Jump to content

ఖాకీవనం

వికీపీడియా నుండి
ఖాకీవనం
కృతికర్త: కె.ఎన్.వై.పతంజలి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: నవల
ప్రచురణ: చతుర మాసపత్రిక, మనసు ఫౌండేషన్
విడుదల: 1980

ఖాకీవనం నవలను ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, నిర్వాహకుడు కె.ఎన్.వై.పతంజలి రచించారు.

రచన నేపథ్యం

[మార్చు]

ఖాకీవనం ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు కె.ఎన్.వై.పతంజలి తొలి నవల. ఈ నవల చతుర మాసపత్రిక 1980 నవంబరు సంచికలో మొదట ముద్రణ పొందింది. 2012 నవంబరులో మనసు ఫౌండేషన్ ప్రచురించిన పతంజలి సాహిత్యం తొలిసంపుటంలో చోటుచేసుకుంది.
ఈ నవలలోని వివరాలలో అధికభాగం వివిధ దిన, వారపత్రికల నుండి సేకరించిన యదార్థాలే గానీ కల్పితాలు కావని రచయిత పేర్కొన్నారు. ఈ అంశాన్ని గురించి చెప్తూ నవలలోని కథ సౌలభ్యం కోసం తెలుగు దేశంలోనే జరిగినట్లుగా వ్రాయబడింది. పాత్రలను కూడా తెలుగువారిగానే పరిచయం చేయటం జరిగింది... అయితే. వాస్తవంలో ఈ కథ తెలుగు దేశానికే పరిమితం కాదు. భారతదేశంలో ఎక్కడనయినా ఈ సంఘటనలు జరిగి ఉండవచ్చు. పాత్రలు ఏ ప్రాంతానివైనా కావచ్చు అంటారు గ్రంథకర్త నవల చివర ప్రచురించిన నోట్ లో.[1]

అంకితం

[మార్చు]

ఖాకీవనం నవలను రచయిత కె.ఎన్.వై.పతంజలి తన గురువులు అని పేర్కొంటూ శ్రీశ్రీ, చాసో, రావిశాస్త్రిల దివ్యస్మృతికి అంకితం ఇచ్చారు.

రచయిత గురించి

[మార్చు]

ప్రధాన వ్యాసం: కె.ఎన్.వై.పతంజలి కె.ఎన్.వై.పతంజలి (29.3.1952 - 11.3.2009) ప్రముఖ రచయిత, సంపాదకుడు. ఆయన పలు నవలలు, కథలు, అనువాద రచనలు, సంపాదకీయాలు, వ్యాసాలు, ఇతరేతర ప్రక్రియలు చేపట్టిన బహు గ్రంథకర్త. ఈనాడు, ఉదయం, సాక్షి వంటి వివిధ పత్రికల్లో ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పలు హోదాల్లో పనిచేశారు. స్వయంగా పతంజలి పత్రిక అనే దినపత్రికను కొన్నాళ్లు నిర్వహించారు.

ఇతివృత్తం

[మార్చు]

ఖాకీవనం నవల పోలీసు వ్యవస్థ వల్ల పోలీసులు, సామాన్యులు ఎదుర్కొనే ఇబ్బందులను ఇతివృత్తంగా స్వీకరించింది. ఉన్నతాధికారుల ఇళ్లవద్ద ఆర్డర్లీ పేరిట పనిచేసే కానిస్టేబుళ్ళు, ఎదురు చెప్పడానికి వీల్లేకుండా ఉన్నతాధికారి మాటను ఔదల దాల్చవలసిన కానిస్టేబుళ్ళు ఎదురుతిరిగి వ్యవస్థపై తిరుగుబాటు చేయడం ముఖ్య కథాంశం. ఈ నవలలోని వివరాలు దిన, వార పత్రికల్లోనించి స్వీకరించిన యదార్థాలని రచయిత స్వయంగా చెప్పుకున్నారు.[2]

మూలాలు

[మార్చు]
  1. పతంజలి సాహిత్యం:కె.ఎన్.వై.పతంజలి:మనసు ఫౌండేషన్ ప్రచురణ:పే.74
  2. పతంజలి సాహిత్యం:కె.ఎన్.వై.పతంజలి: మనసు ఫౌండేషన్ ప్రచురణ:ఖాకీవనం నవల చివరి నోట్:పేజీ.74
"https://te.wikipedia.org/w/index.php?title=ఖాకీవనం&oldid=2984724" నుండి వెలికితీశారు