే రాయబారి, జెనారో విసెంటే పప్పలార్డో, పంజాబ్ రైతులకు తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలను కలిగించాడు. [9] రాజధాని అసున్సియోన్‌లో చాలామంది హిందువులు నివసిస్తున్నారు.
పెరూ
[మార్చు]పెరూకు వచ్చిన మొదటి 'భారతీయ భారతీయులు' 1960ల ప్రారంభంలో అక్కడికి వెళ్ళిన వ్యాపారవేత్తలు. [10] తరువాత, 80ల ప్రారంభం వరకు సంఘం సంఖ్య స్వల్పంగా పెరిగింది, ఆ తర్వాత తీవ్రమైన స్థానిక ఆర్థిక సంక్షోభాలు, ప్రబలంగా ఉన్న తీవ్రవాదం కారణంగా చాలా మంది సభ్యులు విడిచిపెట్టారు. ఇతర లాటిన్ దేశాలలో బంధువులు ఉన్నవారు వారితో చేరారు.
స్థానిక భారతీయ సమాజంలో ఎక్కువ మంది సభ్యులు సింధీలు. వారు డబ్బున్నవారు, కానీ చాలా కొద్దిమంది మాత్రమే సంపన్నులుగా పరిగణించబడతారు. వారి సాధారణ విద్యా స్థాయి తక్కువ. వీరిలో చాలా మంది తమ మాతృభాష, స్పానిష్ మాత్రమే మాట్లాడతారు, ఇంగ్లీషులో చాలా తక్కువగా మాట్లాడతారు.
ఉరుగ్వే
[మార్చు]ఉరుగ్వేలో కొన్ని యోగా సంస్థలు ఉన్నాయి. ఇవి భారతీయ ఆలోచనలను, తత్వాన్నీ వ్యాప్తి చేస్తాయి. వాటిలో ప్రముఖమైనవి, డివైన్ సొసైటీకి చెందిన శివప్రేమానంద ఆశ్రమం. మోంటెవీడియోలోని బీచ్‌లో కొంత భాగానికి మహాత్మా గాంధీ పేరు పెట్టారు. బీచ్ వెంబడి ఉన్న ఒక పార్కులో గాంధీజీ ప్రతిమను ఏర్పాటు చేశారు. మాంటెవీడియోలో గాంధీ పేరు మీద ఒక పాఠశాల, ఒక వీధి, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా పేరుతో మరొక పాఠశాల ఉన్నాయి. [11] ఉరుగ్వేలో సుమారు 300 మంది సభ్యులతో కూడిన ఒక చిన్న భారతీయ సంఘం ఉంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Indian Associations in Argentina". Ministry of Overseas Indian Affairs. Archived from the original on 2009-06-05. Retrieved 2022-03-21.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Argentina, Religion and Social Profile". thearda.com. Archived from the original on 2021-04-13. Retrieved 2022-03-21.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Chile, Biblioteca del Congreso Nacional de (2008-10-09). "Bharat Dadlani: "La comunidad hindú de Chile se siente como en casa" - Programa Asia Pacifico". Observatorio Asiapacifico (in స్పానిష్). Retrieved 2019-08-29.
- ↑ "Keeping cultures alive: Sindhis and Hindus in Chile". Hindustan Times (in ఇంగ్లీష్). 2015-08-02. Retrieved 2019-08-29.
- ↑ "ISKCON Back In Bogotá". Archived from the original on 2012-03-07. Retrieved 2022-03-21.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Press, Europa (2016-02-27). "Los hare krishna, el movimiento religioso que se está expandiendo en Colombia". www.notimerica.com. Retrieved 2020-11-17.
- ↑ "Salderrío - Miran el cielo con distintos ojos". Salderrío (in యూరోపియన్ స్పానిష్). Archived from the original on 2019-03-28. Retrieved 2020-11-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "French Guiana". Archived from the original on 2007-05-04.
- ↑ "Trade Headlines". www.sme.in. Retrieved 2021-06-14.
- ↑ "Religions in Peru | PEW-GRF". www.globalreligiousfutures.org. Archived from the original on 2021-06-24. Retrieved 2021-06-14.
- ↑ "Foreign relations of India and Urugauy" (PDF). MHA, India. Retrieved 14 June 2016.
{{cite web}}
: CS1 maint: url-status (link)