గుర్కీరత్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుర్కీరత్ సింగ్ మాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గుర్కీరత్ రూపిందర్ సింగ్ మాన్
పుట్టిన తేదీ (1990-06-29) 1990 జూన్ 29 (వయసు 33)
ముక్త్‌సర్, పంజాబ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 209)2016 జనవరి 17 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2016 జనవరి 23 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011–ప్రస్తుతంపంజాబ్
2012–2017కింగ్స్ XI పంజాబ్
2018ఢిల్లీ డేర్‌డెవిల్స్
2019–2020రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2021కోల్‌కతా నైట్ రైడర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ ట్వంటీ20
మ్యాచ్‌లు 3 49 77 87
చేసిన పరుగులు 13 2,942 2,703 1,386
బ్యాటింగు సగటు 6.50 43.91 46.60 22.00
100లు/50లు 0/0 6/18 3/21 0/6
అత్యుత్తమ స్కోరు 8 201* 108 93*
వేసిన బంతులు 60 3,515 1,151 168
వికెట్లు 0 41 26 6
బౌలింగు సగటు 44.90 35.26 35.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/38 5/29 2/15
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 23/– 28/– 40/3
మూలం: Cricinfo, 2019 మే 5

గుర్కీరత్ సింగ్ మాన్, పంజాబ్ రాష్ట్రానికి చెందిన క్రికెటర్.[1] దేశీయ క్రికెట్‌లో పంజాబ్ తరపున ఆడుతున్నాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, ఆఫ్ బ్రేక్ బౌలర్ గా రాణించాడు. ఐపిఎల్ లో గుజరాత్ టైటాన్స్ సభ్యుడిగా, భారతదేశం ఎ జట్టులో సాధారణ ఆటగాడిగా ఉన్నాడు. 2015లో దక్షిణాఫ్రికా సిరీస్‌కి అధికారిక భారత జట్టు కోసం సింగ్‌కు తొలిసారిగా పిలుపువచ్చింది.[2][3] 2016, జనవరి 17న ఆస్ట్రేలియాపై భారతదేశం తరపున తన వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[4]

జననం[మార్చు]

గుర్కీరత్ సింగ్ మాన్ 1990, జూన్ 29న పంజాబ్ రాష్ట్రంలోని ముక్త్‌సర్ పట్టణంలో జన్మించింది.

దేశీయ క్రికెట్[మార్చు]

గురుకీరత్ భారత దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ తరపున ఆడుతున్నాడు. దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీలలో నార్త్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

2014, డిసెంబరు 24న పంజాబ్‌కు ఆడుతున్నప్పుడు, 4వ రోజు విజయం కోసం 205 పరుగులను ఛేదించే సమయంలో తన జట్టును విజయతీరాలకు చేర్చేందుకు అజేయంగా 73 పరుగులు చేశాడు.[5] కర్ణాటకపై ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రెండో సెంచరీ (201 పరుగులు) చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు ఇది.[6]

2014 ఆగస్టు 14న ఆస్ట్రేలియా ఎతో జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్‌లో 81 బంతుల్లో అజేయంగా 87 పరుగులు చేసి తన జట్టును టైటిల్‌కి చేర్చాడు. 82/5 వద్ద పోరాడుతున్న భారతదేశం ఎ లో బ్యాటింగ్‌కి వెళ్ళి, మ్యాచ్ గెలవడానికి ఇంకా 145 పరుగులు చేయాల్సిఉంది. అతడు నాక్‌లో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు.[7]

బంగ్లాదేశ్ ఎ జట్టుపై తన మంచి ఫామ్‌ను కొనసాగించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 59 బంతుల్లో 65 పరుగులు చేసి భారతదేశం ఎ జట్టు 300 దాటడానికి సహాయం చేశాడు. అదే మ్యాచ్‌లో బౌలింగ్‌లో బంగ్లాదేశ్ ఎ 226 పరుగులకు కట్టడి చేయడంలో ఐదు వికెట్లు తీశాడు. 5/29 లిస్ట్ ఎ క్రికెట్‌లో తన అత్యుత్తమ రికార్డు.[8]

2018 జూలైలో 2018–19 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా గ్రీన్ జట్టులో ఎంపికయ్యాడు.[9]2018-19 విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ తరపున ఆరు మ్యాచ్‌లలో 295 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[10]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

బంగ్లాదేశ్ ఎ టీమ్‌పై అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత 15 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు. 2016 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు జట్టులో ఎంపికయ్యాడు.[11]

గుర్కీరత్ సింగ్ మాన్ మెల్‌బోర్న్‌లో జరిగిన 2016 సిరీస్‌లోని మూడవ వన్డేలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై తన వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[12]

ఇండియన్ ప్రీమియర్ లీగ్[మార్చు]

2012 నుండి 2017 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడాడు. 2012 ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఫినిషర్‌గా ఆడుతాడు. ఒక లీగ్ గేమ్‌లో పూణే వారియర్స్ ఇండియాకు చెందిన రాస్ టేలర్‌ను అవుట్ చేయడానికి అతని క్యాచ్ ఐపిఎల్ 2013 కొరకు టోర్నమెంట్ క్యాచ్‌గా ఓటు వేయబడింది.[13]

2018 జనవరిలో 2018 ఐపిఎల్ వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొనుగోలు ఇతన్ని చేసింది.[14] 2018 డిసెంబరులో 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ప్లేయర్ వేలంలో అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.[15][16]

2021 ఏప్రిల్ లో మోకాలి గాయం కారణంగా మొత్తం 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు దూరంగా ఉన్న రింకు సింగ్ స్థానంలో ఇతన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.[17][18] 2022 ఫిబ్రవరిలో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో గుజరాత్ టైటాన్స్ అతనిని కొనుగోలు చేసింది.[19]

మూలాలు[మార్చు]

  1. "Gurkeerat Singh Mann". Cricinfo. Retrieved 2023-08-15.
  2. "Kings XI Punjab Squad". Cricinfo. Retrieved 2023-08-15.
  3. "All you want to know about Gurkeerat Singh Mann". Times of India. Retrieved 2023-08-15.
  4. "India tour of Australia, 3rd ODI: Australia v India at Melbourne, Jan 17, 2016". ESPNcricinfo. ESPN Sports Media. 17 January 2016. Retrieved 2023-08-15.
  5. "Gurkeerat, Seamers Fashion Punjab Victory". ESPNcricinfo. Retrieved 2023-08-15.
  6. "Karnataka win despite Gurkeerat 157". ESPNcricinfo. Retrieved 2023-08-15.
  7. "Gurkeerat, Spiners take India to Title". ESPNcricinfo. Retrieved 2023-08-15.
  8. "Gurkeerat Singh fifty and Five-for help India A win". ESPNcricinfo. Retrieved 2023-08-15.
  9. "Samson picked for India A after passing Yo-Yo test". ESPN Cricinfo. 23 July 2018. Retrieved 2023-08-15.
  10. "Vijay Hazare Trophy, 2016/17 - Punjab: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2023-08-15.
  11. "Gurkeerat Singh picked for South Africa ODI series". Times of India. Retrieved 2023-08-15.
  12. "Kohli Ton Drives India to 295/6 in 3rd ODI". The New Indian Express. Retrieved 2023-08-15.
  13. "Final: Chennai Super Kings v Mumbai Indians at Kolkata, May 26, 2013 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2023-08-15.
  14. "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 2023-08-15.
  15. "IPL 2019 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 2023-08-15.
  16. "IPL 2019 Auction: Who got whom". The Times of India. Retrieved 2023-08-15.
  17. "IPL 2021: Gurkeerat Mann replaces injured Rinku Singh at Kolkata Knight Riders". Hindustan Times. Retrieved 2023-08-15.
  18. "IPL 2021: KKR's Rinku Singh ruled out with knee injury; replacement announced". CricketTimes.com. Retrieved 2023-08-15.
  19. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 2023-08-15.

బయటి లింకులు[మార్చు]