గోవిందపురం (సంతకవిటి)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,382 - పురుషుల సంఖ్య 693 - స్త్రీల సంఖ్య 689 - గృహాల సంఖ్య 342

మూలాలు[మార్చు]

గోవిందపురం[మార్చు]

శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలానికి చెందిన గ్రామము.[1] గోవిందపురం . ఈ గ్రామములోని గోవర్ధనగిరి (సంతకవిటి) కొండపై గోవర్ధనగిరిధారి యైన శ్రీక్రుష్ణుడు నివాసముండేవాడని పురాణాలవలన తెలుస్తుంది .ప్రతిసంవత్సరము కనుమనాడు ఇక్కడ జాతర జరుగుతుంది .పూర్వము కేవలము కొండమీద చిన్నపాటి దేవాలయము తోపాటు కొండదిగివునున్న గుహలోని గోవిందస్వామి విగ్రహవు మాత్రమే వుండేవి . ఇప్పుడిది కలాత్మకమైన శిళ్పాలతో సుందరముగా తీర్చి అభివృద్ధి చేయడం జరిగినది . చుట్టుప్రక్క గ్రామాలైన ముకుందాపురమ్,ఛిన్నముకుందాపురమ్,మోదుగులపేట,మందరాడ,అక్కరాపల్లి,కాకరాపల్లి,ఛిన్నయ్యపేట,ఛిన్తలపేట,సాలిపేట,మిర్తివలస,పోతురాజుపేట,మండాకురిటి,సురవరం,మామిడిపల్లి, గ్రామాలనుంచి ప్రజలు విశేసముగా ఈజాతరకు వస్తారు . కనుమ ఒక్కరోజు మాత్రమే ఈపండుగ జరుగుతుంది . ఉదయము నుంచి ప్రత్యేకపూజలు,భజన కార్యక్రమాలతో పాటు వినోదకార్యక్రమాలూ జరుగుతాయి . కొండదిగువప్రాంతములో జాతరౌత్సవాలు జరుగుతాయి .

చరిత్ర[మార్చు]

ఎన్నో యేల్ల క్రిందట ద్వాపర యుగములో విష్ణుమూర్తి శ్రీక్రిస్ణావతారములో వుందేటపుడు ఈకొండపైన గోవులను కాపలా కాసే సమయములో సేద తీరేవాడని,అందుకే ఈకొండకు గోవర్ధగిరి అని పేరువచ్చిందని గ్రామస్థులు తెలుపుతున్నారు .ఈ కొండపై శ్రీకృష్ణుని పతిమ గోవిందస్వామి రూపములో దర్శనమిస్తుంది .ఈ కొండపై అక్కడక్కడ పెద్ద పెద్ద రాతిబండలు కప్పబడి వుండగ లోపల గుహవున్నట్లు తెలుస్తోంది . కొండపై ఓ భాగాన సింహాద్రీఅప్పన్న పాదముద్రికలు కూడా కనబడడం విశేషము. మరో వషయమేమిటంటే కొండపై చంద్రుని ప్రతిమతో పాటు ఆంజనేయస్వామి పూజచేసేటట్లు కూర్చొనే ఆనవాళ్ళు వుండడం గమనార్హం .

మూలము[మార్చు]

వార్తా దిన పత్రిక శ్రీకాకుళం ఎడిసన్ సౌజన్యముతో (తేదీ 14-జనవరి-2008 9వ పేజి.). కూర్పు : డా.శేషగిరిరావు-శ్రీకాకుళం

గోవిందపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం సంతకవిటి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,382
 - పురుషుల సంఖ్య 693
 - స్త్రీల సంఖ్య 689
 - గృహాల సంఖ్య 342
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11