Jump to content

గవర్నమెంట్ సిటీ కాలేజీ, హైదరాబాద్

వికీపీడియా నుండి
గవర్నమెంట్ సిటీ కాలేజీ, హైదరాబాద్
రకంపబ్లిక్ యూనివర్సిటీ
స్థాపితం1921
వ్యవస్థాపకుడుమీర్ ఉస్మాన్ అలీ ఖాన్
అనుబంధ సంస్థఉస్మానియా యూనివర్సిటీ
స్థానంహైదరాబాద్, తెలంగాణ, తెలంగాణ, భారతదేశం India
కాంపస్6 ఎకరాలు
జాలగూడుhttps://gdcts.cgg.gov.in/charminar.edu
'B++' లెవెల్ న్యాక్ గుర్తింపు

గవర్నమెంట్ సిటీ కాలేజీ హైదరాబాద్ లో నిర్మించిన చరిత్రాత్మకమైన భవనాల్లో ఒకటి. అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా కలిగిన ఈ కళాశాలలో డిగ్రీ, పీజి కోర్స్ లను బోధిస్తారు. గవర్నమెంట్ సిటీ కాలేజీ నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ ద్వారా 'B ++' గ్రేడ్‌తో గుర్తింపు పొందింది. ఈ కళాశాలకు విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) 2017-18 సంవత్సరం నుంచి 2025-26 వరకు అటానమస్ హోదా కల్పించింది. గవర్నమెంట్ సిటీ కాలేజీ 1921, అక్టోబరు 5న నిర్మితమై 2021తో వందేళ్లు పూర్తి చేసుకుంది.[1][2] సిటీ కాలేజీ ప్రస్థానం పాఠశాల నుంచి ప్రారంభమై దశల వారీగా పీజీ కాలేజీ స్థాయికి చేరింది.[3]హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా) చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

చరిత్ర

[మార్చు]

సిటీ కాలేజీ భవన నమూనాను ప్రఖ్యాత బ్రిటీష్‌ ఆర్కిటెక్టు, ఉస్మానియా ఆస్పత్రి భవన రూపశిల్పి విన్సెంట్‌ హెచ్‌ రూపొందించాడు. భవన నిర్మాణానికి చీఫ్‌ ఇంజనీరుగా నవాబ్‌ ఖాన్‌ బహదూర్‌ మిర్జా అక్బర్‌ బేగ్‌ విధులు నిర్వహించాడు. నిజాం మహబూబ్ అలీ ఖాన్, హైదరాబాద్ అసఫ్ జా VI 1865 లో "మదర్సా దార్-ఉల్-ఉలూమ్" పేరుతో మొదట ఇక్కడ పాఠశాలను స్థాపించాడు, ఆయన తరువాత నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, అసఫ్ జా VII దీనిని సిటీ హై స్కూల్‌గా మార్చారు. 1921లో పాఠశాల ప్రస్తుత భవనంలోకి మారింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 30 మంది విద్యార్థులతో ఇంటర్మీడియట్ విభాగాలు (FA) 1921లో ఉర్దూ బోధనా మాధ్యమంగా ఉన్నత పాఠశాల పర్యవేక్షణలో ప్రవేశ పెట్టారు. 1929లో పాఠశాల కళాశాలగా అప్‌గ్రేడ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబందంగా దీనికి "సిటీ కాలేజ్" అని పేరు పెట్టారు.

సిటీ కాలేజ్ లో చదివిన ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (6 October 2021). "ఘనంగా సిటీ కళాశాల శతాబ్ది ఉత్సవాలు". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  2. Andrajyothy (6 October 2021). "విజ్ఞాన వనం..వందేళ్ల సిటీ కళాశాల". Archived from the original on 7 October 2021. Retrieved 7 October 2021.
  3. Telangana Today (2 September 2021). "Hyderabad's iconic City College building turns 100". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.